Telangana: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక వాయిదా పడింది. ఇప్పటికిప్పుడే అధ్యక్ష మార్పు వద్దని అధిష్ఠానం భావిస్తోంది. మరో 2 నెలల తర్వాతే బీజేపీ నూతన అధ్యక్షుడి నియామించాలని నిర్ణయించుకుంది. By B Aravind 01 Jul 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Telangana BJP President: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక వాయిదా పడింది. మరో 2 నెలల తర్వాతే బీజేపీ నూతన అధ్యక్షుడి నియామకం జరగనుంది. ఇప్పటికిప్పుడే అధ్యక్ష మార్పు వద్దని అధిష్ఠానం భావిస్తోంది. అధ్యక్ష రేసులో చాలామంది నేతలు ఉండటం పార్టీకి తలనొప్పిగా మారిందనే ప్రచారాలు జరుగుతున్నాయి. తమకే ఇవ్వాలని పలువురు సీనియర్ నేతలు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కొత్త - పాత సమన్వయం తర్వాతే అధ్యక్షుడిని ఎంపిక చేయాలనే యోచనలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది. Also Read: ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య..టీచర్ల ఎంపికపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం! ఈటెల రాజేందర్, డీకే అరుణ, రఘునందన్‌రావు, ఎన్ రామ చంద్రరావు, మురళీధర్ రావు, ఆచారి, పాయల్ శంకర్ అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈసారి అధ్యక్ష పదవి ఎవరికి దక్కుతుందో అనేదానిపై ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గతంలో కరీనంగర్ ఎంపీ బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత.. పార్టీకి ఆయన ఒక ఊపు తీసుకొచ్చారనే ప్రశంసలు వచ్చాయి. అయితే బండి సంజయ్.. అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ దూకుడును కొనసాగిస్తుండగా బీజేపీ అధిష్ఠానం ఒక్కసారిగా బండికి బ్రేకులు వేసింది. అనూహ్యంగా ఆయనను పదవిలో నుంచి తప్పించి.. కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించింది. 2020 మర్చి నుంచి 2023 జులై వరకు మాత్రమే బండి సంజయ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేశారు. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న కిషన్‌రెడ్డికి ఈసారి కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పార్టీలో కొత్తవారికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని అధిష్ఠానం భావించింది. ఎవరిని బాధ్యతలు అప్పగించాలనేదానిపై కసరత్తులు చేస్తోంది. Also Read: విద్యుత్ వినియోగదారులకు బిగ్ షాక్.. ఇకపై ఆ బిల్లులు చెల్లవు! #telugu-news #bjp #kishan-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి