Kavitha: ఈరోజు జైలు నుంచి కవిత విడుదల!

మనీలాండరింగ్‌ కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత బెయిల్‌ పిటిషన్‌పై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.కవిత బెయిల్‌ పిటిషన్‌పై జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరపనుంది. ఈసారి కవితకు బెయిల్ వస్తుందని బీఆర్ఎస్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

New Update
Kavitha: ఈరోజు జైలు నుంచి కవిత విడుదల!

BRS MLC Kavitha: మద్యం కుంభకోణం కేసులో రీసెంట్‌గా ఆమ్ ఆద్మీ నేత మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో మనీ లాండరింగ్, మద్యం కుంభకోణం కేసుల్లో జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావొచ్చని ఆ పార్టీ భావిస్తోంది. ఈరోజు సుప్రీంకోర్టులో కవిత బెయిల్ మీద విచారణ జరగనుంది. జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరపనుంది. దర్యాప్తు సంస్థలు అడ్డు చెప్పకపోతే కచ్చతంగా బెయిల్ వస్తుందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. కవిత అనారోగ్య కారణాల వల్ల కూడా బెయిల్ ఇవ్వాలనే యెచనలో సుప్రీంకోర్టు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నమ్మకంతోనే కవిత అన్న, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 25 మంది ఎమ్మెల్యేలు, ముఖ్య బీఆర్ఎస్ నేతలతో ఢిల్లీకి వెళ్ళారని సమాచారం. అందరితో కలిసి కవితకు గ్రాండ్‌గా వెల్క్మ్ చెప్పడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని చెబుతున్నారు. ఇక కవితను హైదరాబాద్ తీసుకువచ్చాక కూడా బీఆఎస్ శ్రేణులు ర్యాలీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

మద్యం పాలసీ కేసులో మార్చి 15న కవితను ఈడీ అరెస్ట్‌ చేసింది. ఇదే కేసులో ఏప్రిల్‌ 15న సీబీఐ అరెస్టు చేసింది. గత కొన్ని నెలలుగా కవిత తీహార్ జైలులో ఉన్నారు. ఈ క్రమంలో ఆమె ఆరోగ్యం బాగా పాడయిందని, చాలా సన్నగా అయిపోయారని వార్తలు వచ్చాయి.

Also Read: Ukraine: క్షిపణులతో రష్యా మళ్ళీ దాడి..సాయం చేయమంటున్న జెలెన్ స్కీ

Advertisment
Advertisment
తాజా కథనాలు