Revanth Reddy: వారి ఆశయాలను బ్రిటిష్‌ జనతా పార్టీ నాశనం చేస్తోంది

దేశ వ్యాప్తంగా 77వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన ఆయన.. మహత్మా గాధీ, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్, జవహర్‌ లాల్‌ నెహ్రూలను స్మరించుకున్నారు.

New Update
TS Congress Election Promises: స్టూడెండ్స్ కు ఫ్రీగా ఇంటర్నెట్, రూ.5 కే జాబ్ అప్లికేషన్.. కాంగ్రెస్ సంచలన హామీలివే?

అహింసా మార్గంతో పోరాటం చేయవచ్చని నీరూపించిన మహానుభావుడు మహత్మాగాంధీ అని పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి అన్నారు. గాంధీ భవన్‌లో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న రేవంత్ రెడ్డి.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 140 కోట్ల మంది భారతీయులకు 77వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నేడు ముగ్గురిని స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. హింసకు దూరంగా ఉండి దేశానికి మహాత్మగాంధీ స్వాతంత్ర్యం తీసుకొచ్చారని, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ దేశంలో ఓటును ఆయుధంగా మార్చి అందరికీ సమాన హక్కులు కల్పించారని గుర్తు చేశారు. అంతే కాకుండా కరువు కాటకాలతో తల్లడిల్లుతున్న దేశ ప్రజలకు సంక్షేమ పథకాలు అందిచిన గొప్పనేత జవహార్‌ లాల్‌ నెహ్రూ అన్నారు. ఈ ముగ్గురిని స్మరించుకొని వారికి నివాళులు అర్పించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.

వీర వనిత ఇందిరా గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించగా.. దేశం ఐటీ రంగంలో పురోగతి సాధించడానికి కృషి చేసిన గొప్ప నాయకుడు రాజీవ్‌ గాంధీ అన్నారు. పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్‌లు దేశాన్ని ఆర్థికంగా పురోగతివైపు నడిపించారన్న ఆయన.. దేశంలో విభజించు.. పాలించు విధానంతో, అల్లర్లు సృష్టిస్తూ నేటి బ్రిటిష్‌ జనతా పార్టీ వెళ్తోందని రేవంత్‌ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌ గాంధీ మాత్రం విద్వేశాన్ని వీడాలనే లక్ష్యంతో భారత్‌ జోడో యాత్ర చేపట్టినట్లు గుర్తు చేశారు. దేశ మొదటి ప్రధాని నెహ్రూ నుంచి మన్మోహన్‌ సింగ్‌ వరకు 60 ఏళ్ల పాలనలో చేసిన అప్పుకంటే మోడీ 9 ఏళ్ల పాలనలో చేసిన అప్పు ఎక్కువని ఆరోపించారు.

దేశంలో నిరుద్యోగం తాండవిస్తోందన్నారు. బీజేపీ వస్తే జీడీపీ పెరుగుతుందన్నారని గుర్తు చేసిన ఆయన.. కానీ వంట గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయని విమర్శించారు. మోడీ పాలనలో దేశం ఆర్థికంగా చిన్నాభిన్నమైందని ఆరోపించారు. దేశంలో అల్లర్లు చెలరగుతున్నాయన్నారు. ఒకవైపు మణీపూర్‌లో అల్లర్లు తారాస్థాయికి వెళ్తే నరేంద్ర మోడీ, అమిత్‌ షా మాత్రం కర్ణాటకలో ఓట్ల వేటకు వెళ్లారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మోడీ పాలన నియంత కంటే నికృష్టంగా మారిందని విమర్శించారు. ఇండియా కూటమి ద్వారానే మళ్లీ దేశానికి మంచిరోజులు వస్తాయని రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు.

మరోవైపు రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన రేవంత్‌.. కాంగ్రెస్ వ్యూహాలను కేసీఆర్‌ కాపీ కొడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీకి ప్రజాధారణ ఎక్కువ కావడంతో కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుందన్న ఆయన.. అందుకే సీఎం రైతు రుణమాఫీ, ఉద్యోగ నోటిఫికేషన్లు, డబుల్‌ బెడ్‌ రూమ్‌లు ఇస్తున్నారన్నారు. రాష్ట్రంలో ప్రజలకు మేలు జరుగుతుందంటే అది కేవలం కాంగ్రెస్‌ వల్లే అని రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు