Kolkata Doctor Murder : ట్రైనీ డాక్టర్ పోస్టుమార్టం రిపోర్టులో సంచలన విషయాలు.. ట్రైనీ డాక్టర్ శరీరంపై మొత్తం 14 గాయాలున్నట్లు పోస్టుమార్టం రిపోర్టులో బయటపడింది. తల, మెడ, చేతులు, ప్రైవేట్ పార్ట్స్‌లో గాయాలయ్యాయి. బాధితురాలిపై గ్యాంగ్ రేప్ జరిగిందా లేదా అనే దానిపై స్పష్టత లేదు. ఆమె శరీరంపై దొరికిన శాంపిల్స్‌ని ఫోరెన్సిక్ టీమ్ DNA టెస్టుకు పంపించింది. By B Aravind 19 Aug 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Trainee Doctor Post - Mortem Report : కోల్‌కతా ఆర్జీ కార్ మెడికల్ కళాశాల (RG Kar Medical College) లో జరిగిన ట్రైనీ డాక్టర్ (Trainee Doctor) హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. అయితే బాధితురాలి పోస్టుమార్టం రిపోర్ట్‌లో సంచలన విషయాలు బయటపడ్డాయి. డాక్టర్ శరీరంపై మొత్తం 14 గాయాలున్నాయి. తల, మెడ, చేతులు, ప్రైవేట్ పార్ట్స్‌లో గాయాలయ్యాయి. ఊపిరితిత్తుల్లో తీవ్ర రక్తస్రావం జరిగింది. శరీరంలో రక్తం గడ్డకట్టుకుపోయింది. నిందితుడు బాధితురాలిని గొంత నులిమి ఊపిరాడకుండా అత్యాచారం, హత్య చేశాడు. Also Read: ఆర్టీసీ బస్సులో గర్భిణికి డెలివరీ చేసిన కండక్టర్ గాయాలు తప్ప ఎముకలు విరగలేదని తేలింది. గ్యాంగ్ రేప్ జరిగిందా లేదా అనేది కూడా పోస్ట్‌మార్టం తేల్చలేదు. డాక్టర్ ప్రైవేట్ పార్ట్‌లో 150 మిల్లీ గ్రాముల వీర్యం ఉందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. పోస్ట్‌మార్టంలో ప్రైవేట్ పార్ట్‌లో వీర్యం ఉందని గుర్తించారు. కానీ అది ఎంత మేర ఉందనేది ధ్రువీకరించలేదు. బాధితురాలి శరీరంపై దొరికిన శాంపిల్స్‌ని ఫోరెన్సిక్ టీమ్ DNA టెస్టుకు పంపించింది. DNA ఫలితాలు వస్తే గ్యాంగ్ రేప్ జరిగిందా లేదా అనేది క్లారిటీ వస్తుంది. ఈ ఘటన జరిగి 10 రోజులు దాటినా కూడా ఇప్పటికీ సరైన సమాచారం లేదు. అధికారులు వివరాలు బయటపెట్టకపోవడంతో సోషల్ మీడియా (Social Media) లో తప్పుడు సమాచారం వ్యాపిస్తోంది. ప్రస్తుతం సీబీఐ విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే ఈ ఘటనను సుప్రీంకోర్టు సూమోటోగా స్వీకరించిన సంగతి తెలిసిందే. అత్యున్నత న్యాయస్థానంలో దీనిపై మంగళవారం కీలక విచారణ జరగనుంది. Also Read: ఆ గ్రామంలో రెండు రోజులు రాఖీ పండుగ.. ఎందుకో తెలుసా ? ఇదిలాఉండగా.. పీజీ సెకండ్ ఇయర్ చదువుతున్న జూనియర్ డాక్టర్ ఇటీవల RG కర్ మెడికల్ ఆస్పత్రిలో రాత్రి విధుల్లో ఉన్నారు. ఆ మరుసటి రోజు ఉదయం సెమినార్ హాల్‌లో ఆమె అర్ధనగ్న స్థితిలో విగతజీవిగా కనిపించారు. సీసీటీవీ ఫుటేజ్‌ల ఆధారంగా పోలీసులు నిందితుడైన సంజయ్ రాయ్‌ను అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ కేసును కోల్‌కతా హైకోర్టు సీబీఐకి బదిలీ చేసింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా పెద్దఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. సీఎం మమతా బెనర్జి (Mamata Banerjee) కూడా నిందితుడికి ఉరిశిక్ష విధించాలన్నారు. #telugu-news #national-news #sexually-assaulted #kolkata-trainee-doctor-case మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి