Hyderabad Traffic: జాగ్రత్త.. ఇకపై వీడియో రూపంలో ట్రాఫిక్ చలాన్లు.. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే.. ఇటీవల ఫోటోల రూపంలో చలాన్లు వచ్చేవి. అయితే ఇప్పుడు వీడియో రూపంలో చలాన్లు వచ్చేలా సరికొత్త విధానాన్ని తీసుకొచ్చారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. ఇప్పుడు ఎవరైనా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే వారికి వీడియో రూపంలో చలాన్లు వస్తున్నాయి. ట్రాఫిక్ రూల్స్‌ను మరింత కఠినతరంగా, కచ్చితత్వంతగా అమలుచేసేందుకు ఈ విధానాన్ని తీసుకొచ్చామని పోలీసులు చెబుతున్నారు. By B Aravind 31 Oct 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి హైదరాబాద్ ట్రాఫిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిజిబిజీ జీవితాలతో రోడ్లన్నీ రద్దీగా ఉంటాయి. ఈ క్రమంలోనే చాలామంది ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తుంటారు. సిగ్నల్ పడినా ఆగకపోవడం, హెల్మెట్ ధరించకపోవడం, రాంగ్‌రూట్‌లో వెళ్లడం లాంటివి నిత్యం నగరంలో ఎక్కడో ఓ చోట జరుగుతూనే ఉంటాయి. ఇక ట్రాఫిక్ రూల్స్‌ను మరింత కఠినతరం చేసేందుకు హైదరాబాద్, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మరో ముందడుగు వేశారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వాహనాదారులకు వీడియో ఆధారిత చలాన్లను ప్రారంభించారు. ఇంతకుముందు ట్రాఫిక్ చలాన్లకు కేవలం ఫొటోలను మాత్రమే జత చేసేవారు. అయితే ఇప్పుడు అధికారిక వెబ్‌సైట్‌లో ట్రాఫిక్ ఉల్లంఘించిన వీడియోలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఈ విధానాన్ని ఇటీవలే ప్రారంభించామని.. ఇలా వీడియోల రూపంలో వాహనాదారులకు వారి ట్రాఫిక్ ఉల్లంఘనలు చూపించడం మరింత స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు. ఇంతకుముందు సిగ్నల్ జంప్ చేసి వెళ్లడం, హైస్పీడ్ లాంటి ట్రాఫిక్ ఉల్లంఘనలు ఫొటోల్లో క్యాప్చర్ అయ్యేవి కావని.. ఇలాంటి సందర్భాల్లో ఇలా వీడియోలు రికార్డు కావడం అనేది చాలా ఉపయోగకరంగా ఉంటోందని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ అడిషనల్ కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు. అయితే ట్రాఫిక్ ఉల్లంఘన వీడియోలను ట్రాఫిక్ పోలీస్ రికార్డు చేస్తారు. అలాగే సీసీటీవీ కెమెరాల్లో కూడా ఇవి రికార్డు అవుతాయి. అతివేగంగా అలాగే సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపడం, సరైన నంబర్ ప్లేట్ లేకపోవడం, రాంగ్‌రూట్లో డ్రైవింగ్ చేయడం, అనుమతిలేని స్థలాల్లో పార్కింగ్ చేయడం లాంటి ట్రాఫిక్ ఉల్లంఘనలు వీడియోరూపంలో రికార్డు అవుతాయని పోలీసులు తెలిపారు. ట్రాఫిక్‌పై మరింత దృష్టి సాధించేందుకే ఈ విధానాన్ని అమలుచేస్తున్నామని పేర్కొన్నారు. #telugu-news #hyderabad-news #traffic #traffic-rules #traffic-fines మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి