/rtv/media/media_files/KcdLWCUlNgYfn2W5f3C5.jpg)
Gold rates
గత కొన్ని రోజుల నుంచి తగ్గిన బంగారం ధరలు నేడు పెరిగాయి. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం జరుగుతుండటంతో బంగారానికి డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలో హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మీద రూ.3 వేలు పెరిగి రూ.1,52,200కు చేరుకుంది. అదేవిధంగా వెండి ధర కూడా రికార్డు స్థాయిలో పెరిగింది. కేజీ వెండి ధర క్రితం రోజుతో పోలిస్తే రూ.9,000 పెరిగి రూ.2.49 లక్షలకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా ఔన్సు బంగారం ధర 4,205 డాలర్లకు చేరుకోగా, వెండి ధర 67.32 డాలర్లుగా నమోదైంది. అలాగే డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ కూడా బలపడింది. నేటి ట్రేడింగ్‌లో రూపాయి 60 పైసలు పెరిగి 95.25 వద్ద కొనసాగుతోంది.
GOVT CUTS GOLD BASE IMPORT PRICE BY USD 80/10 GM TO USD 1,343/10 GM
— RedboxGlobal India (@REDBOXINDIA) June 12, 2026
Follow Us