అవును నిజమే.. మార్కె్ట్ లో బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. 2023 ఫిబ్రవరి 05వ తేదీ బుధవారం రోజున మరోసారి పసిడి ధరలు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 950 పెరిగి రూ.79 వేల 50కి చేరుకుంది. ఇక 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1040 పెరిగి రూ. 86 వేల 240కి చేరుకుంది. ఇక కేజీ వెండి ధర రూ. 1000 పెరిగి రూ.1,07, 000లకు చేరుకుంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.
దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర (Gold Rates) రూ.79 వేల20గా ఉండగా.. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 86వేల 390 గా ఉంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 79 వేల50గా ఉంది.10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.86 వేల 240 గా ఉంది.
ఇక హైదరాబాద్ విషయానికి వస్తే.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.79 వేల 50గా ఉండగా... 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.86 వేల 240గా ఉంది. బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 79 వేల 50గా ఉంది. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.86 వేల 240గా ఉంది.
వెండి ధరల విషయానికి వస్తే
ఇక వెండి ధరలు బుధవారం రోజున ఊహించని రీతిలో పెరిగాయి. కేజీ వెండి ధర ఏకంగా రూ. 1000 పెరిగింది. ప్రస్తుతం మార్కెట్ లో కేజీ వెండి ధర లక్ష ఏడు వేల రూపాయలుగా ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్ కత్తాలలో కేజీ వెండి ధర రూ. రూ. 99వేల 500గా ఉంది. ఇక హైదరాబాద్ , చెన్నైలో ధర లక్ష ఏడు వేల రూపాయలుగా ఉంది.
గమనిక : బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి కొనుగోలు చేసేటప్పుడు మళ్లీ ధరలు చూసుకోవాల్సి ఉంటుంది.
Also Read : Mehndi: గర్భిణులకు మెహందీ హానికరమా.. నిపుణులు ఏమంటున్నారు?