USA: వ్యోమగాములు లేకుండానే భూమి మీదకు స్టార్ లైనర్ స్పేస్ షిప్

సునీతా విలియమ్స్, బారీ ఇ విల్మోర్ లను అంతరిక్షంలోకి తీసుకువెళ్ళిన స్టార్ లైనర్ షిప్ వాళ్ళు లేకుండానే భూమి మీదకు తిరిగి వచ్చింది. ఈరోజు ఉదయం మెక్సికోలోని సాండ్స అండ్ పేస్ హార్బర్‌‌లో దిగింది.

New Update
USA: వ్యోమగాములు లేకుండానే భూమి మీదకు స్టార్ లైనర్ స్పేస్ షిప్

NASA: ఈ ఏడాది జూన్‌లో స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ అంతరిక్షంలోకి వెళ్ళింది. వారం రోజుల పాటూ అక్కడ ఉంది మిషన్ టెస్ట్ చేయడం, ఫెర్రీ క్రూ, ఆర్బిటరీ ల్యాబొరేటరీకి ఫైనల్ షేఖ్ డౌన్ ఇవ్వడానికి దీనిని పంఇంచారు. ఇందులో ఇద్దరు వ్యోమగాములు సునీతా విలియమ్స్, బారీ ఇ విల్మోర్‌‌లు కూడా వెళ్ళారు. అయితే అంతరిక్షంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ అనుకున్నట్టు ఏమీ జరగలేదు. ఊహించని విధంగా థ్రస్టర్ లోపాలు, హీలియం లీక్‌లు అవడంతో ఇద్దరు వ్యోమగాములను స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్‌లోకి తీసుకురావాలని అనుకున్నారు.

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లో సూపర్‌బగ్‌గా పిలిచే 'ఎంటర్‌బాక్టర్ బుగాండెన్సిస్' అనే బ్యాక్టీరియాను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ బ్యాక్టీరియా క్లోజ్డ్ ఎన్విరాన్‌మెంట్‌లో పెరుగుతుందని, బహుళ ఔషధాలకు నిరోధకత(మల్టీ డ్రగ్ రెసిస్టెంట్)ను కలిగి ఉంటుందని వివరించారు. ఈ బ్యాక్టీరియా బహుళ ఔషధాలకు నిరోధకతను కలిగి ఉండడంతో దీనిని "సూపర్‌బగ్" అని పిలుస్తారు. ఇది  శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం చేస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అయితే పని అయిపోయినా వారు తిరిగి రావడానికి మాత్రం ఇబ్బందులు ఏర్పడ్డాయి.

వీరిని తీసుకెళ్లిన స్టార్‌లైనర్‌ ప్రొపల్షన్‌తో సమస్యలు తలెత్తడంతో వారు దాదాపు 90 రోజులుగా అక్కడే ఉండిపోయారు. వ్యోమగాములు ఇద్దరూ ఎలా వస్తారో కూడా తెలియలేదు. అయితే తాజాగా నాసా ఒక ప్రకటన చేసింది. సునీతా విలయమ్స్, బచ్ లు వచ్చే డాది వస్తారని తెలిపింది. వారు వెళ్ళిన స్టార్ లైనర్ పాడైన కారణంగా అందులోనే మళ్ళీ తీసుకురావడం ప్రమాదకరమని చెప్పింది. వచ్చే ఏడాది ప్రారంభంలో మరో స్పేస్ షిప్‌ను అంతరిక్షంలోకి పంపించి..వారిద్దరినీ తీసుకువస్తామని నాసా చెప్పింది.

కానీవారిని తీసుకువెళ్ళిన స్టార్ లైన్ సపేస్ క్రాఫ్ట్ మాత్రం ఈరోజు తిరిగి భూమిమీదకు వచ్చింది.గమ్‌డ్రాప్-ఆకారపు క్యాప్సూల్ ఉదయం 9:30కి న్యూ మెక్సికోలోని వైట్ సాండ్స్ స్పేస్ హార్బర్‌లో మెల్లగా దిగింది. పారాచూట్‌ల ద్వారా దాని అవరోహణ మందగింపజేసి.. ఎయిర్‌బ్యాగ్‌ల ద్వారా కుషన్ చేశాక అది భూమి మీదకు వచ్చింది. అంతకు ముందు ఆరు గంటల ముందు స్టార్ లైన్ ISS నుండి బయలుదేరింది.

Also Read: Manipur: మణిపూర్‌‌లో మళ్ళీ చెలరేగిన హింస..ఆరుగురు మృతి

Advertisment
Advertisment
తాజా కథనాలు