TS Politics : మంత్రి ఉత్తమ్ రూ.1000 కోట్ల అవినీతి : మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు తెలంగాణ సివిల్ సప్లై శాఖలో రూ.1000 కోట్ల లంచాల అవినీతి జరిగిందని బీజేపీఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఇందులో మంత్రి ఉత్తమ్ పాత్ర ఉందన్నారు. యూ ట్యాక్స్ అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద చేసిన ఆరోపణలకు తన దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయన్నారు. By Nikhil 22 May 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Maheshwar Reddy : తెలంగాణ (Telangana) బీజేపీ (BJP) శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర రెడ్డి (Aleti Maheshwar Reddy) మీడియాతో చిట్ చాట్ చేశారు. యూ ట్యాక్స్ అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) మీద చేసిన ఆరోపణలకు తన దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయన్నారు. ఆయన స్పందించిన తర్వాత దీనిపై మాట్లాడతానన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి కౌంటర్ ఇచ్చే సీన్ లేదు అనుకుంటున్నానన్నారు. దీనిపై ఉత్తమ్ తో బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. చర్చకు తాను ఒక్కడినే వస్తానన్నారు. వాళ్లు ఎంత మంది అయిన రావచ్చన్నారు. చర్చలో నేను అడిగే ప్రశ్నలకు ఉత్తమ్ సమాధానం ఇస్తే చాలన్నారు. తాను వార్తల కోసమే మాట్లాడాను అని అంటున్నారని.. కానీ గతంలో ఆర్ ట్యాక్స్, బీ ట్యాక్స్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద మాట్లాడినప్పుడు ఉత్తమ్ ఎందుకు ఏమీ మాట్లాడలేదని ప్రశ్నించారు. సివిల్ సప్లై లో వెయ్యి కోట్ల లంచాల అవినీతి జరిగిందన్నారు. కలెక్షన్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాత్ర ఉందని ఆరోపించారు. అదిలాబాద్ పార్లమెంట్ స్థానంలో లక్ష మెజారిటీ తో గెలుస్తామన్నారు. Also Read : ఏసీపీ ఉమామహేశ్వర్‌రావుకు జూన్ 5 వరకు జ్యుడీషియల్ రిమాండ్ #telangana #bjp #minister-uttam-kumar-reddy #aleti-maheshwar-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి