BCCI: విరాట్‌ కోహ్లీపై బీసీసీఐ ఫైర్‌.. ఎందుకుంటే.!

రన్‌ మిషన్‌ విరాట్‌ కోహ్లీపై బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. విరాట్‌ కోహ్లీ క్రికెట్‌కు సంబంధించిన అంతర్గత సమాచారాన్ని బయటకు చెప్పడంతో ఆతనిపై ఫైర్‌ అయినట్లు తెలుస్తోంది. మరోసారి ఇలాంటి పని చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు సమాచారం

New Update
BCCI: విరాట్‌ కోహ్లీపై బీసీసీఐ ఫైర్‌.. ఎందుకుంటే.!

భారత మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీపై బీసీసీఐ ఫైర్‌ అయింది. బీసీసీఐ రూల్‌ ప్రకారం ఏ క్రికెటరైనా క్రికెట్ టీమ్‌కు సంబంధించిన వివరాలను ఇతరులతో చర్చించ కూడదు. ఇతరులు ఆడిగినా అవి సీక్రెట్‌ అని పక్కకు తప్పుకోవాలి. కానీ కోహ్లీ టీమ్‌ సమాచారాన్ని బహిరంగంగా చర్చించాడని ఆరోపణలు రావడంతో కోహ్లీపై భారత క్రికెట్‌ నియంత్రణ మండలి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆసియా కప్‌ కోసం సిద్ధమవుతున్న టీమ్‌ ఇండియాకు బీసీసీఐ బెంగళూరులోని నేషనల్‌ క్రికెట్‌ అకాడమిలో ఫిట్‌నెస్‌ టెస్ట్‌ నిర్వహించింది. ఈ ఫిట్‌నెస్‌ టెస్ట్‌లో పాల్గొన్న కోహ్లీకి 17.2 స్కోర్ వచ్చింది.

publive-image

దీంతో ఆనందం వ్యక్తం చేసిన విరాట్‌ కోహ్లీ తనకు ఫిట్‌నెస్‌ టెస్ట్‌లో వచ్చిన 17.2 మార్క్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. దీంతో విరాట్‌ కోహ్లీ ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేసిన టీమ్‌ మేనేజ్‌మెంట్‌.. విరాట్‌ కోహ్లీ బీసీసీఐ నియమ నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించాడని మండిపడింది. జట్టుకు సంబంధించిన ఎలాంటి విషయాలనైనా గోప్యంగా ఉంచాలని, వాటిని ఇతరులకు తెలిజేయవద్దని హెచ్చరించింది. ఈలాంటి విషయాలను సోషల్‌ మీడియాలో పెడితే వారిపై చర్యలు కఠినంగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. దీంతో విరాట్‌ కోహ్లీ తాను పెట్టిన పోస్టును డిలిట్ చేశాడు. అంతలోనే ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.

మరోవైపు ఫిట్‌నెస్‌ టెస్ట్‌లో విరాట్‌ కోహ్లీతో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా సైతం పాసయ్యారు. ఈ టెస్టుకు బీసీసీఐ నిర్దేశిత స్కోరు 16.5. ఈ స్కోరును అధిగమించిన ప్లేయర్లే అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్లు భావిస్తారు. ఒకవేళ ఈ టెస్ట్‌లో 16.5 కంటే తక్కువ స్కోర్‌ వచ్చిన క్రికెటర్లు దేశవాళి క్రికెట్‌ ఆడాల్సి ఉంటుంది. అనంతరం మళ్లీ వారు తమ ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవాల్సి ఉంటుంది. కాగా ఈ నెల 30 నుంచి పాకిస్థాన్‌, శ్రీలంక దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఆసియా కప్‌ టోర్నీలో టీమ్‌ ఇండియా పాల్గొననుంది. ఈ టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొననున్నాయి. భారత్‌ తన పూర్తి మ్యాచ్‌లను శ్రీలంక వేదికలపైనే ఆడునుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు