iPhone: ఐఫోన్ 13, 14, 15లపై ఆఫర్ల జాతర.. ఇప్పుడు మిస్ అవ్వొద్దు!

ఆపిల్ ఐఫోన్ కొనుక్కోవాలనుకుంటున్నారా? మీకో గుడ్ న్యూస్. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో ఐఫోన్ 13, 14, 15 లను భారీ డిస్కౌంట్ లతో కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా భారీ బ్యాంక్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ తగ్గింపులతో మరింత తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.

New Update
 iPhone

iPhone: ఎప్పటి నుంచో ఒక మంచి యాపిల్ ఐఫోన్‌ను కొనుక్కోవాలని చూస్తున్నారా? అయితే అధిక ధర కారణంగా మీ ప్లాన్‌ను మార్చుకుంటున్నారా? ఇప్పుడు అలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతి తక్కువ ధరకే మీకు నచ్చిన ఐఫోన్‌ను కొనుక్కోవచ్చు. అదెలాగో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. 

ప్రతి ఏడాది ఫెస్టివల్ సీజన్లో ఇ-కామర్స్ రిటైలర్లు ఐఫోన్‌లతో పాటు ఇతర ఆపిల్ డివైజ్‌లపై భారీ తగ్గింపులను అందిస్తాయి. అందులో అమెజాన్ (Amazon) ఒకటి. ఈ అమెజాన్ తన ప్లాట్‌ఫారమ్‌లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా ఐఫోన్‌లపై ఎప్పటికప్పుడు భారీ తగ్గింపులను అందిస్తోంది. ఈ ఏడాది కూడా అలాంటిదే జరుగుతోంది. భారీ ధరల తగ్గింపుతో పాటు, బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా అందించబడుతున్నాయి. ముఖ్యంగా ఈ సేల్‌లో iPhone 13, iPhone 14, iPhone 15లను తక్కువకే కొనుక్కోవచ్చు.

ఇది కూడా చదవండిః కెన్యాలో పంచాయితీ పెట్టిన అదానీ.. అసలేమైందంటే?

ఐఫోన్లపై ఆపర్ల జాతర

iPhone 13

ఐఫోన్ 13 లోని 128GB స్టోరేజ్ వేరియంట్ లాంచ్ సమయంలో రూ. 59,600కి ప్రారంభించబడింది. ఇప్పుడు గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో రూ. 43,999కి జాబితా చేయబడింది. అదే సమయంలో HDFC బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, Amazon Pay ICICI క్రెడిట్ కార్డ్ లేదా HSBC బ్యాంక్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ చెల్లింపుపై 10 శాతం వరకు తక్షణ తగ్గింపు లేదా క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అంతేకాకుండా పాత లేదా ఇప్పటికే ఉన్న ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా రూ. 41,799 ఆదా చేసుకోవచ్చు. అయితే ఎక్స్ఛేంజ్ ఆఫర్ పొందాలంటే పాత ఫోన్ ఎలాంటి డ్యామేజ్ లేకుండా ఉండాలి. మోడల్ బట్టి ధర మారుతుంది. 

ఇది కూడా చదవండిః ఆ ఇంట్లో ఏదో తెలియని శక్తి ఉందంటున్న ఆదా!

iPhone 14

iPhone 14 లోని 128GB స్టోరేజ్ వేరియంట్ లాంచ్ సమయంలో రూ. 69,900కి ప్రారంభించబడింది. ఇప్పుడు ఈ సేల్‌లో రూ. 59,900కి లిస్ట్ అయింది. వినియోగదారులు HDFC బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, HSBC బ్యాంక్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ లేదా Amazon Pay ICICI క్రెడిట్ కార్డ్ పై 10 శాతం వరకు తక్షణ తగ్గింపు లేదా క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.  

ఇది కూడా చదవండిః అబ్బ అనిపించిన హెబ్బా పటేల్.. కొత్త ఫొటోలు ఏమున్నాయ్ గురూ

iPhone 15

 iPhone 15 లోని 128GB స్టోరేజ్ వేరియంట్ గత ఏడాది రూ.79,900కి లాంచ్ చేయబడింది. ఇప్పుడు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో రూ. 69,900కి జాబితా చేయబడింది. కస్టమర్‌లు HDFC బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, HSBC బ్యాంక్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ లేదా Amazon Pay ICICI క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లింపుపై 10 శాతం వరకు తక్షణ తగ్గింపు లేదా క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అంతేకాకుండా భారీ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. 

ఇది కూడా చదవండిః ఎంబీబీఎస్ అడ్మిషన్ వివాదం .. సుప్రీంకోర్టు కీలక తీర్పు  

Advertisment
Advertisment
తాజా కథనాలు