Vijayawada : బెజవాడ వాసులకు శుభవార్త! జయవాడ నుంచి ముంబై కి మరికొద్ది రోజుల్లో డైలీ విమాన సర్వీసు ప్రారంభం కాబోతుంది. జూన్ 15న ఎయిర్ ఇండియా సంస్థ 180 మంది ప్రయాణికుల సామర్థ్యం గల భారీ బోయింగ్ ఏ 320 విమాన సర్వీసును ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. By Bhavana 18 May 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి Air India : విజయవాడ(Vijayawada) నుంచి ముంబై(Mumbai) కి మరికొద్ది రోజుల్లో డైలీ విమాన సర్వీసు ప్రారంభం కాబోతుంది. జూన్ 15న ఎయిర్ ఇండియా సంస్థ 180 మంది ప్రయాణికుల సామర్థ్యం గల భారీ బోయింగ్ ఏ 320 విమాన సర్వీసు(Boeing A 320 Flight Service) ను ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. సర్వీసును పునః ప్రారంభిస్తున్న సందర్భంగా ఆఫర్ గా టికెట్ రేటును రూ. 5600 గా నిర్ణయించారు. తరువాత ఈ ధర మారే అవకాశం కూడా ఉంది. ప్రతి రోజూ రాత్రి 7. 10 గంటలకు విజయవాడ నుంచి విమానం బయల్దేరి రాత్రి 9 గంటలకు ముంబైకి చేరుకుంటుంది. విజయవాడ నుంచి ముంబైకి విమాన సర్వీసు కావాలని నగరంలో వ్యాపారుల నుంచి ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్ ఉంది. దీన్ని ఎయిర్‌పోర్టు డైరెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి(Lakshmi Kanth Reddy) విమానయాన సంస్థల దృష్టికి తీసుకెళ్లగా ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ వెంటనే స్పందించింది. ప్రారంభ ఆఫర్‌గా కేవలం రూ.5600లకే ముంబైకి ప్రయాణించే అవకాశాన్ని కల్పించింది. Also read: జమ్మలమడుగులో అల్లర్లు… ముగ్గురిని ఊరు దాటించిన పోలీసులు! #vijayawada #mumbai #flight #air-india మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి