KCR: రంగంలోకి కేసీఆర్.. రేపే ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం తుంటి ఎముక గాయం కారణంగా ఆపరేషన్ చేయించుకున్న కేసీఆర్ అప్పటినుంచి విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉన్న చేయలేదు. ఇక, రేపు మధ్యాహ్నం 12:45 నిమిషాలకు కేసిఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. By V.J Reddy 31 Jan 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి KCR To Take Oath as MLA: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి రీఎంట్రీ ఇవ్వనున్నారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీలు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ (BRS Party) ఓటమి చెందిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఫలితాల అనంతరం ప్రగతి భవన్ ఖాళీ చేసి తన ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్.. కాలు జారీ కింద పడడంతో తుంటి ఎముక విరిగి యశోద ఆసుపత్రిలో సర్జరీ కావడంతో గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా (Gajwel MLA) గెలుపొందిన కేసీఆర్ ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయలేదు. రేపు ముహూర్తం ఫిక్స్.. తుంటి ఎముకకు సర్జరీ తరువాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు మాజీ సీఎం కేసీఆర్. తాజాగా ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ముహూర్తం ఖరారు అయింది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీకి చేరుకోనున్న కేసిఆర్. మధ్యాహ్నం 12:45 నిమిషాలకు స్పీకర్ ఛాంబర్ లో ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం. ఎల్ఓపి (Leader Of Opposition) నేతగా బాధ్యతలు స్వీకరించనున్నారు. అనంతరం నేరుగా అసెంబ్లీలోని ఎల్ఓపి కార్యాలయం చేరుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. Also Read: నాకు కాదు మంత్రి కోమటిరెడ్డికి పంపండి.. నోటీసులపై కేటీఆర్ సెటైర్లు ఒకటనుకంటె అయింది ఇంకోటి.. ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ కు ఊహించని షాక్ తగిలింది. రెండు స్థానాల్లో ఎమ్మెల్యేగా పోటీ చేశారు కేసీఆర్. కామారెడ్డి, గజ్వేల్ స్థానాల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన కేసీఆర్ కు ఎదురుదెబ్బ తగిలింది. రెండు స్థానాల్లో పోటీ చేసిన కేసీఆర్ గజ్వేల్ లో విజయం సాధించి కామారెడ్డి లో ఓటమి చెందారు. ఆనాడు కేసీఆర్ ను రెండు స్థానాల్లో ఓడించేందుకు గజ్వేల్ లో బీజేపీ నేత ఈటల రాజేందర్, కామారెడ్డి లో సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు పోటీగా ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్ ను ఓడిద్దాం అనుకున్న వారు ఓటమి చెందారు. కొండగల్, కామారెడ్డి లో నిలబడ్డ సీఎం రేవంత్.. కొడంగల్ లో గెలిచారు. అలాగే హుజురాబాద్, గజ్వేల్ నియోజకవర్గాల్లో నిలబడ్డ ఈటల రాజేందర్ రెండు స్థానాల్లో ఓటమి చెందారు. ఇది రాజేందర్ కు చెరగని దెబ్బ రాష్ట్ర రాజకీయాల్లో మిగిలిపోయింది. DO WATCH: #kcr #cm-revanth-reddy #brs-party #telangana-latest-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి