BRS Party: బీఆర్‌ఎస్‌కు మరో బిగ్ షాక్.. ఆ 14 మంది ఎమ్మెల్యేలు ఎక్కడ?

పార్టీ ఫిరాయింపులు, ప్రొటోకాల్ ఉల్లంఘనలపై స్పీకర్ కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైన BRSకు సొంత పార్టీ ఎమ్మెల్యేలు బిగ్ షాక్ ఇచ్చారు. ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి రావాలని ఆదేశాలిచ్చినా.. 14 మంది డుమ్మా కొట్టారు. దీంతో.. వీరిలో ఎంత మంది పార్టీ మారుతారు? అన్న అంశంపై చర్చ జరుగుతోంది.

New Update
BRS Party: బీఆర్‌ఎస్‌కు మరో బిగ్ షాక్.. ఆ 14 మంది ఎమ్మెల్యేలు ఎక్కడ?

BRS MLA's: పార్టీ ఫిరాయింపులు, ప్రోటోకాల్ ఉల్లంఘనలపై స్పీకర్ ను కలిసేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సిద్ధమయ్యారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR), మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) నేతృత్వంలో వీరు మరికొద్ది సేపట్లో స్పీకర్ ను కలవనున్నారు. ఈ మేరకు అసెంబ్లీలోని బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో వీరు సమావేశం అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీఆర్ఎస్ అధికారిక X ఖాతాలో పోస్టు చేశారు. అయితే.. ఈ వీడియలో సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్, అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాత్రమే కనిపిస్తున్నారు.

బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్ లో చేరిపోయారు. దీంతో ఆ పార్టీ బలం 28కి పడి పోయింది. అప్పుడు బీఆర్ఎస్ విడుదల చేసిన వీడియోలో కేవలం 14 మంది మాత్రమే కనిపించడంతో.. వీరిలో ఎంత మంది జంప్ అవడానికి సిద్ధం అవుతున్నారో? అన్న చర్చ జోరుగా సాగుతోంది.

హాజరు కాని ఎమ్మెల్యేలు..

గజ్వేల్ ఎమ్మెల్యే - కేసీఆర్

ఎల్బీనగర్ ఎమ్మెల్యే - సుధీర్ రెడ్డి

ఉప్పల్ ఎమ్మెల్యే - బండారు లక్ష్మారెడ్డి

మేడ్చల్ ఎమ్మెల్యే - మల్లారెడ్డి

దుబ్బాక ఎమ్మెల్యే - కొత్త ప్రభాకర్ రెడ్డి

సనత్ నగర్ ఎమ్మెల్యే - తలసాని శ్రీనివాస్ యాదవ్

సూర్యాపేట ఎమ్మెల్యే - జగదీష్ రెడ్డి

కరీంనగర్ ఎమ్మెల్యే - గంగుల కమలాకర్

ఆసిఫాబాద్ ఎమ్మెల్యే - కోవ లక్ష్మి

బోధ్ ఎమ్మెల్యే - అనిల్ జాదవ్

అలంపూర్ ఎమ్మెల్యే- విజేయుడు

హుజురాబాద్ ఎమ్మెల్యే - పాడి కౌశిక్ రెడ్డి

బాల్కొండ ఎమ్మెల్యే - వేముల ప్రశాంత్ రెడ్డి

జనగాం ఎమ్మెల్యే - పల్లా రాజేశ్వర్ రెడ్డి

ఈ 14 మంది లిస్ట్ లో కేసీఆర్ ఎర్రవల్లిలోని ఫామ్ హౌజ్ లో ఉన్నారు. ఆయన పార్టీ నేతలతో భేటీలు అవుతున్నారు. అలంపూర్ ఎమ్మెల్యే విజేయుడు కాంగ్రెస్ లో చేరడం కన్ఫామ్ అయ్యింది. మంచి రోజులు లేవని ఆయన ఇప్పుడు కాంగ్రెస్ కండువా కప్పుకోవడం లేదు. దీంతో.. మిగతా 12 మంది ఎందుకు రాలేదన్నది తెలియాల్సి ఉంది. ఎమ్మెల్యేలంతా ఈ రోజు స్పీకర్ ను కలవడానికి రావాలని పార్టీ ముందుగానే ఆదేశాలు ఇచ్చింది. అయినా వీరు ఎందుకు రాలేదన్న అంశంపై పొలిటికల్ సర్కిల్స్ లో తీవ్ర చర్చ సాగుతోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు