KCR : నేడు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్న కేసీఆర్ బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ గురువారం 8 వ సారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 12.30 నిమిషాలు దాటిన తరువాత ఆయన స్పీకర్ ఛాంబర్ లో ఎమ్మెల్యేగా బాధ్యతలు తీసుకోనున్నారు. By Bhavana 01 Feb 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Ex CM KCR : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి(Telangana EX CM) , బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(KCR) 8 వ సారి ఎమ్మెల్యేగా(MLA) గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత కేసీఆర్ మూడో సారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. గురువారం మధ్యాహ్నం 12.30 నిమిషాల తరువాత ఆయన స్పీకర్ ఛాంబర్ లో ప్రమాణ స్వీకారం చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స.. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల(Assembly Elections Results) అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) ఏర్పడింది. రెండు రోజులకే కేసీఆర్ ప్రమాదవశాత్తూ గాయపడడంతో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయలేదు. తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స అనంతరం సుమారు ఆరు నుంచి ఎనిమిది వారాలు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్స్ తెలిపారు. శాసన సభ్యుడిగా ప్రమాణ స్వీకారం... దీంతో ఆయన గత రెండు నెలలుగా గజ్వేల్ వ్యవసాయ క్షేత్రంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇప్పుడే కర్ర సాయంతో ఆయన కొంచెం నడవగలుగుతున్నారు. దీంతో గురువారం మధ్యాహ్నం 12 దాటిన తరువాత ఆయన అసెంబ్లీకి చేరుకుంటారు. ముందుగా ఆయన అసెంబ్లీ ఆవరణలో ప్రతిపక్ష నేతగా పూజలు చేసి ఆ తరువాత గడ్డం ప్రసాద్ ఛాంబర్ మధ్యాహ్నం 12.40 గంటలకు కేసీఆర్ శాసన సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేసీఆర్ 1985 నుంచి 1999 వరకు ఓటమి ఎరగని ఎమ్మెల్యేగా కేసీఆర్ నిలిచారు. 2001 లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కేసీఆర్ మరోసారి సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. తెలంగాణ ఉద్యమ ప్రభావంతో 2004 ఎన్నికల్లో సిద్దిపేట ఎమ్మెల్యేతో పాటు కరీంనగర్ ఎంపీ పోటీ చేసి రెండు చోట్ల విజయం సాధించడంతో ఎంపీగా కొనసాగారు. దాంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. 2009 ఎన్నికల్లో మహబూబ్ నగర్ ఎంపీగా కేసీఆర్ విజయం సాధించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014, 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ నుంచి కేసీర్ విజయం సాధించారు. గజ్వేల్(Gajwel) నియోజకవర్గం ఎమ్మెల్యేగా కేసీఆర్ గురువారం మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేసీఆర్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తరలివస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో అసెంబ్లీ ప్రాంగణం వద్ద భారీ భద్రత ఏర్పాట్లను చేశారు. Also Read : విజయ్ దేవరకొండ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన బ్యూటీ #brs #kcr #telangana #politics #mla #ex-cm-kcr మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి