/rtv/media/media_files/2025/03/28/BoflMttNjzqgIaDcvFuP.jpg)
April 1st Photograph: (April 1st)
కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొన్ని మార్పులు జరగనున్నాయి. ఆదాయపు పన్ను, క్రెడిట్ కార్డు, యూపీఐ సేవలు, టీడీఎస్ వంటి వాటిలో రూల్స్ మారనున్నాయి. కొత్త పన్ను విధానం ప్రకారం. రూ.12 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి ట్యాక్స్ ఉండదు. స్టాండర్డ్ డిడక్షన్ రూ.75 వేలతో కలిపి మొత్తం రూ.12.75 లక్షల వరకు ఎలాంటి ట్యాక్స్ లేదు. అలాగే ప్రస్తుతం 60ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు బ్యాంకుల్లో డిపాజిట్లపై వార్షిక వడ్డీ రూ.50వేలు దాటితే ట్యాక్స్ కట్టాల్సి వచ్చేది.
ఇది కూడా చూడండి: Ganja: గంజాయి బ్యాచ్‌కు బిగ్ షాక్.. తాగినా, అమ్మినా పదేళ్ల జైలు శిక్ష, లక్ష జరిమానా!
ఇప్పుడు దాన్ని రూ.లక్షకు పెంచారు. అలాగే 60 ఏళ్ల లోపు వారికి అయితే రూ.40 వేల నుంచి రూ.50వేలకు పెంచారు. LRS స్కీమ్ కింద ఆర్థిక ఏడాదిలో రూ.7 లక్షలు దాటితే టీసీఎల్ వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం దీన్ని రూ.10 లక్షలకు పెంచారు. బ్యాంకుల్లో ఎడ్యుకేషన్ లోన్ తీసుకుని ఆ మొత్తాన్ని స్టూడెంట్ ఫీజు కోసం విదేశాలకు పంపితే ఎలాంటి TCS ఉండదు.
ఇది కూడా చూడండి: IPL 2025: SRHకు నిరాశ.. లక్నో సూపర్ జెయింట్స్ విక్టరీ
క్రెడిట్ కార్డు నిబంధనలు
ఎస్బీఐ కార్డ్స్ క్రెడిట్ కార్డుల రివార్డులపై కోత విధించింది. ఎయిరిండియా టికెట్, స్విగ్గీ బుకింగ్‌లపై రివార్డులను కూడా తగ్గించింది. ఎయిరిండియా SBI ప్లాటినమ్ కార్డు, ఎస్‌బీఐ సింప్లీక్లిక్ క్రెడిట్ కార్డు, ఎయిరిండియా SBI సిగ్నేచర్ కార్డుదారులకు వచ్చే ఏప్రిల్ 1 నుంచి అన్ని బెనిఫిట్స్ తగ్గించనుంది.
ఇది కూడా చూడండి: Bharat-America:అమెరికా నుంచి సాయం ఆగిపోతే కనుక ...10 లక్షల మరణాలు !
యూపీఐ సర్వీసులు పనిచేయవు
ఏప్రిల్ 1 నుంచి ఇన్‌యాక్టివ్ నంబర్లు ఉన్న యూపీఐ సర్వీసులు పనిచేయవు. ఇప్పటికే బ్యాంకులు, పేమెంట్ ప్రొవైడర్లను NPCI ఆదేశించింది. ఆయా ఫోన్ నంబర్లను వెంటనే డీయాక్టివేట్ చేయాలని సూచించింది. ఏప్రిల్ నుంచి యూపీఐ లైట్ వ్యాలెట్‌లో డబ్బులను బ్యాంక్ అకౌంట్లకు పంపుకోవచ్చు. యూపీఐ లైట్ కోసం పిన్, పాస్‌కోడ్, బయోమెట్రిక్ తప్పనిసరిగా ఉండాలి.