/rtv/media/media_files/2026/02/17/currency-in-circulation-touches-record-40-lakh-crore-2026-02-17-21-45-33.jpg)
Currency in circulation touches record 40 lakh crore
దేశంలో డిజిటల్ చెల్లింపులు రోజురోజుకు వేగంగా పెరుగుతున్నాయి. తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) పరిశోధనా విభాగం ఎకోరాప్ కీలక విషయాన్ని వెల్లడించింది. ఈ ఏడాది జనవరి నాటికి దేశవ్యాప్తంగా రూ.40 లక్షల కరెన్సీ చలామణిలో ఉన్నట్లు పేర్కొంది. గతేడాదితో పోలిస్తే 11.1 శాతం పెరిగింది. నగదు జీడీపీ నిష్పత్తి 2021, మార్చిలో 14.4 శాతం ఉంది. ప్రస్తుతం 11.2 శాతానికి తగ్గిపోయింది. ప్రధానంగా దేశంలో డిజిటల్ చెల్లింపులు అనేవి ఆర్థిక కార్యకలాపాల్లో అధిక వాటాను సొంతం చేసుకుంటున్నట్లు నివేదిక తెలిపింది.
Also Read: మరీ ఇంత దిగజారిపోయారా.. ఢిల్లీ ఏఐ సమ్మిట్‌లో దొంగతనం
గత పదేళ్లలో చూసుకుంటే 2013, మార్చిలో కరెన్సీ చలామణి రూ.11.8 లక్షల కోట్ల నుంచి 2016, మార్చి నాటికి రూ.16.6 లక్షల కోట్లకు పెరిగాయి. ఇక నోట్ల రద్దు జరిగిన తర్వాత 2017, మార్చిలో రూ.13.4 లక్షల కోట్లకు తగ్గాయి. కరోనా వల్ల 2021, మార్చి నాటికి రూ.28.5 లక్షల కోట్లకు పెరిగాయి. నగదు చలామణి పెరుగుతున్నా కూడా కరెన్సీ జీడీపీ రేషియో 2022, మార్చిలో 13.7 శాతం ఉంది. 2023లో 12.4 శాతం, 2024 మార్చిలో11.9 శాతం, 2025 మార్చి నాటికి 11.26 శాతానికి తగ్గిపోయింది. చివరికి 2026 జనవరి నాటికి 11-11.2 శాతానికి చేరింది.
Also Read: పడిపోయిన భారత విదేశీ మారకం నిల్వలు.. వారంలోనే 6.7 బిలియన్ డాలర్ల నష్టం
కరెన్సీ రికార్డు స్థాయిలో పెరిగేందుకు కఠినమైన పన్ను రూల్స్ అమలు, తక్కువ వడ్డీ రేట్లు, మారుతున్న కుటుంబాల ఖర్చు కారణమని నివేదిక తెలిపింది. UPI లావాదేవీల వాల్యూమ్ల ఆధారంగా చిన్న విక్రేతలకు 2025 జులైలో జారీ అయిన 18 వేల జీఎస్టీ నోటీసుల వల్ల కర్ణాటక, పశ్చిమ బెంగాల్, కేరళలో ATM విత్‌డ్రాలు గణనీయంగా పెరిగాయి. చిరు వ్యాపారులు మళ్లీ నగదు నిల్వచేసుకోవడాన్ని ఇది సూచిస్తుంది. డిపాజిట్ల పెరుగుదల, తక్కువ వడ్డీ రేట్లు సైతం ప్రజల్లో ముందుజాగ్రత్తగా కరెన్సీ పొదుపును పెంచాయి.
Follow Us