ఆ రికార్డ్ దరిదాపుల్లోకి కూడా కోహ్లీ రాలేడు.. లెజెండరీ ప్లేయర్ కామెంట్స్

సచిన్ వంద సెంచరీల రికార్డును కోహ్లీ బద్దలు కొడతాడనే అంశంపై బ్రయన్ లారా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. విరాట్ ఇంకా ఎన్నో రికార్డులు తిరగరాస్తారు. కానీ 100 సెంచరీలు చేయడం కష్టం. మరో నాలుగేళ్లు పూర్తి ఫిట్‌నెస్‌తో ఆడటం సులభం కాదు. కాబట్టి ఆ దరిదాపుల్లోకి కూడా కోహ్లీ రాలేడన్నారు.

New Update
ఆ రికార్డ్ దరిదాపుల్లోకి కూడా కోహ్లీ రాలేడు.. లెజెండరీ ప్లేయర్ కామెంట్స్

Brian Lara Comments On Kohli : భారత లెజెండరీ క్రికెటర్ సచిన్ (Sachin) 100 సెంచరీల రికార్డును కోహ్లీ బద్దలు కొడతాడనే ఆంశంపై వెస్టిండీస్‌ మాజీ క్రికెటర్ బ్రయాన్‌ లారా (Brian Lara)ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న లారా.. విరాట్ (Virat Kohli)ఎన్నో రికార్డులు తిరగరాస్తాడని కొనియాడారు. అయితే సచిన్ నెలకొల్పిన వంద సెంచరీలను మాత్రం కోహ్లీ అందుకోలేడని, అది అసంభవం అంటూ తన అభిప్రాయం వెల్లడించారు.

దక్షిణాఫ్రికాతో మొత్తం మూడు ఫార్మాట్ల సిరీస్‌ని ఆడేందుకు టీమిండియా ఆటగాళ్లు ఇప్పటికే ఆఫ్రికా బయల్దేరారు. డిసెంబర్ 10 నుంచి టీ20 సిరీస్‌తో ఈ పర్యటన ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే ఇండియన్ క్రికెట్ ప్లేయర్లపై లారా ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా సీనియర్ ప్లేయర్ కోహ్లీ, శుభుమాన్ గిల్ లు ఆటతీరును పొగిడేస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. క్రికెట్లో తన ప్రపంచ రికార్డుల్ని భారత ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ బద్దలు కొడతాడని అభిప్రాయపడ్డాడు. ఇదే క్రమంలో సచిన్ 100 సెంచరీలను కోహ్లీ బ్రేక్ చేయడంపై కూడా మాట్లాడిన ఆయన.. 'కోహ్లీ బ్యాటింగ్‌కు నేను పెద్ద అభిమానిని. అయినప్పటికీ అతని వయస్సు ఇప్పుడు 35. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ లో 80 సెంచరీలున్నాయి. 100 మార్క్ చేరుకోవడానికి ఇంకా 20 కావాలి. అయితే కోహ్లీ ఇప్పటినుంచి ప్రతి సంవత్సరం ఐదు సెంచరీలు సాధిస్తే.. టెండూల్కర్‌తో సమానంగా ఉండటానికి ఇంకో నాలుగేళ్లు కావాలి. అప్పుడు కోహ్లీకి 39 సంవత్సరాలు. కాబట్టి ఇది చాలా కఠినమైన పనే. 100 సెంచరీల రికార్డును విరాట్ కోహ్లీ బద్దలు కొడతాడనే విషయంలో నేను ఆశాజనకంగా లేను. ఈ చారిత్రాత్మకమైన రికార్డు బ్రేక్ చేస్తాడని ఎవరూ ఊహించలేనిది అన్నారు.

భారత్‌కు వచ్చే ఏడాది కేవలం ఐదు వన్డేలు మాత్రమే షెడ్యూల్ చేయబడ్డాయి. కోహ్లీ T20I భవిష్యత్తు గురించి ఇంకా స్పష్టత లేదు. అతను డిసెంబర్ 2022 నుంచి పొట్టి ఫార్మాట్‌లో ఆడలేదు. కోహ్లి.. టెండూల్కర్‌ను దాటవలసి వస్తే రెడ్-బాల్‌పై బ్యాంకింగ్ చేయాల్సి ఉంటుంది. వచ్చే నాలుగేళ్లపాటు పూర్తి ఫిట్‌నెస్‌తో ఆడడం అనుకున్నంత సులభం కాదు అన్నారు.

ఇది కూడా చదవండి : Rahim: టెస్టు క్రికెట్‌లో తొలి బంగ్లా బ్యాటర్‌.. విచిత్రంగా ఔటైన స్నేక్‌ డ్యాన్సర్‌..! వీడియో!

ఇక 2004లో ఇంగ్లాండ్‌తో టెస్టులో లారా అజేయంగా 400 పరుగులు సాధించిన విషయం తెలిసిందే. కాగా టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు ఇదే. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్లోనూ లారా పేరిటే రికార్డు ఉంది. 1994లో డర్హమ్‌తో కౌంటీ మ్యాచ్‌లో వార్విక్‌షైర్‌ తరఫున లారా అజేయంగా 501 స్కోరు సాధించాడు. కాగా ఈ రికార్డుపై కూడా స్పందించిన ఆయన.. ‘నా రెండు రికార్డుల్ని గిల్‌ బద్దలు కొట్టగలడు. ఈ తరం ఆటగాళ్లలో గిల్‌ అత్యంత ప్రతిభావంతుడు. రానున్న కాలంలో క్రికెట్‌ను శాసిస్తాడు. చాలా పెద్ద రికార్డుల్ని తిరగ రాస్తాడని నమ్ముతున్నా. ప్రపంచకప్‌లో గిల్‌ సెంచరీ చేయకపోవచ్చు. కాని అతను మంచి ఇన్నింగ్స్‌లు ఆడాడు. వన్డేల్లో డబుల్‌ సెంచరీ సాధించాడు. ఐపీఎల్‌లో ఎన్నో మ్యాచ్‌ విన్నింగ్‌ ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఐసీసీ టోర్నీల్లోనూ అలాంటి చాలా ఇన్నింగ్స్‌లు ఆడతాడని తన మనసులో మాట బయటపెట్టారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు