Telangana: తెలంగాణలో కులగణనకు సిద్ధం.. ఎప్పటినుంచంటే

తెలంగాణలో బీసీ కులగణన చేపట్టేందుకు రాష్ట్ర సర్కార్‌ సిద్ధమవుతోంది. ఇప్పటికే దీనిపై బీసీ వెల్ఫేర్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం గైడ్‌లైన్స్‌ను ఖరారు చేయనున్నారు. అన్ని సజావుగా సాగితే జులైలో కులగణన చేపట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

New Update
Telangana: తెలంగాణలో కులగణనకు సిద్ధం.. ఎప్పటినుంచంటే

తెలంగాణలో బీసీ కులగణన చేపట్టేందుకు రాష్ట్ర సర్కార్‌ సిద్ధమవుతోంది. ఇప్పటికే దీనిపై బీసీ వెల్ఫేర్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం గైడ్‌లైన్స్‌ను ఖరారు చేయనున్నారు. దీనికంటే ముందు బీసీ ప్రజాసంఘాలు, పార్టీల నుంచి సలహాలు, సూచనలు తీసుకోనున్నారు. మరో వారం రోజుల్లో ఎన్నికల కోడ్‌ ముగియనుంది. ఈ నేపథ్యంలోనే ఆలోపు గ్రౌండ్ వర్క్ పూర్తి పూర్తిచేయాలని అధికారులు యోచిస్తున్నారు. అయితే ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత సీఎం రేవంత్‌తో మంత్రి పొన్నం ప్రభాకర్‌ భేటీ అయ్యి కులగణన గైడ్‌లైన్స్‌పై చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. అన్నీ సజావుగా సాగితే.. జులైలోనే కులగణన ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అంతేకాదు కులగణన చేసేందుకు అధికారులకు శిక్షణ ఇచ్చే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోందని చెబుతున్నారు. అయితే కులగణనకు తక్కువ సమయమే పడుతుందని..దానికన్నా ముందు చేయాల్సిన ప్రాసెస్‌కే ఎక్కువ సమయం పడుతుందని అంటున్నారు.

Also read: వైభవంగా రాష్ట్ర అవతరణ వేడుకలు.. ఎలాంటి ఏర్పాట్లంటే!

గతంలో సమగ్ర కుటుంబ సర్వే

మేనిఫెస్టోలో చెప్పినట్లుగానే కులగణన చేపట్టాలని నిర్ణయించిన రేవంత్ సర్కార్.. దీనిపై జీవో కూడా విడుదల చేసింది. ఇందుకోసం రూ.150 కోట్లు విడుదల చేసేందుకు పర్మిషన్లు కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈ ప్రక్రియపై బీసీ వెల్ఫేర్ అధికారులు కసరత్తులు మొదలుపెట్టారు. ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం గైడ్‌లైన్స్ ఖరారు చేస్తామని అంతకన్నా ముందు బీసీ సంఘాలు, ప్రజాసంఘాలు, పార్టీలు, మేధావుల నుంచి సలహాలు తీసుకుంటామని అంటున్నారు. 2014లో కేసీఆర్‌ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేపట్టిన సంగతి తెలిసిందే. కానీ వాటికి సంబంధించిన వివరాలు అధికారికంగా బయటపెట్టలేదు. వీటి వివరాలు విడుదల చేయాలని బీసీ సంఘాలు, పార్టీలు కోరినా కూడా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలోనే అందరి నుంచి సలహాలు, సూచనలు తీసుకొని కులగణన ప్రక్రియ ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

35 అంశాలు ఖరారు చేయాలి

ఇదిలాఉండగా.. కులగణన చేపట్టిన తర్వాతే లోకల్‌ బాడీ ఎన్నికలు నిర్వహించాలని ఎంపీ ఆర్‌ కృష్ణయ్య అన్నారు. కులగణన ప్రక్రియ వల్ల రాష్ట్రంలో ఎన్ని కులాలు ఉన్నాయి. వారి ఆర్థిక పరిస్థితి ఏంటి అనే విషయాలు తెలుస్తాయని.. ఈ ప్రక్రియ అన్ని కులాలకు సంబంధించిన ఎక్స్‌ రే లాంటిదని తెలిపారు. జనగణన లాగే కులగణన చేయాలని.. దీనిపై ప్రభుత్వ అధికారులకు శిక్షణ ఇవ్వాలని అన్నారు. 35 అంశాలను ఖారారు చేసి.. కులగణన చేపట్టాలన్నారు. ఇందుకోసం బీసీ కమిషన్‌ సాయం కూడా తీసుకోవాలని.. ఎన్నికల కోడ్ ముగిసన అనంతరం తాము సీఎం రేవంత్‌ను కలిసి దీనికి సంబంధించి సలహాలు, సూచనలు అందిస్తామని పేర్కొన్నారు.

Also Read: రేపు కేరళను తాకనున్న రుతుపవనాలు.. తెలంగాణ, ఏపీకి ఎప్పుడంటే

కులగణన తర్వాతే లోకల్ బాడీ ఎన్నికలు !

మరోవైపు తెలంగాణలో గ్రామ పంచాయతీల పదవికాలం ఫిబ్రవరి 1న ముగిసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేక అధికారుల పాలనను ప్రభుత్వం అమలు చేసింది. అలాగే జులైలో కూడా ఎంపీటీసీ, జడ్పీటీసీల టర్మ్ కూడా ముగియనుంది. ఆ తర్వాత మున్సిపాలిటీల టర్మ్ ముగుస్తుంది. అయితే కులగణన పూర్తి చేసిన తర్వాతే లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీంతో ప్రభుత్వ కూడా ఇలానే చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే బీఆర్‌ఎస్‌ హయాంలో లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు తగ్గించారని బీసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పుడు కులగణన చేపట్టి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచాలంటూ డిమాండ్ చేస్తున్నాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు