BIG BREAKING: బంగ్లాదేశ్‌ పార్లమెంట్ రద్దు.. కొత్త ప్రధాని ఎవరంటే?

బంగ్లాదేశ్‌ పార్లమెంట్ ను ప్రెసిడెంట్ రద్దు చేశారు. త్వరలోనే తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మాజీ ప్రధాని ఖలీదా జియా కొత్త ప్రభుత్వానికి నేతృత్వం వహించే అవకాశం ఉందని సమాచారం.

New Update
BIG BREAKING: బంగ్లాదేశ్‌ పార్లమెంట్ రద్దు.. కొత్త ప్రధాని ఎవరంటే?

Bangladesh Parliament Dissolved: బంగ్లాదేశ్‌ పార్లమెంట్ ను ప్రెసిడెంట్ రద్దు చేశారు. త్వరలోనే తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ప్రెసిడెంట్ మహమ్మద్ షహబుద్దీన్ (Mohammad Shahabuddin) కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్ ప్రతిపక్ష పార్టీ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) చైర్ పర్సన్, మాజీ ప్రధాని బేగమ్ ఖలీదా జియాను (Begum Khaleda Zia) జైలు నుంచి విడుదల చేయాలని సైతం ప్రెసిడెంట్ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ఆమె అవినీతి కేసులో జైలులో ఉన్నారు. నిన్న ప్రెసిడెంట్ ప్రతిపక్ష నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రస్తుత పార్లమెంట్ ను రద్దు చేసేందుకు ప్రతిపక్ష నేతలు అంగీకరించారు. ఈ నేపథ్యంలోనే పార్లమెంట్ ను ఈ రోజు రద్దు చేశారు. మాజీ ప్రధాని ఖలీదా జియా కూడా జైలు నుంచి విడులయ్యారు.

బంగ్లాదేశ్ లో కొత్తగా ఏర్పడబోయే తాత్కాలిక ప్రభుత్వానికి ఆమె నేతృత్వం వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు బంగ్లాదేశ్‌లో పరిస్థితులు చేయిదాటిపోయాయి. ప్రభుత్వం కూలిపోవడం, ప్రధాని దేశం దాటి పారిపోవడంతో శాంతిభద్రతల సమస్యలు తీవ్రమయ్యాయి. అల్లరిమూకలు ఎక్కడికక్కడ రెచ్చిపోతున్నాయి. హిందువులే టార్గెట్ గా అక్కడ దాడులు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. షేక్ హసీనా (Sheikh Hasina) పార్టీకి చెందిన ఇద్దరు హిందూ కౌన్సిలర్లను ఇప్పటికే ఆందోళనకారులు హత్య చేశారు.

దీంతో పాటు హిందూ కుటుంబాలు, దేవాలయాలపై దాడులు జరుగుతున్నట్లు సమాచారం. ఇంకా మహిళలపైనా అత్యాచారాలు జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించి సోషల్‌ మీడియాలోనూ అనేక వీడియోలు వైరల్‌గా మారాయి. అయితే.. ఇదే అదనుగా కొందరు ఫేక్, పాత వీడియోలను ఇంటర్ నెట్లో పోస్ట్ చేస్తున్నారు. దీంతో ఏ వీడియో నిజం, ఏది అబద్ధం అన్న విషయం అర్థం కాని పరిస్థితి నెలకొంది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

USA: పాక్ ఆర్మీ ఛీప్ మునీర్ ఒసామా బిన్ లాడెన్ లాంటివాడు..పెంటగాన్ మాజీ అధికారి మైకెల్ రూబిన్

పహల్గామ్ ఉగ్రదాడికి పాక్ ఆర్మీ ఛీఫ్ మునీర్ వ్యాఖ్యలే కారణమంటున్నారు. దీనిపై తాజాగా పెంటగాన్ మాజీ అధికారి రూబిన్ స్పందించారు. మునీర్ ఒసామా బిన్ లాడెన్ లాంటి వాడని అన్నారు. జమ్మూ కశ్మీర్ ఉగ్రదాడి పాకిస్తాన్ పక్కా ప్రణాళిక అని రూబిన్ ఆరోపించారు. 

author-image
By Manogna alamuru
New Update
usa

Pak Army Chief Asif Munir, Osama bin Laden

ఒక పందికి లిప్ స్టిక్ వేసినా అది పందేనని మాజీ పెంటగాన్ అధికారి మైఖల్ రూబిన్  తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇది పాకిస్తాన్ గురించి ఆయన చెప్పిన మాటలు. జమ్మూ కశ్మీర్ ఉగ్రదాడి యాదృచ్ఛికంగా జరిగింది కాదని, పాకిస్థాన్ పక్కా ప్రణాళికతో నిర్వహించిందని రూబిన్ ఆరోపించారు. పాకిస్తాన్ ఆర్మీ ఛీఫ్ ఆసిమ్ మునీర్ ను చనిపోయిన అల్ ఖైదా ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ లాంటివాడని అన్నారు. అమెరికన్ ఎంటర్‌ప్రైజ్ ఇన్‌స్టిట్యూట్‌ సీనియర్ ఫెలో అయిన రూబిన్ ఎన్ఐఏకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. పహల్గామ్ దాడికి అమెరికా తీసుకోవాల్సిన చర్య ఒకే ఒక్కటి ఉంది. అది పాక్ ను అధికారికంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశంగా గుర్తించడమే అని అన్నారు. బిల్ క్లింటన్ ఇండియా వెళ్ళినప్పుడు ఉగ్రదాడి జరిగింది. ఇప్పుడు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అక్కడ ఉన్నప్పుడే ఉగ్రవాదులు దాడి చేశారు. ఇదంతా పాకిస్తాన్ దృష్టిని మళ్ళించేందుకే చేస్తోందని రూబిన్ అన్నారు. 

కాశ్మీర్ మాది అంటూ వ్యాఖ్యలు..

కాశ్మీర్ లోని పహల్గామ్ దాడికి వారం రోజుల ముందు పాకిస్తాన్ ఆర్మీ ఛీఫ్ ఆసిమ్ మునీర్ కాశ్మీర్ పై విద్వేష పూరిత వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్ పాకిస్తాన్ జీవనాడి అని..దానిని తాము ఎప్పటికీ వదులుకోమని అన్నారు. ఈ మాటలే ఉగ్రవాదులకు ఊతమిచ్చాయని..ఆ ధైర్యంతోనే వారు కాశ్మీర్ లో దాడులకు తెగబడ్డారని వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు పెంటగాన్ మాజీ అధికారి కూడా ఈ వాదనను సమర్థించారు. 

పహల్గామ్‌లోని బైసరన్ లోయలో  లష్కరే తొయిబా అనుబంధ విభాగం టీఆర్ఎఫ్ టెర్రరిస్టులు.. పర్యాటకులపై కాల్పులకు తెగబడి 26 మందిని పొట్టనబెట్టుకున్నారు. మరో 20 మందిని తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటనతో భారత్, పాకిస్థాన్‌ల మధ్య మరోసారి ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. 

today-latest-news-in-telugu | usa | pakistan | pentagon | Pakistan Army Chief | osama-bin-laden 

 

Also Read: USA: వీసాల రద్దు ఆపండి..విద్యార్థులకు అమెరికా న్యాయస్థానం ఊరట

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు