BJP first list:మరి కాసేపట్లో అధికారికంగా బీజేపీ ఫస్ట్ లిస్ట్ ప్రకటన

తెలంగాణ ఎన్నికల కోసం బీజెపీ తన మొదటి జాబితాను సిద్ధం చేసుకుంది. 55 మంది అభ్యర్ధులతో కూడిన ఈ లిస్ట్ కు బీజెపీ కేంద్ర ఎన్నికల కమిటీ కూడా ఆమోద ముద్ర వేసినట్లు తెలుస్తోంది. మరికొంత సేపటిలో తొలి జాబితాను ప్రకటిస్తారని సమాచారం.

New Update
BJP first list:మరి కాసేపట్లో అధికారికంగా బీజేపీ ఫస్ట్ లిస్ట్ ప్రకటన

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యాలయంలో కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం అయింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జేపీ నడ్డా, బి.ఎల్. సంతోష్ తో పాటూ కమిటీ సభ్యులైన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, తరుణ్ ఛుగ్, సునీల్ బన్సల్, సీనియర్ నేత ఈటల రాజేందర్ ఇందులో పాల్గొన్నారు. ఎన్నికల బరిలోకి దిగేందుకు కేంద్ర కమిటీ 55 మంది అభ్యర్ధులతో కూడిన తొలి జాబితా మీద ఆమోద ముద్ర వేసినట్లు సమాచారం. ఈరోజు మరికాసేపటిలో ఈ లిస్ట్ ను పార్టీ అధికారికంగా ప్రకటించనుంది.

పార్టీ ముఖ్య నేత, సీనియర్ అయిన ఈటల రాజేందర్ ను ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్ నుంచే కాక కేసీఆర్ పోటీకి దిగుతున్న గజ్వేల్ నుంచి కూడా బీజేపీ పోటీకి దింపనుంది. తెలంగాణ ఎంపీలు నలుగురు నుంచి ముగ్గురిని శాసనసభ ఎన్నికల్లో దింపాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కరీంనగర్ నుంచి, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావును బోథ్ నుంచి, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ను కరీంనగర్ కోరుట్ల నుంచి పోటీ చేయాలని అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక మాజీ ఎంపీ వివేక్ చెన్నూరునుంచి, డి.కె. అరుణ గద్వాల నుంచి పోటీ చేయనున్నారు. దీంతో పాటూ గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మీద సస్పెన్షన్ వేటు కూడా ఎత్తివేయనున్నారని తెలుస్తోంది. దీంతో ఆయన మళ్ళీ గోషా మహల్ నుంచే పోటీ చేస్తారు. మొదటి జాబితాలో ఖరారైన వారిలో చాలా మంది గత ఎన్నికల్లో కూడా అవే స్థానాల నుంచి పోటీ చేశారు. ఇక కిషన్ రెడ్డి, కె. లక్ష్మణ్ లను కూడా ఈ సారి బరిలోకి దించాలని కేంద్ర కమిటీ అనుకుంది కానీ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం, ఇతర కీలక బాధ్యతలను నిర్వర్తించేందుకు ఆ ఇద్దరినీ మినహాయిస్తూ జాతీయ నాయకత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.

55 లిస్ట్ లో ఉన్నవారు...
1. గద్వాల్ – డీకే అరుణ

2 .కరీంనగర్ – బండి సంజయ్

3. చెన్నూరు- జి.వివేక్

4 .ముషీరాబాద్ – బండారు విజయలక్ష్మి

5 . కోరుట్ల – ధర్మపురి అరవింద్

6. బోథ్ – సోయాం బాపూరావు

7. దుబ్బాక – రఘునందన్ రావు

8. హుజూరాబాద్, గజ్వేల్ – ఈటెల రాజేందర్

9. మహబూబ్ నగర్ – ఏపీ జితేందర్ రెడ్డి

10. కల్వకుర్తి – తల్లోజు ఆచారి

11. నిర్మల్ – ఏలేటి మహేశ్వర రెడ్డి

12. ముధోల్ – రామారావు పటేల్

13. ఖానాపూర్ – రాథోడ్ రమేష్

14. ఖైరతాబాద్ – చింతల రామచంద్రారెడ్డి

15. మల్కాజ్ గిరి – ఎన్ రామచంద్ర రావు / ఆకుల రాజేందర్

16. ఉప్పల్ – Nvss ప్రభాకర్/ వీరేందర్ గౌడ్

17. తాండూర్ – కొండ విశ్వేశ్వర రెడ్డి

18. మునుగోడు – కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

19. వేములవాడ- తుల ఉమా

20. కుత్బుల్లాపూర్ – కూన శ్రీశైలం గౌడ్

21. ధర్మపురి – వివేక్ వెంకటస్వామి

22. ఇబ్రహీంపట్నం – నోముల దయానంద్ గౌడ్

23. పఠాన్ చెరువు – నందీశ్వర్ గౌడ్

24. భువనగిరి – గూడూరు నారాయణ రెడ్డి

25. గోషామహల్ – రాజా సింగ్

26. మక్తల్ – జలంధర్ రెడ్డి

27. భూపాలపల్లి – చందుపట్ల కీర్తీ రెడ్డి

28. కాగాజ్ నగర్ – పాల్వాయి హరీష్

29. రాజేంద్ర నగర్ – తోకలా శ్రీనివాస్ రెడ్డి

30. మహేశ్వరం – అందెల శ్రీరాములు యాదవ్

31. సనత్ నగర్ – మర్రి శశిధర్ రెడ్డి

32. కామారెడ్డి – విజయశాంతి

33. నారాయణపేట – రతంగ్ పాండు రెడ్డి

34. అందోల్ – బాబు మోహన్

35. మానకొండూర్ – అరేపల్లి మోహన్

36. సూర్యాపేట – సంకినేని వెంకటేశ్వర రావు

37. చొప్పదండి – బొడిగే శోభ

38. సికింద్రాబాద్ – బండ కార్తీక రెడ్డి

39. రామగుండం – కందుల సంధ్యారాణి

40 నాగర్ కర్నూల్ – దీలిపాచారి

41. నర్సాపూర్ – మురళీ యాదవ్

42. జగిత్యాల- బోగా శ్రావణి

43. ఆలేరు – కాసాం వెంకటేశ్వర్లు

44. అచ్చంపేట – సతీష్ మాదిగ

45 మలక్ పేట- హారి గౌడ్

46. నారాయణఖేడ్ – సంగప్ప

47. బెల్లంపల్లి – శ్రీదేవి

48. జహీరాబాద్ – ఢిల్లీ వసంత్/ దామోదరం రామచంద్రయ్య

49. పరిగి – ఈశ్వరప్ప

50. వికారాబాద్ – కృష్ణ ప్రసాద్

51. సిరిసిల్ల- రాణి రుద్రమదేవి

Advertisment
Advertisment
తాజా కథనాలు