BSNL 4G Service: BSNL వాడేవారికి గుడ్‌న్యూస్.. ఆ జిల్లాలో 4G సేవలు

గుంటూరు జిల్లా తాడికొండలో బీఎస్ఎన్ఎల్ 4G సేవలు అందుబాటులోకి వచ్చాయి. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌.. బీఎస్ఎన్ఎల్ 4G సేవలను బీఎస్ఎన్ఎల్ సీఎండీ రాబర్ట్ రవి, ఏపీ చీఫ్ జనరల్ మేనేజర్ శేషాచలంతో కలిసి ప్రారంభించారు.

New Update
BSNL 4G Service: BSNL వాడేవారికి గుడ్‌న్యూస్.. ఆ జిల్లాలో 4G సేవలు

గుంటూరు జిల్లా తాడికొండలో బీఎస్ఎన్ఎల్ 4G సేవలు అందుబాటులోకి వచ్చాయి. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌.. బీఎస్ఎన్ఎల్ 4G సేవలను బీఎస్ఎన్ఎల్ సీఎండీ రాబర్ట్ రవి, ఏపీ చీఫ్ జనరల్ మేనేజర్ శేషాచలంతో ప్రారంభించారు. ఈ విషయాన్ని ఆయన తన ఎక్స్‌ ఖాతాలో పంచుకున్నారు. దేశ వ్యాప్తంగా వచ్చే ఏడాది మార్చిలోగా నూరు‌ శాతం బీఎస్ఎన్ఎల్ 4G సేవలను అందుబాటులోకి తీసుకురాబోతున్నామని తెలిపారు. అలాగే మారుమూల‌ గ్రామాలకు సైతం‌ బీఎస్ఎన్ఎల్ 4G సేవలను విస్తరించడానికి కృషి‌ చేస్తున్నామని పేర్కొన్నారు.

Also Read: మ‌ట్టి మిద్దె కూలి కుటుంబం మృతి.. రూ.10 లక్షల సాయం ప్రకటించిన చంద్రబాబు!

ఇదిలాఉండగా..  ఆగస్టు 15 నుంచి దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో 4జీ సేవలను ప్రారంభించేందుకు బీఎస్ఎన్ఎల్ పనులు ముమ్మరం చేస్తోంది. గ్రామాల్లో కూడా 4జీ సేవలు అందించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే బీఎస్‌ఎన్‌ఎల్‌ వినియోగదారులు 4G సిమ్ కార్డ్‌లకు అప్‌గ్రేడ్ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు 5జీ సిమ్ కార్డులను సైతం అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ 5G సిమ్ కార్డ్‌లు ఏపీ, తెలంగాణ, కేరళలో అందుబాటులో ఉన్నాయి. 4జీ నెట్‌వర్క్ అందుబాటులోకి వచ్చిన కొద్దికాలంలోనే 5జీ సేవలు కూడా ప్రారంభించే అవకాశం ఉంది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

టీచర్‌ను చెప్పుతో కొట్టిన విద్యార్థిని సస్పెండ్

టీచర్‌ని చెప్పుతో కొట్టిన విద్యార్థినిపై రఘు ఇంజనీరింగ్ కాలేజ్ చర్యలు తీసుకుంది. యువతి వెంకటలక్ష్మీని కాలేజీ యాజమాన్యం సస్పెండ్ చేసింది. కాలేజీలో విద్యార్థిని ఫోన్ లెక్చరర్ తీసుకున్నందుకు ఆమెను బూతులు తిడుతూ దాడికి దింగింది.

New Update
raghu clg

కాలేజ్‌లో టీచర్‌ని చెప్పుతో కొట్టిన స్టూడెంట్‌పై యాజమాన్యం చర్యలు తీసుకుంది. ఆంద్రప్రదేశ్ విజయనగరంలోని రఘు ఇంజనీరింగ్ కాలేజ్‌లో ఇది జరిగింది. టీచర్‌ను దుర్భాషలాడుతూ ఆమెపై దాడికి దిగింది యువతి. ఆ విద్యార్థిని టీచర్‌ను చెప్పుతో కొడుతున్నప్పుడు అక్కడే ఉన్న కొందరు విద్యార్థులు వీడియో తీశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. విద్యార్థిని ప్రవర్తన పట్ల ఇంటర్‌నెట్‌లో చాలా మంది సీరియస్ అయ్యారు. విద్యార్థిని గురుగుబెల్లి వెంకటలక్ష్మీని రఘు ఇంజనీరింగ్ కాలేజీ సస్పెండ్ చేసింది.

విద్యార్థిని.. ఆ ఫోన్ 12వేలు ఇస్తావా? ఇవ్వవా? అంటూ టీచర్‌ని బూతులు తిడుతూ గొడవకు దిగింది. చివరికి ఫోన్ ఇస్తావా? లేదంటే చెప్పుతో కొట్టమంటావా అంటూ టీచర్ పై రెచ్చిపోయింది. దీంతో టీచర్ ఇవ్వను అనేసరికి ఆమెపై చెప్పుతో దాడి చేసింది. ఆ తర్వాత టీచర్ విద్యార్థిని మధ్య గొడవ పెరగడంతో పక్కనే ఉన్న విద్యార్థులు, ఇతర టీచర్లు వారిని విడిపించే ప్రయత్నం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విద్యార్థిని తీరుపై  నెటిజన్లు మండిపడుతున్నారు.

(Raghu Engineering College | student | teacher | latest-telugu-news | viral-video)

Advertisment
Advertisment
Advertisment