Haryana: బీజేపీ తొలి జాబితా విడుదల..సీఎం సైనీ పోటీ ఎక్కడ నుంచి అంటే.. హర్యానాలో ఎన్నికలకు బీజేపీ రెడీ అయిపోతోంది. ఇక్కడ నుంచి పోటీ చేసే అభ్యర్ధుల తొలి జాబితాను విడుదల చేసింది. మొత్తం 67 మందితో కూడిన లిస్ట్‌ను ప్రకటించింది. ప్రస్తుత ముఖ్యమంత్రి నయాబ్ సైనీ లాడ్వా నుంచి పోటీ చేయనున్నారు. By Manogna alamuru 04 Sep 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి BJP First List: ఒక పక్క హర్యానాలో కాంగ్రెస్–ఆప్ ల మధ్య పొత్తు కుదరడం లేదు. మరోవైపు బీజేపీ మాత్రం తన ఫస్ట్ లిస్ట్‌ను విడుదల చేసేసింది. అక్టోబర్ 5న జరిగే ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధం అంటోంది బీజేపీ మొదటి విడతగా 67 మందితో కూడిన అభ్యర్ధుల లిస్ట్‌ను రిలీజ్ చేసింది. ఇక్కడ ఎన్డీఏ-ఇండియా కూటమి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మరోసారి అధికారంలోకి రావాలని బీజేపీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఈసారి అధికారం దక్కించుకోవాలని ఇండియా కూటమి ప్రయత్నిస్తోంది. అయితే ఇండియా కూటమిలో పార్టీల మధ్య సీట్లు పంపకాలపై ఇంకా చర్చలు జరుగుతతూనే ఉన్నాయి. హర్యానాలో మొత్తం 90 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో 67 స్థానాలకు బీజేపీ పేర్లను ప్రకటించింది. మిగిలిన వాటిని రెండవ లిస్ట్‌గా తీసుకురానుంది. మొదటి జాబితాలో ప్రస్తుత ముఖ్యమంత్రి సైనీ లాడ్వా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని చెప్పింది అధిష్టానం. ఇందులో మాజీ మంత్రి అనిల్ విజ్ పేరును కూడా చేర్చింది. ఇతను 2009 నుంచి వరుసగా మూడుసార్లు గెలిచిన అంబాలా కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి విజ్ బరిలోకి దిగనున్నారు. ఇక ఈ ఏడాది మార్చి వరకు కురుక్షేత్ర ఎంపీగా ఉన్న సైనీ… ప్రస్తుతం కర్నాల్ అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జూన్‌లో జరిగిన ఉప ఎన్నికలో ఆయన విజయం సాధించారు. Also Read: Haryana: హర్యానాలో కుదరని పొత్తు..సీట్ల పంపకాల మీద తెగని పంచాయితీ #bjp #elections #haryana #first-list మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి