Punjab: పంజాబ్‌ ని దేవుడే రక్షించాలి..భగవంత్‌ మాన్‌ కూతురి సంచలన వ్యాఖ్యలు!

పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ సింగ్‌ మాన్‌ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.తమ బాధ్యతలే సరిగా నిర్వహించలేని వ్యక్తి మరోకరికి న్యాయం ఎలా చేస్తారని ఆయన మొదటి భార్య కుమార్తె ప్రశ్నించారు. మిమ్మల్ని నమ్ముకున్న వ్యక్తులను ఎప్పటికీ మోసం చేయోద్దని ఆమె వేడుకున్నారు.

New Update
Punjab: పంజాబ్‌ ని దేవుడే రక్షించాలి..భగవంత్‌ మాన్‌ కూతురి సంచలన వ్యాఖ్యలు!

పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ సింగ్‌ మాన్‌ (Bhagavanth maan) తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈసారి ఆయన ఆరోపణలు ఎదుర్కొంటుంది ఏ ప్రతిపక్షం నుంచో, తన నియోజక వర్గ ప్రజల నుంచో కాదు..స్వయానా ఆయన కూతురి నుంచి. ఆయన మొదటి భార్య కుమార్తె అయినటువంటి సీరత్‌ కౌర్‌ ఓ సంచలన వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు.

అందులో ఆయన మూడోసారి తండ్రి కాబోతున్నట్లు మాకు బయట వ్యక్తుల ద్వారా తెలిఇంది. తమ బాధ్యతలే సరిగా నిర్వహించలేని వ్యక్తి మరోకరికి న్యాయం ఎలా చేస్తారని ఆమె ప్రశ్నించారు. మిమ్మల్ని నమ్ముకున్న వ్యక్తులను ఎప్పటికీ మోసం చేయోద్దని ఆమె వీడియోలో వేడుకున్నారు.

మొదటి నుంచి నా తండ్రి అబద్దాలు చెబుతూనే కాలం గడుపుతున్నారు. ఇప్పడు తనని నమ్ముకుని ఉన్న రాష్ట్ర ప్రజలను కూడా అదే విధంగా మోసం చేస్తున్నారు. నాకు , నా తల్లికి చేసిన అన్యాయమే పంజాబ్‌ ప్రజలకు ఇప్పుడు చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నాకు ఆయన పేరును కూడా తీసుకోవాలని లేదు. నా తల్లి నుంచి ఆయన విడిపోవడం అనేది వేరే కథ.

మా అమ్మను మానసికంగా బ్లాక్‌ మెయిల్‌ చేసినట్లే ఇప్పుడు పంజాబ్‌ ప్రజలను కూడా మభ్య పెడుతున్నారంటూ ఆరోపించారు. ఇప్పటికీ ఆయన విధానసభకు, గురుద్వారా సాహెబ్​కు కూడా మద్యం మత్తులోనే వెళ్తున్నారు. సొంత పిల్లలకే న్యాయం చేయలేని వ్యక్తి, రాష్ట్రానికి ఏం మంచి చేస్తారు?" అంటూ సీరత్‌ కౌర్‌ ప్రశ్నించారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌ గా మారింది . ఈ వీడియోను కౌర్ తల్లి భగవంత్‌ మాన్‌ మొదటి భార్య సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఈ రాష్ట్ర ప్రజలను ఆ దేవుడే కాపాడాలంటూ ఆమె పరోక్ష విమర్శలు కురిపించారు. కట్టుకున్న భార్య, కడుపున పుట్టిన పిల్లలకే అన్యాయం చేసిన వ్యక్తి రాష్ట్ర ప్రజలకు న్యాయం చేస్తాడని మేము అనుకోవడం లేదు. రాష్ట్రం కోసం కుటుంబాన్ని వదులుకున్నాను అని చెప్పిన వ్యక్తి మరి మరో పెళ్లి ఎలా చేసుకున్నారు అంటూ ఆమె ప్రశ్నించారు.

పంజాబ్​ బాగుపడుతుందంటే మేము చాలా సంతోషిస్తాం. మేము నిశబ్దంగా ఉండేందుకు సిద్ధంగానే ఉన్నాం. దయచేసి ఇకనైనా రోజూ డ్రామాలు వేయడం మానండి అంటూ భగవంత్‌ మాన్‌ భార్య విమర్శించారు.

Also read: ప్రేయసితో మీ బంధాన్ని బలోపేతం చేసుకోండిలా.. లవ్‌ టిప్స్‌!

Advertisment
Advertisment
Advertisment