పోటాపోటీగా అంబటి వర్సెస్ జన సైనికులు.. సినిమాలపై రగడ

ప్రస్తుతం మంత్రి అంబటి రాంబాబు చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి. దీనిపై జనసేన శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నారు. అంబటి హీరోగా ఓ సినిమా తీస్తున్నామన్నారు. ప్రొడెక్షన్ నెంబర్ 6093 జగ్గు బాయ్ సమర్పించు 'సందులో సంబరాల శ్యామ్ బాబు @రాంబాబు' అనే పోస్టర్ ని జనసేన శ్రేణులు విడుదల..

New Update
పోటాపోటీగా అంబటి వర్సెస్ జన సైనికులు.. సినిమాలపై రగడ

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పై మరోసారి తీవ్రమైన కామెంట్స్ చేశారు ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబు. పవన్ పై త్వరలోనే సినిమా తీయనున్నట్లు వెల్లడించారు. ఈ సినిమాకు 'బ్రో' టైటిల్ మాదిరిగా 'మ్రో' అనే టైటిల్ పెడతామని పేర్కొన్నారు. మ్యారేజెస్/రిలేషన్స్-అఫెండర్ ను కలిపి మ్రో అనే పేరు పెట్టే ఆలోచన ఉందన్నారు. అంతేకాకుండా ఈ సినిమా స్టోరీ ఎలా ఉంటుందనేది కూడా చెప్పారు మంత్రి అంబటి.

ఒక మంచి ఫ్యామిలీలో పుట్టిన ముగ్గురు అన్నదమ్ముల్లో ఇద్దరు మాత్రం అద్భుతమైన విజయాలు సాధించి పెద్ద సెలబ్రిటీలు అవుతారు. కానీ మూడో వ్యక్తి మాత్రం ఎక్కడికి వెళ్లినా ఊగిపోతూ.. రెచ్చిపోతూ ఉపన్యాసాలు ఇస్తాడని తెలిపారు. అలాగే ఆ వ్యక్తి చేసుకున్న పెళ్లిళ్ల గురించి కూడా సినిమాలో చూపిస్తామన్నారు. క్లైమాక్స్ లో మాత్రం మహిళా లోకం మెచ్చుకునే గుణపాఠం నేర్పుతారంటూ మంత్రి అంబటి సినిమా స్టొరీ వెల్లడించారు.

ప్రస్తుతం మంత్రి అంబటి రాంబాబు చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి. దీనిపై జనసేన శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నారు. అంబటి హీరోగా ఓ సినిమా తీస్తున్నామన్నారు. ప్రొడెక్షన్ నెంబర్ 6093 జగ్గు బాయ్ సమర్పించు 'సందులో సంబరాల శ్యామ్ బాబు @రాంబాబు' అనే పోస్టర్ ని జనసేన శ్రేణులు విడుదల చేశారు.

అంబటి వేషాధారణలో వచ్చిన జనసేన నేత, పూజలు చేసి షూటింగ్ చిత్రీకరణ ప్రారంభించారు. త్వరలోనే మంత్రి అంబటి రాంబాబు జీవితంపై సినిమా పూర్తవుతుందని చెప్పారు. అయితే అంబటికి మంచి హీరోయిన్లు మాత్రం దొరకడం లేదన్నారు. త్వరలోనే రెడ్ లైట్ ఏరియాలో వెతికి మంచి నటిని తీసుకొస్తామని సెటైర్లు వేశారు. ఇననైనా పవన్ కళ్యాణ్ పై అనవసర మాటలు మానుకోవాలని సూచించారు.

అసలు ఈ సినిమాల వివాదానికి కారణం ఏంటంటే: ఇటీవల రిలీజ్ అయిన 'బ్రో' సినిమాతో ఈ వివాదం మొదలైంది. ఈ సినిమాలో మంత్రి అంబటి గతంలో చేసిన డాన్స్ ను పోలుస్తూ నటుడు పృథ్వీ క్యారెక్టర్ ఉంది. అలాగే పేరు కూడా శ్యామ్ బాబు అని పెట్టడంతో మరింత వివాదానికి కారణమైంది. పృథ్వీ, మంత్రి అంబటిని పోలుస్తూ సోషల్ మీడియాలో పలు వీడియోలు వైరల్ గా మారాయి. బ్రో సినిమాలో శ్యామ్ బాబు క్యారెక్టర్.. అంబటి రాంబాబుదేనని వీడియోలు నెట్టింట హల్చల్ చేశాయి.

ఈ విషయాన్ని మొదటగా పట్టించుకోని అంబటి.. ఆ తర్వాత జరుగుతన్న పరిణామాలతో తీవ్ర స్థాయిలో రియాక్ట్ అయ్యారు. బ్రో సినిమా కలెక్షన్లు పడిపోయాయని.. అందుకే వివాదాలు సృష్టించి కలెక్షన్లు పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. పవన్ వారాహి వాహనంను తన కాళ్ల కింద పెట్టుకోవడంతోనే అమ్మవారికి కోపం వచ్చిందని దుయ్యబట్టారు. ఇకపై పవన్ సినిమాలు తీసే నిర్మాతలు అన్నీ దృష్టిలో పెట్టుకుని తీయాలని సూచించారు మంత్రి అంబటి రాంబాబు.

Advertisment
Advertisment
తాజా కథనాలు