Baltimore Bridge: బ్రిడ్జ్ ను ఢీ కొట్టిన పడవ.. కుప్పకూలిన వంతెన! అమెరికాలో ఘోర ప్రమాదం జరిగింది. పటాప్‌స్కో నదిలో ప్రయాణిస్తున్న పడవ బాల్టిమోర్ నగరంలో 'ఫ్రాన్సిస్ స్కాట్ కీ' బ్రిడ్జ్ ను బలంగా ఢీ కొట్టింది. వంతెన అమాంతం కుప్పకూలిపోగా కార్లు, 20 మంది గల్లంతు అయినట్లు అధికారులు తెలిపారు. వీడియో వైరల్ అవుతోంది. By srinivas 26 Mar 2024 in ఇంటర్నేషనల్ వైరల్ New Update షేర్ చేయండి Baltimore Bridge Accident: అమెరికాలో ఘోర ప్రమాదం జరిగింది. పటాప్‌స్కో నదిలో ప్రయాణికులతో వెళ్తున్న పడవ (Ship Collision) బాల్టిమోర్ నగరంలో ఒక బ్రిడ్జ్ ను బలంగా ఢీ కొట్టింది. దీంతో 'ఫ్రాన్సిస్ స్కాట్ కీ' బ్రిడ్జ్ అమాంతం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోను మేరీలాండ్ ట్రాన్స్‌పోర్టేషన్ అథారిటీ నెట్టింట షేర్ చేయగా జనాలు ఉలిక్కిపడుతున్నారు. The Francis Scott Key Bridge in Baltimore, Maryland which crosses the Patapsco River has reportedly Collapsed within the last few minutes after being Struck by a Large Container Ship; a Mass Casualty Incident has been Declared with over a Dozen Cars and many Individuals said to… pic.twitter.com/SsPMU8Mjph — OSINTdefender (@sentdefender) March 26, 2024 20 మందికిపైగా గల్లంతు.. ఈ మేరకు సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత భారీ కంటైనర్ షిప్ ఈ వంతెనను ఢీకొట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ యాక్సిడెంట్ జరిగిన సమయంలో వంతెన మీద ప్రయాణిస్తున్న పదుల సంఖ్యలో కార్లు నదిలో పడిపోయినట్లు వెల్లడించారు. 20 మందికిపైగా గల్లంతు అయ్యారని, వారి అచూకికోసం గాలిస్తున్నట్లు తెలిపారు. అలాగే పటాప్‌స్కో నది మీదుగా రాకపోకలు నిలిపివేశారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. Also Read: స్కూల్ టీచర్ పై చెప్పుల దాడి.. తరిమికొట్టిన విద్యార్థులు! #video-viral #boat-accident #america మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి