Bengalore: రేవ్ పార్టీలో పోలీసుల హస్తం.. ముగ్గురిపై సస్పెన్షన్ వేటు.. వెలుగులోకి సంచలన విషయాలు!

బెంగళూర్ రేవ్ పార్టీ పోలీసుల కనుసన్నల్లోనే జరిగినట్లు తెలుస్తోంది. ఈ పార్టీ కేసు దర్యాప్తు ముమ్మరం చేసిన జిల్లా ఎస్పీ మల్లికార్జున ముగ్గురిని సస్పెండ్ చేశారు. పలువురు పోలీసులపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశించినట్లు సమాచారం.

New Update
Bengalore: రేవ్ పార్టీలో పోలీసుల హస్తం.. ముగ్గురిపై సస్పెన్షన్ వేటు.. వెలుగులోకి సంచలన విషయాలు!

Rave party: బెంగళూర్ నగర శివారులో జరిగిన రేవ్ పార్టీ ఉదంతం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. పోలీసుల చర్యలపై పలు కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రేవ్ పార్టీ కేసు దర్యాప్తు ముమ్మరం చేసిన ఎస్పీ పలువురు పోలీసులపై సస్పెన్షన్ వేటు వేయడంతోపాటు మరికొంతమందిపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశించినట్లు సమాచారం.

పోలీసులకు సమాచారం అందలేదా?
ఈ మేరకు శనివారం రాత్రి నుంచే జీఆర్‌ ఫామ్‌హౌస్‌లో రేవ్‌ పార్టీ మొదలైంది. పార్టీ ముగిసిన ఒకరోజు తర్వాత విషయం తెలుసుకున్న సీసీబీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఒకరోజు ముందే ఇంత పెద్ద ఎత్తున రేవ్ పార్టీ నిర్వహించిన విషయం హెబ్బగోడి పోలీసులకు మాత్రమే తెలియదనడం విశేషం. కాగా స్థానికంగా ఏం జరుగుతున్నా పోలీసులకు సమాచారం అందడంలేదా? అనే ప్రశ్న తలెత్తుతోంది. బీట్‌లో ఇన్‌ఛార్జ్‌గా ఉన్న ఏఎస్‌ఐ నారాయణస్వామి, బీట్ కానిస్టేబుల్ దేవరాజ్, ఎస్‌బీ కానిస్టేబుల్ గిరీష్ రన్‌లను బెంగళూరు జిల్లా ఎస్పీ మల్లికార్జున సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రెండు రోజులుగా పార్టీ జరుగుతున్నా ఎలాంటి సమాచారం ఇవ్వలేదని సిబ్బందిపై ఎస్పీ క్రమశిక్షణా చర్యలకు ఆదేశించారు.

రాత్రిపూట అక్కడే తిరిగిన అధికారులు..
ఈ పార్టీ జరుగుతున్న రోజున హెబ్బగోడి ఇన్‌స్పెక్టర్‌ అయ్యన్నారెడ్డి, డీవైఎస్పీ మోహన్‌కుమార్‌ రాత్రిపూట అక్కడే తిరిగినట్లు అధికారులు తెలిపారు. అయితే పార్టీకి సంబంధించిన సమాచారం అందని నేపథ్యంలో డీవైఎస్పీ, ఇన్‌స్పెక్టర్‌లకు ఎస్పీ చార్జి మెమో ఇచ్చారు. మీ దృష్టికి రాకుండా రెండు రోజులుగా పార్టీ ఎలా జరిగిందని ఎస్పీ చార్జి మెమో జారీ చేశారు. రేవ్ పార్టీ నిర్వాహకులు పార్టీ అనుమతి కోసం పరప్ప అగ్రహార పోలీసులను సంప్రదించారని, పుట్టినరోజు పార్టీగా అనుమతి కోరినట్లు తెలుస్తోంది. మొత్తంగా సీసీబీ విచారణను వేగవంతం చేస్తుండగా.. మరోవైపు పోలీసుల డొల్లతనం స్పష్టంగా కనిపిస్తోంది. పూర్తి విచారణ అనంతరం ఈ కేసు ఏ దశకు చేరుకుంటుందో చూడాలి.

Advertisment
Advertisment
తాజా కథనాలు