Bank Holidays: అలర్ట్...ఈ 16 రోజులు బ్యాంకులు బంద్...ఈ తేదీల్లో పనులుంటే మానుకోండి..!!

వచ్చే ఏడాది జనవరిలో మొత్తం 16రోజులు బ్యాంకులు మూతబడి ఉంటాయి. బ్యాంకింగ్ అవసరాలు ఉన్నవాళ్లు సెలవులను గమనించాలి. బ్యాంకులకు సెలువులున్నా మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ, ఇంటర్నెట్ వంటి డిజిటల్ సేవలు ఎప్పటిలాగే పనిచేస్తాయి.

New Update
Bank Holidays: బ్యాంకు కస్టమర్స్ కు అలర్ట్..ఫిబ్రవరిలో  11 రోజుల పాటు మూతపడనున్న బ్యాంకులు..!!

Bank Holidays in January: మీకు బ్యాంకు పనులు ఉంటే త్వరగా పూర్తి చేసుకోండి. ఎందుకంటే వచ్చే వారం నుంచి ప్రారంభం కానున్న కొత్త ఏడాది మొదటి నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ కావడంతో పాఠశాలలు, కాలేజీలతో పాటు బ్యాంకులకు కూడా సెలవులు వచ్చాయి. అలాగే ఇతర సెలవులు అన్నీ కలిపి 2024 జనవరిలో మొత్తం 16రోజులు బ్యాంకులు మూతబడుతాయి. ఏయే తేదీల్లో బ్యాంకులు మూతబడుతాయో సెలువుల జాబితాను ఓసారి చెక్ చేయండి.

బ్యాంకింగ్ అవసరాలు ఉన్నవాళ్లు సెలవులను గమనించాలి. బ్యాంకులకు సెలువులున్నా మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ, ఇంటర్నెట్ వంటి డిజిటల్ సేవలు ఎప్పటిలాగే పనిచేస్తాయి.

జనవరి 2024లో సెలవులు ఇవే :
జనవరి 1 సోమవారం నాడు కొత్త ఏడాది రోజు పబ్లిక్ హాలీడే ఉంది.
జనవరి 7: ఆదివారం
జనవరి 11: గురువారం మిషనరీ డే ( మిజోరం)
జనవరి 12: శుక్రవారం స్వామివివేకానంద జయంతి
జనవరి 13: రెండో శనివారం
జనవరి 14: ఆదివారం
జనవరి 15: సోమవారం పొంగల్, తిరువల్లువర్ డే, సంక్రాంతి సందర్భంగా తమిళనాడుతోపాటు తెలుగు రాష్ట్రాల్లో సెలువు
జనవరి 16: మంగళవారం తుసు పూజ అస్సాం
జనవరి 17: బుధవారం గురుగోవింద్ జయంతి
జనవరి 21 : ఆదివారం
జనవరి 23: మంగళవారం నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి
జనవరి 25 : గురువారం రాష్ట్ర అవతరణ. హిమాచల్ ప్రదేశ్
జనవరి 26: శుక్రవారం గణతంత్ర దినోత్సవం
జనవరి 27: నాలుగో శనివారం
జనవరి 28 : ఆదివారం
జనవరి 31 : బుధవారం మీ డ్యామ్ మీ ఫై అస్సాం.

ఇక ఆర్బీఐ (RBI) సెలవులను కూడా మూడు కేటీగిరీలుగా వర్గీకరిస్తుంది. నేగోషియన్ ఇన్ స్ట్రుమెంట్స్ చట్టం ప్రకారం కొన్ని సెలువులు కూడా ఉంటాయి. నెగోషియన్ ఇన్ స్ట్రుమెంట్స్ యాక్ట్ అండ్ రియల్ టైమ్ గ్రాస్ సెటిల్ మెంట్ హాలిగే కేటగిరి కింద కొన్ని సెలువులు ఉండనున్నాయి. అలాగే బ్యాంకుల క్లోజింగ్ ఆఫ్ అకౌంట్స్ సందర్బంగా నిర్దిష్ట సెలువులు కూడా వర్తిస్తాయి.

బ్యాంకు సెలవులు (Bank Holidays) చాలా వరకు మన దేశం అంతటా ఒకేవిధంగా ఉంటాయి. అయితే స్థానిక ఆచారాలు, సంస్క్రుతుల ప్రభావంతో కొన్ని రాష్ట్రాల్లో నిర్దిష్ట పబ్లిక్ హాలీడేస్ ఇస్తారు. అందుకే బ్యాంకులకు సెలువులు రాష్ట్రాలను బట్టి నిర్దిష్ట ప్రాంతాల్లో జరుపుకునే పండుగలను బట్టి మారుతుంటాయి. రిపబ్లిక్ డే వంటి నేషనల్ పండుగలు, గెటిటెడ్ సెలువులు మాత్రం దేశవ్యాప్తంగా బ్యాంకులను మూసివేస్తారు.

ఇది కూడా చదవండి:  అమ్మాయిలూ రెడీగా ఉండండి..స్కూటీలు వచ్చేస్తున్నాయ్..!!

Advertisment
Advertisment
తాజా కథనాలు