Air Taxies:5 నిమిషాల్లోనే ఎయిర్‌పోర్ట్‌కి.. త్వరలో ఫ్లయింగ్ ట్యాక్సీలు

బెంగళూరు కెంపెగౌడ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ త్వరలో ఎగిరే ట్యాక్సీలను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ట్రాఫిక్ దృష్ట్యా కెంపెగౌడ ఎయిర్‌పోర్ట్ సార్లా ఏవియేషన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందిరానగర్ టూ ఎయిర్‌పోర్టుకు కేవలం 5 నిమిషాల్లో చేరుకోవచ్చు.

New Update
flying air taxies

బెంగళూరు సిటీలో ట్రాఫిక్ రద్దీ ఎలాంటి ఉంటుందో అందరికీ తెలిసిందే. దీన్ని దృష్టిలో పెట్టుకుని బెంగళూరు కెంపెగౌడ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. నగర శివార్ల నుంచి కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లడానికి చాలా మంది ట్రాఫిక్‌తో ఇబ్బంది పడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ఎయిర్‌పోర్ట్ ఫ్లైయింగ్ టాక్సీలను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది.

ఇది కూడా చదవండి: తెలంగాణలో కొత్త టీచర్ల చేరిక నేడే

సమయం ఆదా..

ఎయిర్‌పోర్ట్‌కు తొందరగా చేరాలనే ఉద్దేశంతో ఈ సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సరళా ఏవియేషన్, బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. బెంగళూరు లోని కొన్ని ప్రాంతాల నుంచి కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ ట్యాక్సీలను ప్రవేశపెట్టాలని భావిసున్నారు. ఈ ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ ట్యాక్సీల వల్ల ప్రయాణ సమయం తగుతుంది. 

ఇది కూడా చదవండి: చెన్నైలో భారీ వర్షాలు.. వరదల్లో చిక్కుకున్న రజినీకాంత్!

బెంగళూరులోని ఇందిరానగర్ నుంచి కౌంపెగౌడ విమానాశ్రయానికి చేరాలంటే కనీసం 50 నిమిషాల సమయం పడుతుంది. అదే ఈ ఎయిర్ ట్యాక్సీలతో అయితే కేవలం 5 నిమిషాల్లో ఎయిర్‌పోర్టుకు చేరుకోవచ్చు. ఈ ఫ్లైయింగ్ టాక్సీలు బెంగళూరు నగరానికి చాలా ముఖ్యమని సరళా ఏవియేషన్ సిఇఒ అడ్రియన్ ష్మిత్ తెలిపారు. అయితే, ఇంకా ఈ ప్రాజెక్ట్ ప్రారంభ దశలోనే ఉందని త్వరలోనే తీసుకొస్తామని తెలిపారు. ఈ ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ ట్యాక్సీలు వచ్చేసరికి రెండు నుంచి మూడు సంవత్సరాలు పట్టవచ్చని తెలిపారు. 

ఇది కూడా చదవండి: America-Ap: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం..ఏపీకి చెందిన ముగ్గురి మృతి!

సాధారణ హెలికాప్టర్ల కంటే ఈ ఎగిరే ట్యాక్సీలు వేగంగా ప్రయాణిస్తాయి. అలాగే వాతావరణానికి ఎలాంటి హాని కలిగించకుండా నిశ్శబ్దంగా కూడా ప్రయాణిస్తాయి. బెంగళూరులో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సిటీలో దీని అవసరం తప్పకుండా ఉంటుంది. ప్రయాణికులకు కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. మిగతా రాష్ట్రాలు కూడా వీటిని తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. వీటివల్ల పర్యావరణానికి ఎలాంటి హాని లేకపోవడం, ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టడానికి చాలా మంది మొగ్గుచూపుతున్నారు. 

ఇది కూడా చదవండి: Hyundai ఐపీఓ ప్రారంభం.. ఎంత ఇన్వెస్ట్ చేయాలంటే?

Advertisment
Advertisment
తాజా కథనాలు