/rtv/media/media_files/2025/02/12/6P7wnyFEozqkArjKZyjV.jpg)
Amazon Air Conditioners Offers Early Discounts Up to 53 percentage off
శీతాకాలం పోయింది.. ఇప్పుడు వేసవి కాలం వచ్చేసింది. ఉదయం నుంచే ఎండలు మండిపోతున్నాయి. దీంతో చాలా మంది ఇప్పటి నుంచే ఎయిర్ కండిషనర్లను కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫారమ్ అమెజాన్ వివిధ బ్రాండ్ల ఏసీ మోడళ్లపై భారీ తగ్గింపులను అందుబాటులోకి తీసుకొచ్చింది. దాదాపు 53 శాతం వరకు డిస్కౌంట్‌లను పొందే అవకాశాన్ని అందిస్తోంది. వోల్టాస్, LG, హిటాచి, క్యారియర్, బ్లూ స్టార్, హైయర్, డైకిన్, వర్ల్‌పూల్ వంటి ఎన్నో బ్రాండ్‌లపై ఈ డిస్కౌంట్ అందిస్తోంది.
Also Read : ఇది మరీ దారుణం.. రేషన్ కార్డు దరఖాస్తుకు రూ.2వేలు.. మీసేవ సెంటర్ల వసూళ్ల దందా!
ఎయిర్ కండిషనర్ డీల్స్
డైకిన్ 1.5 టన్ 3 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ AC అసలు ధర రూ58,990గా ఉంది. అయితే ఇప్పుడు 37 శాతం తగ్గింపుతో రూ.36,990లకు అందుబాటులో ఉంది. అలాగే దీనిపై రూ.2,000 అదనపు బ్యాంక్ ఆఫర్లు వర్తిస్తాయి.
Also Read: TTD: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. ఇకపై వాట్సాప్‌లోనే
బ్లూ స్టార్ 1.5 టన్ 5 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ AC (మోడల్: IA518FLU వైట్) అసలు ధర రూ.70,000 గా ఉంది. అయితే ఇప్పుడు దీనిని 44 శాతం భారీ డిస్కౌంట్‌తో కేవలం రూ.38,990కి కొనుక్కోవచ్చు.
వర్ల్‌పూల్ సుప్రీం కూల్ ఎక్స్‌ప్యాండ్ 1.5 టన్ 5 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ACపై కూడా అమెజాన్ భారీ డిస్కౌంట్ అందిస్తోంది. దీని అసలు ధర రూ.71,900గా ఉంది. అయితే ఇప్పుడు 47 శాతం తగ్గింపుతో కేవలం రూ.37,950 లకే సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా అదనంగా రూ.2,000 బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది.
వోల్టాస్ 1.5 టన్ 5 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ACని అమెజాన్‌లో రూ.75,990కి బదులుగా రూ.39,650కి కొనుక్కోవచ్చు. అంటే దీనిపై 48% తగ్గింపు లభిస్తుందన్న మాట. అంతేకాకుండా అదనంగా రూ.2,000 బ్యాంక్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది.
Also Read: Trump-musk: మస్క్ కు హై పవర్ ఇచ్చిన ట్రంప్...ఇక కోతలే..కోతలు!
క్యారియర్ 1.5 టన్ 3 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ AC (మోడల్: R32 వైట్) ధరను కంపెనీ రూ.67,790గా నిర్ణయించింది. అయితే ఇప్పుడు దీనిని కేవలం రూ.34,990కి కొనుక్కోవచ్చు. అంతేకాకుండా బ్యాంక్ ఆఫర్ల ద్వారా రూ.2,000 వరకు తగ్గింపు పొందొచ్చు.
వోల్టాస్ వెక్ట్రా ఎలిగెంట్ 1.5 టన్ 3 స్టార్ ఫిక్స్‌డ్ స్పీడ్ స్ప్లిట్ ACను కూడా తక్కువ ధరకే కొనుక్కోవచ్చు. దీని అసలు ధర రూ.67,999 కాగా ఇప్పుడు రూ..34,250కి కొనుక్కోవచ్చు. దీనిపై 50% తగ్గింపు లభిస్తుంది. దీంతోపాటు అదనంగా రూ.2,000 బ్యాంక్ ఆఫర్ పొందొచ్చు.
LG 1.5 టన్ 3 స్టార్ డ్యూయల్ ఇన్వర్టర్ స్ప్లిట్ AC (మోడల్: TS-Q18JNXE3 వైట్)ను సగం ధరకే అమెజాన్‌లో కొనుక్కోవచ్చు. దీని అసలు ధర రూ.78,990గా కంపెనీ నిర్ణయించింది. అయితే ఇప్పుడు దీనిని 53% తగ్గింపుతో రూ.36,990లకి సొంతం చేసుకోవచ్చు. అదనంగా రూ.2,000 బ్యాంక్ డిస్కౌంట్ పొందొచ్చు.
Also Read: Trump-musk: మస్క్ కు హై పవర్ ఇచ్చిన ట్రంప్...ఇక కోతలే..కోతలు!
వేసవి కాలం ప్రారంభమైపోయింది. కాబట్టి వేడి మండకముందే అమెజాన్ ఈ ఆఫర్లు ప్రకటించింది. ఇప్పుడు కొనుగోలు చేయడం వలన తక్కువ ధర లభిస్తుంది. ప్రస్తుతానికి ఈ డిస్కౌంట్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ మున్ముందు ధరలు పెరిగే అవకాశం ఉంది.