BRS Jagadeesh Reddy: విద్యుత్ కొనుగోళ్లతో నష్టం కాదు.. లాభం జరిగింది: జగదీశ్ రెడ్డి చెప్పిన లెక్కలివే!
ఛత్తీస్‌గఢ్ తో గత కేసీఆర్ ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ ఒప్పందంతో రూ.6000 కోట్ల నష్టం కాదు... అంతకు మించి లాభం జరిగిందన్నారు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి. 17 వేల మిలియన్ యూనిట్లు తీసుకొని రూ.7000 కోట్లు చెల్లిస్తే రూ.6000 కోట్ల దుర్వినియోగం ఎలా అవుతుందని ప్రశ్నించారు.
Jagadeesh Reddy: గత ప్రభుత్వంపై నిందలు వేయడానికి, కేసీఆర్ (KCR) పై బురద జల్లాలన్న స్వార్థ రాజకీయంతో విచారణ కమిషన్లు ఏర్పాటు చేశారని మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి రేవంత్ సర్కార్ పై ధ్వజమెత్తారు. నాలుగు అంశాల్లో ఎక్కడా చిన్న తప్పు లేదని, ఒక్క రూపాయి కూడా నష్టం జరగలేదని అర్థమైందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా కమిషన్ తో మీడియా సమావేశం పెట్టించి గతంలో కాంగ్రెస్ (Congress), భాజపా (BJP) నేతలు మాట్లాడిన మాటలు చెప్పించారని ఆరోపించారు. తద్వారా ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపే ప్రయత్నం చేశారు. కేసీఆర్ తన లేఖలో అన్ని అంశాలను స్పష్టంగా వివరించారన్నారు.
తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే @jagadishBRS
గత ప్రభుత్వంపై నిందలు వేయడానికి, కేసీఆర్ పై బురద జల్లాలన్న స్వార్థ రాజకీయంతో విచారణ కమిషన్లు ఏర్పాటు చేశారు
ప్రజలకు అన్ని విషయాలు స్పష్టంగా అర్థమయ్యాయన్నారు. కమిషన్ కు ఎలాంటి ముందస్తు అభిప్రాయాలు ఉండరాదన్నారు. దురదృష్టవశాత్తూ కమిషన్ తన ఉద్దేశాన్ని ముందే బయట పెట్టిందన్నారు. వాస్తవానికి జస్టిస్ నరసింహారెడ్డి (Justice Narasimha Reddy) విచారణకు అంగీకరించి ఉండాల్సింది కాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఛత్తీస్ ఘడ్ (Chhattisgarh) ఒప్పందంతో రూ.6000 కోట్ల నష్టం కాదు... అంతకు మించి లాభం జరిగిందన్నారు.
17 వేల మిలియన్ యూనిట్లు తీసుకొని ఛత్తీస్ ఘడ్ కు రూ.7000 కోట్లు చెల్లిస్తే రూ.6000 కోట్ల దుర్వినియోగం ఎలా అవుతుంది? అని ప్రశ్నించారు. జగదీశ్ రెడ్డి పూర్తి ప్రెస్ మీట్ ను ఈ వీడియోలో చూడండి.