Telangana: బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన బొంతుకు షాక్‌

ఈమధ్య కాలంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి చాలా మంది నేతలు జంప్ చేస్తున్నారు. వీరిలో బొంతు రామ్మోహన్ ఒకరు. అయితే పార్టీలో జాయిన్ అయినప్పుడు సికింద్రాబాద్ సీటును ఇస్తామని చెప్పి ఇప్పుడు మాత్రం బొంతును ఎవ్వరూ పట్టించుకోవడం లేదని టాక్ వినిపిస్తోంది.

New Update
Telangana: బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన బొంతుకు షాక్‌

Bonthu Rammohan: బొంతు రామ్మోహన్‌ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లైట్‌ తీసుకుంటున్నారా అంటే అవుననే వినిపిస్తోంది. బీఆర్ఎస్ నుంచి అసంతృప్తితో కాంగ్రెస్‌లో (Congress) చేరిన బొంతుకు ఇక్కడ కూడా అదే మిగలనుందని తెలుస్తోంది. సికింద్రాబాద్‌ టిక్కెట్‌ కోసం ఆయన తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. దీని కోసం ఇటీవల మున్షీని సైతం కలిశారు. అయితే బొంతు రామ్మోహన్ ఎంత ప్రయత్నించినా సికింద్రాబాద్‌ (Secunderabad) సీటు మాత్రం దక్కలేదు. మరోవైపు సీఎం అపాయింట్‌మెంట్‌ సైతం దొరకడం లేదనే చర్చ జరుగుతోంది. కాంగ్రెస్‌లో పరిస్థితిపై బొంతు అనుచరులు కూడా గగ్గోలు పెడుతున్నారు.

బీఆర్ఎస్‌లో కూడా దక్కని సీటు..

అంతకు ముందు బీఆర్ఎస్‌లో (BRS) ఉన్నప్పుడు కూడా బొంతు రామ్మోహన్ అసంతృప్తిగానే ఉన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రామ్మోహన్ బీఆర్ఎస్ నుంచి ఉప్పల్ నియోజకవర్గ టికెట్ ఆశించి భంగపడ్డారు. ఆ టికెట్ బండారు లక్ష్మణ్‌కు కేటాయించారు. తర్వాత పార్లమెంటు టికెట్ గురించి కూడా చాలానే ప్రయత్నాలు చేశారు. అయితే కూడా దక్కే అవకాశం లేదని తెలియడంతో బొంతు రామ్మోహన్ కాంగ్రెస్‌లో చేరారు. ఇప్పుడు ఇక్కడ కూడా అతనికి మొడిచెయ్యే చూపిస్తున్నారని చెబుతున్నారు.

Also Read:Kejiriwal: ఒకే గదిలో కేజ్రీవాల్, కవిత విచారణ?

Advertisment
Advertisment
తాజా కథనాలు