KTR: పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం అవ్వండి.. హైదరాబాద్ కార్పొరేటర్లకు కేటీఆర్ పిలుపు! పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధంగా ఉండలని హైదరాబాద్ కార్పొరేటర్లకు మాజీ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదని వచ్చే GHMC, పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరవేద్దామని అన్నారు. By V.J Reddy 22 Dec 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Ex- Minister KTR: జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సమావేశం అయ్యారు. హైదరాబాద్ లో భారత రాష్ట్ర సమితికి అపూర్వ విజయం అందించడంలో కీలక పాత్ర వహించిన భారత రాష్ట్ర సమితి కార్పొరేటర్లకు, పార్టీ శ్రేణులకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం (BRS Party Office) తెలంగాణ భవన్ లో కార్పొరేటర్లతో కేటీఆర్ సమావేశమయ్యారు. ALSO READ: దేశంలో బారీగా పెరిగిన కరోనా కేసులు.. ఒక్క రోజే ఏకంగా.. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంలో (Hyderabad) భారత రాష్ట్ర సమితి పటిష్టంగా ఉన్నదని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లోను (Parliament Elections) గులాబీ జెండాను ఎగురవేసేందుకు అందరము కలిసికట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఎన్నికల ఫలితాల నుంచి నిరాశ పడకుండా ప్రజల తరఫున ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) పైన ఒత్తిడి తీసుకువచ్చేలా బాధ్యతాయుతమైన ప్రతిపక్షపాత్రను నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ అన్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ లోనూ హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకువస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా హామీలు ఇచ్చి ఎన్నికల్లో గెలిచిందని అయితే హామీలను నెరవేర్చేలా కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకువస్తామని కేటీఆర్ అన్నారు. ALSO READ: విడాకులు తీసుకుని మళ్లీ కలిశారు.. బాబు-పవన్‌పై మంత్రి బొత్స పంచ్‌లే పంచ్‌లు.. జీహెచ్ఎంసీలో (GHMC) అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి పార్టీ నగర అభివృద్ధి కోసం ఎప్పటిలానే నిరంతరంగా కృషి చేస్తుందని ఈ సందర్భంగా కేటీఆర్ తెలిపారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసమే పనిచేసే పార్టీ భారత రాష్ట్ర సమితి అని కేటీఆర్ అన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీని భారీ మెజార్టీతో గెలిపించుకునేందుకు పార్టీ శ్రేణులంతా కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. #ktr #telugu-latest-news #brs-party #congress-party #ghmc మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి