Bill Gates: 'వన్‌ ఛాయ్ ప్లీస్‌'.. డాలీ చాయ్‌వాలా టీ ఆస్వాదించిన బిల్‌గేట్స్‌

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ వాసి సునీల్‌ పాటిల్.. తనదైన శైలిలో టీ తయారు చేస్తూ డాలీ చాయ్‌వాలాగా సోషల్‌ మీడియాలో మంచి పేరు సంపాదించుకున్నారు. తాజాగా మైక్రోసాఫ్ట్‌ సహా వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ సునీల్‌ తయారు చేసిన టీని ఆస్వాదించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరలవుతోంది.

New Update
Bill Gates: 'వన్‌ ఛాయ్ ప్లీస్‌'.. డాలీ చాయ్‌వాలా టీ ఆస్వాదించిన బిల్‌గేట్స్‌

Bill Gates With Dolly Chaiwala: ఏరా చదువైపోయింది కదా.. ఏం జాబ్‌ చేస్తున్నావ్‌.. అని మనకు తెలిసిన వాళ్లు, రిలేటివివ్స్‌ తరుచుగా అడిగే ప్రశ్న. ఇంజినీర్‌, డాక్టర్‌.. లేదా ఏదైన ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాని చెప్పేవాళ్లకి మర్యాద ఇస్తారు. అదే ఏదైన చిన్న టీ హోటల్ పెట్టుకున్నాను, సమోసాలు, బజ్జీలు వేసే పని చేస్తున్నానంటే.. ఏంటీ ఇలాంటి పని చేస్తున్నావా అంటూ కొంచెం చులకనగా చూసి మాట్లాడుతారు. వాస్తవానికి ఎవరు ఏ వృత్తి చేసినా కూడా అందులో ప్రతిభను చూపిస్తే.. తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవచ్చు. దీన్నే మహారాష్ట్రకు చెందిన ఓ టీ అమ్మే వ్యక్తి నిరుపించాడు. ఇతని టీ షాప్‌కు ఏకంగా మైక్రోసాఫ్ట్‌ సహా వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ (Bill Gates) వచ్చి.. టీ ని ఆస్వాదించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరలవుతోంది.

Also Read: లోక్‌సభ అభ్యర్థులను ఖరారు చేసిన మోదీ.. ఏ క్షణంలోనైనా లిస్ట్‌ రిలీజ్!

డాలీ చాయ్‌వాలాగా ఫేమస్‌

ఇక వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ వాసి సునీల్‌ పాటిల్.. డాలీ చాయ్‌వాలాగా (Dolly Chaiwala) సోషల్‌ మీడియాలో మంచి పేరు సంపాదించుకున్నారు . ఇతను టీ తయారు చేసే విధానానికి చాలామంది ఫ్యాన్స్‌ ఉన్నారు. అంతేకాదు సునీల్‌ పాటిల్ టీ తాగేందుకు నిత్యం ఎంతోమంది క్యూలు కడుతుంటారు. సోషల్‌ మీడియాలో ఇతని వీడియోలు ఇప్పటికే కోట్లాది మంది చూశారు. అయితే ఇటీవల ఇండియాకు వచ్చిన బిల్‌గేట్స్‌.. సునీల్‌ పాటిల్‌ తయారు చేసిన టీ ని ఆస్వాదించారు.

ఎక్కడ చూసినా ఆవిష్కరణలు కనిపిస్తాయి

ఆ వీడియోను చూస్తే.. ముందుగా బిల్‌గేట్స్‌ వన్‌ ఛాయ్‌ ప్లీస్‌ అని అంటారు. ఆ తర్వాత సునీల్‌ తనదైన శైలిలో టీ ని తయారు చేస్తూంటే.. బిల్‌గేట్స్‌ ఆసక్తిగా చూశారు. ఆ తర్వాత టీ ని తాగారు. అంతేకాదు ఈ వీడియోకి ఓ క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఇండియాలో ఎక్కడ చూసినా ఆవిష్కరణలు కనిపిస్తాయని.. ఆఖరికి సాధారణ టీ కప్పులో కూడా కనిపిస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. నెటీజన్లు విభిన్న కామెంట్లు చేస్తున్నారు.

Also Read: ఊహించిన దానికంటే ఎక్కువగా.. జీడీపీ వృద్ధి.. ఎంతంటే.. 

ఇక్కడ మరో ఇంట్రస్టింగ్ విషయం ఏంటంటే.. టీ ఇచ్చేటప్పుడు ఆయన బిల్‌గేట్స్‌ అని గుర్తుపట్టలేదని సునీల్‌ తెలిపారు. ఈ వీడియో వైరల్‌ అవ్వడంతోనే తెలిసినట్లు చెప్పారు. ఆయనతో వీడియో షూట్‌ చేసేందుకు తనను హైదరాబాద్‌ తీసుకెళ్లారని తెలియదని అన్నారు. ఏదో ఒకరోజు ప్రధాని మోదీకి టీ ఇవ్వాలని ఉందని.. తన కొరికను చెప్పారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Renu Desai: నాకు రాజకీయాల్లోకి రావాలని ఉంది..రేణూ దేశాయ్

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. దేశంలో జరిగే అన్ని విషయాలపైనా స్పందిస్తూ ఉంటారు. తాజాగా ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె..తనకు రాజకీయాల్లోకి రావాలని ఉందని చెప్పారు. 

New Update
Renu Desai

Renu desai

తనకు రాజకీయాల్లోకి వెళ్ళే అవకాశం ఇంతకు ముందే వచ్చిందని..కానీ పిల్లలు చిన్నవారు కావడం వలన వదులుకున్నానని చెప్పారు రేణూ దేశాయ్. రాజకీయాల్లోకి వెళ్ళడం తన జాతకంలోనే ఉందని అన్నారు. ఇప్పటికీ తనకు అదే కోరికని...కానీ తాను విధి రాతకు వ్యతిరేకంగా ప్రయాణిస్తున్నానని చెప్పుకొచ్చారు రేణు. ఓ పాడ్ కాస్ట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనసులో మాటను బయటపెట్టారు.  సామాజిక సేవ చేయడం అంటే తనకు ఆనందమని...ఏ చిన్నారీ ఆకలితో ఉండకూడదని అనుకుంటానని ఆమె తెలిపారు. అయితే తాను కొంచెం ముక్కు సూటి మనిషిని...స్నేహితులు, పిల్లలతో ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తానని...అందుకే వారు తాను పోలిటిక్స్ లో పనికి రానని అంటారని నవ్వూతూ చెప్పారు రేణూ దేశాయ్. 

మోడీ భక్తురాలిని..బీజేపీకే సపోర్ట్..

తాను ఎప్పటికీ మోడీనే సపోర్ట్ చేస్తానని...ఆమె భక్తురాలిని అని నిర్భయంగా చెప్పుకున్నారు రేణు. మన ధర్మం ఎలా బతకాలో, ఎలా నడుచుకోవాలో నేర్పించింది. అందుకే నేను సనాతురాలినే అని చెప్పుకుంటాననన్నారు ఎవరేం అనుకున్నా ఎప్పటికీ తాను బీజేపీకే సపోర్ట్ చేస్తానని చెప్పుకొచ్చారు. భవిష్యత్తులా తాను ఏదైనా పార్టీలో చేరితే కచ్చితంగా అందరికీ చెప్పే చేస్తానని రేణూ దేశాయ్ అన్నారు. ఇక ఆమె కుమారుడు అకీరా నందన్ గురించి చెబుతూ...ఓజీ సినిమాలో అతను పని చేయడం లేదని తెలిపారు. అకీరా నటన గురించి ఆలోచించిన రోజే నా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెడతా. కొందరు యూట్యూబర్లు మనీ కోసం తప్పుడు థంబ్‌నైల్స్‌ పెడుతున్నారు రేణూ ఆరోపించారు. 

today-latest-news-in-telugu | renu-desai | actress | inter-view

Also Read: WHO: మరో మహమ్మారి తప్పదు-WHO చీఫ్

Advertisment
Advertisment
Advertisment