MLA Raja Singh: ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెదిరింపు కాల్స్.. చంపేస్తామంటూ వార్నింగ్

బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్‌కు కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి బెదిరించారు. శ్రీరామ నమవి సందర్భంగా శోభయాత్ర చేపడితే చంపేస్తామంటూ ఆయనకు వార్నింగ్ ఇచ్చారు. ఈసారి ఘనంగా శోభయాత్ర చేస్తామని దమ్ముంటే ఆపాలంటూ రాజసింగ్‌ దుండగులకు సవాలు చేశారు.

New Update
Raja Singh: మరో స్టాండప్‌ కమెడియన్‌ని టార్గెట్ చేసిన రాజాసింగ్..

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెదిరింపు ఫోన్ కాల్‌ రావడం చర్చనీయాంశమవుతోంది. కొందరు గుర్తుతెలియని దుండగులు ఆయనకు ఫోన్‌ చేశారు. శ్రీరామ నమవి సందర్భంగా శోభయాత్ర చేపడితే చంపేస్తామంటూ ఆయన్ని బెదిరించారు. అయితే రాజాసింగ్ కూడా వారికి కౌంటర్ వేశారు. దమ్ముంటే శోభయాత్రను ఆపాలంటూ సవాలు చేశారు. గతంలో కంటే ఈసారి ఘనంగా శోభయాత్ర చేస్తామంటూ స్పష్టం చేశారు.

Also Read: జిల్లాల పునర్విభజనపై పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు.. బీఆర్ఎస్, బీజేపీకి సవాల్

ఏటా శోభయాత్ర నిర్వహిస్తున్న రాజాసింగ్

నపుంసకులే ఫోన్‌ చేసి బెదిరిస్తారంటూ మండిపడ్డారు. దమ్ముంటే ముందుకు వచ్చి పోరాడాలని సవాల్ చేశారు. ఈ నేపథ్యంలో రాజాసింగ్ స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఆ దుండగులపై ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఫోన్‌ ఎవరు చేశారనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలాఉండగా.. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రతి సంవత్సరం శ్రీరామ నవమి వేడుక సందర్భంగా శోభయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు బెదిరింపు కాల్ వచ్చినట్లు తెలుస్తోంది.

గతంలో కూడా బెదిరింపు కాల్స్

ఇదిలాఉండగా.. జనవరి 22న యూపీలోని అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజాసింగ్‌కు బెదిరింపు కాల్స్ రావడం చర్చనీయమైంది. అయితే రాజాసింగ్‌కు బెదిరింపు కాల్స్ రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఆయనకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీంతో ఆయన అప్పుడు ఉన్న డీజీపీకి లేఖ కూడా రాశారు. మరోవైపు తనకు పాకిస్థాన్‌ నుంచి కూడా బెదిరింపు కాల్స్ వస్తున్నాయన్నారు.

Also Read: హైదరాబాద్ బాంబ్ బ్లాస్ట్ లపై కిషన్ రెడ్డి సంచలన కామెంట్స్.. అక్కడ కూర్చొని రిమోట్ నొక్కారంటూ

Advertisment
Advertisment
తాజా కథనాలు