ప్రముఖ ప్రైవేట్ టెలికాం సంస్థలైన రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలు ఇటీవల తమ రీఛార్జ్ ప్లాన్‌లను అధికంగా పెంచేశాయి. దాదాపు 50 నుంచి 100 రూపాయల వరకు పెంచేశాయి. దీంతో సామాన్యులకు అది చాలా భారంగా మారింది. రీఛార్జ్ చేసుకోవాలంటే కాస్త ఆలోచిస్తున్నారు. ఇది కూడా చూడండి: తీరాన్ని తాకిన తుపాను..జిల్లాలకు అధికారుల హెచ్చరికలు ఈ నేపథ్యంలో ప్రముఖ ప్రభుత్వ టెలికాం కంపెనీ అయినా బిఎస్ఎన్ఎల్ ఎంట్రీ ఇచ్చింది. అతి తక్కువ ధరలోనే రీఛార్జ్ ప్లాన్‌లను అందించి జియో, ఎయిర్‌టెల్, విఐ కంపెనీలకు భారీ షాక్ ఇచ్చింది. అంతేకాదు.. భారీ ఆఫర్లు ప్రకటించి చీపెస్ట్ ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో లక్షల మంది యూజర్లు బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్‌కు కన్వర్ట్ అయ్యారు. ఇక ఇదే అదునుగా భావించిన బీఎస్ఎన్ఎల్ కంపెనీ కస్టమర్లను ఆకట్టుకోవడానికి తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా మరో అదిరిపోయే ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఇది కూడా చూడండి: తెలంగాణలో ఆ ఉద్యోగ నోటిఫికేషన్ రద్దు.. చీపెస్ట్ ప్లాన్ తక్కువ ధర ఎక్కువ వ్యాలిడిటీ కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ సరికొత్త ప్లాన్ ఒక వరం అనే చెప్పాలి. కేవలం రూ.200 లకే 90 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తోంది. అవునండీ మీరు విన్నది నిజమే. మరి ఈ ప్లాన్‌లో ఏఏ బెనిఫిట్స్ అందుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది కూడా చూడండి: దాడులు మరింత బలాన్ని ఇస్తాయి..గౌతమ్ అదానీ రూ.200ల ప్లాన్‌లో వినియోగదారులు 90 రోజుల వ్యాలిడిటీ పొందుతారు. 300 నిమిషాల కాల్స్ మాట్లాడుకోవచ్చు. అలాగే 6జీబీ డేటా పొందొచ్చు. ఇంకా 99 ఎస్ఎమ్ఎస్‌లు ఫ్రీగా లభిస్తాయి. అయితే ఫ్రీ కాల్స్‌ను ఏ నెట్‌వర్క్‌కైనా యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా చూడండి: ఇండియాలో బెస్ట్ టూరిస్ట్ ప్లేసెస్ ఇవే..? దీంతోపాటు మరో రీఛార్జ్ ప్లాన్ ఉంది. కేవలం రూ.499లతో రీఛార్జ్ చేస్తే 90 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఇందులో అన్‌లిమిటెడ్ కాల్స్, 300 ఎస్ఎంఎస్‌లు పొందొచ్చు. అందువల్ల ఒక మంచి ప్లాన్ కోసం ఎదురుచూస్తున్న బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు ఇదొక వరం అని చెప్పాలి.