Apple iphone Banned: యాపిల్‎కు బిగ్ షాక్..ఈ పాపులర్ ఐఫోన్‎పై నిషేధం..!!

యాపిల్ ఐఫోన్ 15 లాంచ్ అయిన వెంటనే ఆపిల్ బిగ్ షాక్ తగిలింది. చైనా తర్వాత, ఇప్పుడు ఫ్రాన్స్‌లో ఐఫోన్ బ్యాన్ కారణంగా ఆపిల్‌కు డబుల్ దెబ్బ తగిలింది. ఫ్రాన్స్‌లో ఐఫోన్ 12 నిషేధించారు. ఐఫోన్ 12 మోడల్ నుండి వెలువడే రేడియేషన్ వల్లే ఈ ఫోన్ బ్యాన్ చేసినట్లు సమాచారం. ఐఫోన్ యొక్క ఈ మోడల్ పెద్ద మొత్తంలో రేడియేషన్‌ను విడుదల చేస్తుందని వెల్లడయ్యింది.

New Update
BBD Sale :  బంపర్ ఆఫర్..రూ. 50వేల ఐఫోన్..కేవలం రూ.20వేలకే..వెంటనే కొనేయ్యండి...!!

France banned Apple iPhone 12: ఆపిల్ కొత్త ఐఫోన్ సిరీస్ ఐఫోన్ 15 ను విడుదల చేసింది. ఈసారి కొత్త ఫీచర్లతో ఐఫోన్ లాంచ్ కావడంతో కొత్త ఐఫోన్ పై ఐఫోన్ ప్రియుల్లో చాలా క్రేజ్ నెలకొంది. ఐఫోన్ 15 లాంచ్‌తో యాపిల్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఐఫోన్ 12 (iPhone 12)పై ఫ్రాన్స్ ప్రభుత్వం నిషేధం విధించింది. ఐఫోన్ 12 విక్రయాలను ప్రభుత్వం నిలిపివేసింది. ఫ్రాన్స్ (France) కంటే ముందు చైనా (China) కూడా ప్రభుత్వ సంస్థల్లో భద్రతను పేర్కొంటూ ఐఫోన్ వాడకాన్ని నిషేధించింది.

చైనా తర్వాత, ఇప్పుడు ఫ్రాన్స్‌లో ఐఫోన్ బ్యాన్ కారణంగా ఆపిల్‌కు డబుల్ దెబ్బ తగిలింది. ఫ్రాన్స్‌లో ఐఫోన్ 12 నిషేధానికి ప్రధాన కారణం ఐఫోన్ 12 మోడల్ నుండి వెలువడే రేడియేషన్. ప్రభుత్వం ప్రకారం, ఐఫోన్ 12 నుండి వెలువడే రేడియేషన్ ప్రభుత్వం నిర్ణయించిన పరిమితి కంటే చాలా ఎక్కువగా ఉందని పేర్కొంది. అధిక మొత్తంలో రేడియేషన్ శారీరక ఆరోగ్యానికి చాలా హానికరమని.. అందుకే ఫ్రెంచ్ ప్రభుత్వం ఇప్పుడు ఈ మోడల్ అమ్మకాన్ని నిషేధించింది.

ఇది కూడా చదవండి: జమ్మూలో భారీ ఎన్‌కౌంటర్‌..ఇద్దరు జవాన్లకు గాయాలు..!!

రేడియో ఫ్రీక్వెన్సీలను నియంత్రించే ANFR అనే ఏజెన్సీ ఫ్రాన్స్‌లో ఉంది. ఈ ఫోన్ బాడీ నుండి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ప్రమాదం చాలా ఎక్కువగా ఉన్నందున ఫ్రాన్స్‌లో ఐఫోన్ 12ను నిలిపివేయమని సూచనలు ఇచ్చినట్లు ఏజెన్సీ ద్వారా సమాచారం అందించింది. దీనిని ఉపయోగించడం మానవ శరీరానికి ప్రమాదకరమని వెల్లడించింది.

ఇది కూడా చదవండి: చంద్రబాబు భద్రత మీద కేంద్రహోంశాఖకు ఎన్ఎస్జీ నివేదిక

SAR విలువను తెలుసుకోవడానికి ఫ్రెంచ్ ఏజెన్సీ దాదాపు 141 ఫోన్‌లను పరీక్షించింది. ఇందులో ఐఫోన్ 12 కూడా చేర్చింది. ఐఫోన్ 12 పరీక్ష సమయంలో ఆశ్చర్యకరమైన ఫలితాలను వెల్లడించింది. ఒక వ్యక్తి తన జేబులో iPhone 12ని ఉంచుకున్నప్పుడు, అది కిలోగ్రాముకు 5.74 వాట్స్ రేడియేషన్‌ను విడుదల చేస్తుందని పరీక్షలో వెల్లడైంది, అయితే యూరోపియన్ దేశాలలో స్మార్ట్‌ఫోన్ యొక్క రేడియేషన్ విలువ కిలోగ్రాముకు 4.0 వాట్‌లుగా నిర్ణయించింది. మొత్తానికి యాపిల్ ఐఫోన్ 15 లాంచ్ చేసిన కొన్ని రోజులకే ఆపిల్ 12 రూపంలో బిగ్ షాక్ తగిలినట్లయ్యింది.

ఇది కూడా చదవండి: ఢిల్లీ హైకోర్టు సంచలన నిర్ణయం..విడాకులు తీసుకున్న కూతురుకు తండ్రి ఆస్తిపై హక్కు లేదంటూ తీర్పు.!!

Advertisment
Advertisment
తాజా కథనాలు