మార్కెట్‌లోకి వచ్చేస్తున్న బజాజ్ ఎలక్ట్రిక్ ఆటోలు.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 251కి.మీ

ప్రముఖ ఆటోమొబైల్‌ సంస్థ బజాజ్‌ ఆటో లిమిటెడ్‌ బజాజ్‌ గోగో పేరుతో ఎలక్ట్రిక్ ఆటోలను తీసుకొచ్చింది. పీ5009, పీ5012, పీ7012 పేరుతో మూడు ఆటోలను కంపెనీ లాంచ్‌ చేసింది. ఈ ఆటోలో సింగిల్‌ ఛార్జితో 251 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని కంపెనీ తెలిపింది. 

New Update
Bajaj Electric Auto

Bajaj Electric Auto Photograph: (Bajaj Electric Auto)

మార్కెట్‌లోకి ఎన్నో కొత్త కొత్త రకాల ఆటోలు వస్తుంటాయి. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తోంది. బైక్‌లు, ఆటోలు, కార్లు ఇలా అన్ని కూడా ఎలక్ట్రిక్‌లోనే ఎక్కువగా వస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ ఆటోమొబైల్‌ సంస్థ బజాజ్‌ ఆటో లిమిటెడ్‌ బజాజ్‌ గోగో (Bajaj Gogo) పేరుతో ఎలక్ట్రిక్ ఆటోలను తీసుకొస్తుంది. కార్గో, పాసింజర్‌ సెగ్మెంట్‌లో వివిధ రకాల ఉత్పత్తులను కూడా తీసుకురానున్నట్లు కంపెనీ ఇటీవల తెలిపింది. ఈ క్రమంలో భాగంగా మొదట పీ5009, పీ5012, పీ7012 పేరుతో మూడు ఆటోలను కంపెనీ లాంచ్‌ చేసింది.

ఇది కూడా చూడండి: హిందువుగానే పుట్టా.. అలాగే చనిపోతా : డీకే శివకుమార్ సంచలన కామెంట్స్ !

ఇది కూడా చూడండి: TG News: గద్దర్ సినీ అవార్డులపై భట్టి కీలక ప్రకటన.. ఆ పండగరోజే ప్రారంభం!

ఆటోల సైజ్, సామర్థ్యాన్ని బట్టి ధరలు..

వీటిలో పీ అంటే పాసింజర్ వెహికల్ అని, మొదటి నంబర్లు అంటే ఆటోల సైజ్‌ను తెలియజేస్తాయి. ఇక చివర ఉన్న రెండు అంకెలు 9kWh, 12kWh బ్యాటరీ సామర్థ్యాన్ని తెలియజేస్తాయి. అయితే పీ5009 ధరను కంపెనీ రూ.3,26,797గా నిర్ణయించగా పీ7012 ధరను రూ.3.83 లక్షలుగా నిర్ణయించింది. ఈ ఎలక్ట్రిక్ ఆటోలను దేశవ్యాప్తంగా ఉన్న బజాజ్ ఆటో డీలర్ షిప్‌ల దగ్గర కూడా బుక్ చేసుకోవచ్చు. ఈ ఆటోలో సింగిల్‌ ఛార్జితో 251 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని కంపెనీ తెలిపింది. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు