T BJP: రాజాసింగ్‌ Vs ఈటల.. రాష్ట్ర అధ్యక్ష పదవిపై టీ.బీజేపీలో లొల్లి!

తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవిపై బీజేపీలో వివాదాలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈటల రాజేందర్‌కు ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరిగినప్పటికీ తాజాగా రాజాసింగ్ కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. అధిష్టానం నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.

New Update
T BJP: రాజాసింగ్‌ Vs ఈటల.. రాష్ట్ర అధ్యక్ష పదవిపై టీ.బీజేపీలో లొల్లి!

Raja Singh Vs Etela Rajender: తెలంగాణ బీజేపీలో అంతర్గత వివాదాలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర అధ్యక్ష పదవిపై సీనయర్లు, జూనియర్ల మధ్య సయోధ్య కుదరట్లేదని టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్, మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ మధ్య వార్ నడుస్తోందని, ఒకరిపై ఒకరు పరోక్షంగా కామెంట్స్ చేసుకోవడం చర్చనీయాంశమైంది.

దేశం, ధర్మం పట్ల అవగాహన ఉన్న వ్యక్తికే..
ఈ మేరకు రాష్ట్ర అధ్యక్ష పదవిపై (Telangana BJP President) ఇటీవల రాజాసింగ్ మాట్లాడుతూ.. సీనియర్లకే అధ్యక్ష పదవి ఇవ్వాలని అన్నారు. రాష్ట్ర నేతలతో చర్చించాకే అధ్యక్ష పదవిపై నిర్ణయం తీసుకోవాలి. దేశం, ధర్మం పట్ల అవగాహన ఉన్న వ్యక్తికే అధ్యక్ష పదవి ఇవ్వాలి. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీల అభిప్రాయం తీసుకున్నాకే నిర్ణయం తీసుకోవాలన్నారు. అయితే ఈటల మాట్లాడుతూ.. పార్టీలో కొత్త, పాత నాయకులలో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ కాదు. పార్టీ అంటే కేవలం ఎంపీ, ఎమ్మెల్యేలను గెలిపించుకోవడం కాదు. కొత్త నాయకులు, కార్యకర్తలు వస్తేనే పార్టీ గెలవగలుగుతుందన్నారు. ఇదిలావుంటే.. కొద్ది రోజులుగా బీజేపీ స్టేట్ చీఫ్‌ పదవి ఈటలకు ఇస్తారని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో రాజాసింగ్ కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకోగా.. దీనిపై అధిష్టానం ఏ నిర్ణయం తీసుకోనుందనేది మరికొన్ని రోజుల్లో తేలనుంది.

Also Read: రుషికొండ నాకే ఇవ్వండి.. చంద్రబాబుకు భారీ ఆఫర్ ఇచ్చిన సుఖేష్!

Advertisment
Advertisment
తాజా కథనాలు