BIG BREAKING : అబ్బా సాయిరాం : భారీగా పడిపోయిన గోల్డ్ రేట్స్.. హైదరాబాద్ లో తులం ఎంతంటే?

గత కొంతకాలంగా ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్న పసిడి ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకున్న పరిణామాలు, అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాల ప్రభావంతో దేశీయంగా బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి.

New Update
gold

బంగారం కొనాలనుకునే వారికి ఇది పెద్ద గుడ్ న్యూస్. గత కొంతకాలంగా ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్న పసిడి ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకున్న పరిణామాలు, అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాల ప్రభావంతో దేశీయంగా బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. కేవలం 24 గంటల వ్యవధిలోనే 10 గ్రాముల బంగారంపై ఏకంగా రూ.4,300 వరకు తగ్గడం విశేషం. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా తాజా ధరల వివరాలు ఇలా ఉన్నాయి. 

తెలుగు రాష్ట్రాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం నిన్నటితో పోలిస్తే రూ. 4,300 తగ్గింది.  దీంతో ప్రస్తుత ధర రూ. 1,48,860 కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం  రూ. 3,950 మేర తగ్గింది. దీంతో ప్రస్తుత మార్కెట్ ధర రూ. 1,36,450 వద్ద కొనసాగుతోంది. బంగారంతో పాటే వెండి కూడా భారీగా పతనమైంది. ఏకంగా కేజీ వెండిపై రూ. 10,000 తగ్గింది. దీంతో ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 2,60,000 వద్ద ట్రేడ్ అవుతోంది.

ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,36,450గా ఉండగా..  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,49,010గా ఉంది.  ఇక ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,36,600గా ఉండగా..  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,49,010గా ఉంది. అటు చెన్నైలో22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,37,450గా ఉండగా..  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,49,860గా ఉంది.  

ఎప్పుడూ డిమాండ్ కాస్త ఎక్కువ

చెన్నై మార్కెట్లో ఎప్పుడూ డిమాండ్ కాస్త ఎక్కువగా ఉండటం వల్ల దేశంలోని మిగిలిన నగరాల కంటే అక్కడ బంగారం ధర కొంత అదనంగా ఉంటుంది. ఢిల్లీలోనూ లోకల్ టాక్స్ ల వల్ల ధర స్వల్పంగా ఎక్కువే ఉంది.

బంగారం ధరలు సమయాన్ని ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి. కొనేముందు చూసుకోగలరు. 

Advertisment
తాజా కథనాలు