Telangana: మేడిగట్ట బ్యారేజీ వంతెన కుంగిపోవడంపై.. కేసీఆర్‌పై ఫైర్ అయిన విపక్ష నేతలు కాళేశ్వరం ప్రాజెక్టులోని అతి కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ బ్రిడ్జి కుంగిపోవడంతో బీజేపీ నేతలు బండి సంజయ్, ఈటల రాజేందర్ విమర్శలు గుప్పించారు. దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబమే బాధ్యత వహించాలంటూ బండి సంజయ్ ధ్వజమెత్తారు. జరిగిన నష్టాన్ని కూడా వారి నుంచే రాబట్టాలని డిమాండ్ చేశారు. మేడిగడ్డ బ్యారేజీ కట్టినప్పటి నుంచే లీక్ అవుతోందని ఈటల రాజేందర్ అన్నారు. ఇసుకమీదే ఆ ప్రాజెక్టు కట్టారని.. అప్పట్లో కన్నెపల్లి పంప్‌హౌస్ మొత్తం కూలిపోయిందంటూ విమర్శించారు. ఈ ఘటనపై నిపుణుల కమిటీ వేసి ఒక శ్వేత పత్రాన్ని విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు By B Aravind 23 Oct 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి కాళేశ్వరం ప్రాజెక్టులోని అతి కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ బ్రిడ్జి కుంగిన ఘటన తెలిసిందే. దీనిపై విపక్ష నేతలు సర్వత్రా విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ విషయంపై బీజేపీ ఎంపీ బండి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు. మేడిగడ్డ బ్యారేజీ వంతెన కుంగిపోవడంపై విమర్శించారు. దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబమే బాధ్యత వహించాలంటూ బండి సంజయ్ ధ్వజమెత్తారు. జరిగిన నష్టాన్ని కూడా వారి నుంచే రాబట్టాలని డిమాండ్ చేశారు. దసరా పండుగ సందర్భంగా.. కరీంనగర్‌లోని మహాశక్తి ఆలయంలో జమ్మి చేసిన సంజయ్.. మీడియాతో మాట్లాడారు.అయితే మేడిగడ్డ బ్యారేజీ వంతెన కుంగిపోవడం చూసి దేశ ప్రజలు నవ్వుకుంటున్నారని బండి సంజయ్ అన్నారు. ఒకవేళ కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చినట్లైతే పరిస్థితి ఏంటంటూ ప్రశ్నించారు. కమీషన్ల మీద ఉన్న శ్రద్ద.. ప్రాజెక్టు నాణ్యతా ప్రమాణాల మీద లేదని.. అందుకు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రమాదంలో పడిందని పేర్కొన్నారు. రాజకీయ నేతలు ఆ ప్రాజెక్టును సందర్శిస్తామంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అ్డడుకుంటోంది అంటూ ప్రశ్నించారు. మళ్లీ అధికారంలోకి రాలేమని కారణంతో ప్రాజెక్టు నాణ్యతను వదిలేశారంటూ ఆరోపించారు.ఈ ఘటనపై తమ పార్టీ ఇప్పటికే కేంద్రానికి ఫిర్యాదు చేసిందని తెలిపారు. అలాగే మేడిగడ్డ ప్రాజెక్టుపై పూర్తిస్థాయిలో విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఇక తాజాగా బీజేపీ 52 మంది అభ్యర్థులతో తొలిజాబితా విడుదల చేయగా.. రెండో అభ్యర్థుల జాబితాపై బండి సంజయ్ స్పందించారు. దసరా తర్వాత చర్చించి త్వరలోనే రెండో జాబితా ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఇక మేడిగడ్డ బ్యారేజీ వంతెన కుంగిపోవడం ఆందోళనకరమని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు సైట్ ఎంపికలో కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరించారని పేర్కొన్నారు. మేడిగడ్డ బ్యారేజీ కట్టినప్పటి నుంచే లీక్ అవుతోందని తెలిపారు. ఇసుకమీదే ఆ ప్రాజెక్టు కట్టారని.. అప్పట్లో కన్నెపల్లి పంప్‌హౌస్ మొత్తం కూలిపోయిందంటూ విమర్శించారు.ఆ సమయంలో నిపుణులను పంప్‌హౌస్ పరిసరాల్లోకి రాకుండా 144 సెక్షన్ విధించారని.. నిజాలను దాచే ప్రయత్నం చేశారంటూ ఆరోపణలు చేశారు. ప్రభుత్వం చేస్తున్న తప్పిదం వల్ల వేల కోట్ల రూపాయల నష్టం జరుగుతోందని.. ఇవాళ ప్రాజెక్టు పరిస్థితి నిర్మాణ లోపాలకు అద్దం పడుతుందని పేర్కొన్నారు. అలాగే ఈ ఘటనపై నిపుణుల కమిటీ వేసి ఒక శ్వేత పత్రాన్ని కూడా విడుదల చేయాలంటూ ఈటల డిమాండ్ చేశారు. #brs #telangana-news #bjp #bandi-sanjay #cm-kcr #eetala-rajendar మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి