BIG BREAKING: తీహార్ జైలుకు కవిత లాయర్లు.. విడుదల ఎప్పుడంటే?

బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఈరోజు రాత్రి 7 గంటలకు ఆమె తీహార్‌ జైలు నుంచి విడుదల కానున్నారు. బుధవారం మధ్యాహ్నం కవిత ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకోనున్నారు.

New Update
BIG BREAKING: తీహార్ జైలుకు కవిత లాయర్లు.. విడుదల ఎప్పుడంటే?

ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అలాగే సీబీఐ, ఈడీ కేసుల్లో రూ.10 లక్షల చొప్పున బాండ్‌లు సమర్పించాలని ఆదేశించింది. మంగళవాం మధ్యాహ్నం 2.30 PM గంటలకు తీహార్ జైలు అధికారులకు కవిత రిలీజ్ ఆర్డర్ కాపీ అందింది. గంటన్నర పాటు ఈ డాక్యుమెంట్ ప్రాసెస్ జరగనుంది. ఈరోజు రాత్రి 7 గంటలకు తీహార్ జైలు నుంచి కవిత విడుదల కానున్నారు. ఆమెకు బెయిల్ రావడంతో బీఆర్‌ఎస్‌ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు.

Also Read: ఎట్టకేలకు కవితకు బెయిల్.. అసలు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏంటో తెలుసా?

కవితకు స్వాగతం పలికేందుకు పెద్దఎత్తున గులాబీ శ్రేణులు తీహార్ జైలు వద్దకు చేరుకుంటున్నారు. అయితే ఈరోజు రాత్రికి కవిత, కేటీఆర్, హరీశ్‌ రావు ఢిల్లీలోనే ఉండనున్నారు. బుధవారం ఉదయం ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రేపు మధ్యాహ్నమే కవిత ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు రానున్నారు. కవితకు బెయిల్ వచ్చిన సందర్భంలో మాజీ సీఎం కేసీఆర్.. కేటీఆర్‌తో ఫోన్లో మాట్లాడారు. చాలా సంతోషంగా ఉందని అన్నారు. కూతురిని చూసేందుకు ఆయన ఎదురుచూస్తున్నారు.
Also Read: కవిత బెయిల్‌పై కేసీఆర్ రియాక్షన్ ఇదే.. కేటీఆర్‌కు ఫోన్ చేసి

అయితే కవిత.. హైదరాబాద్‌కు వచ్చాక తండ్రిని చూసేందుకు నేరుగా ఎర్రవల్లి ఫార్మ్‌హౌస్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సుప్రీంకోర్టు కవితకు బెయిల్ మంజూరు చేయడంతో పాటు మరికొన్ని కీలక ఆదేశాలు కూడా జారీ చేసింది. సాక్ష్యాలను తారుమారు చేయకూడదని.. ప్రొసీడింగ్‌ను ప్రభావితం చేయకూడదని ఆదేశించింది. అలాగే దేశం విడిచి వెళ్లడానికి అనుమతి లేదని.. తప్పనిసరిగా పాస్‌పోర్టును సమర్పించాలని చెప్పింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు