మీరు నా పెళ్లికి రాలేదుగా..అందుకే ఈ ఫైన్‌ కట్టాల్సిందే..ఓ వధువు వింత ఆలోచన!

పెళ్లికి పిలిచిన అతిథులు రాకపోవడం వల్ల వివాహ విందు వేస్ట్‌ అవ్వడంతో పాటు...కల్యాణ మండపం ఖర్చులు కూడా పెరిగాయని ఆస్ట్రేలియాకు చెందిన ఓ వధువు పెళ్లికి రాని అతిథులకు నోషో పేరుతో జరిమానా కట్టాలని తెలిపింది.

New Update
మీరు నా పెళ్లికి రాలేదుగా..అందుకే ఈ ఫైన్‌ కట్టాల్సిందే..ఓ వధువు వింత ఆలోచన!

సాధారణంగా మనం ఎవరినైనా పెళ్లికి పిలిచినప్పుడు వారు రాకపోతే ఏం చేస్తాం..తరువాత ఎప్పుడైనా వారు ఎందుకు రాలేదో తెలుసుకుంటాం..కానీ ఇక్కడ ఓ వధువు మాత్రం తాను పిలిచినా పెళ్లికి రాని వాళ్లందరకీ ఓ వింత షాక్‌ ఇచ్చింది. అది ఏంటంటే తన పెళ్లికి ఎవరైతే రాలేదో వారంతా కూడా ఫైన్‌ కట్టాలంటూ వారికి లేఖలు పంపింది.

వీటిని చూసిన అతిథులంతా షాక్‌ అవుతున్నారు. ఈ సంఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. తన పెళ్లికి ఆహ్వానాలు పంపినప్పటికీ రాని వారందరూ కూడా కచ్చితంగా జరిమానా కట్టేల్సిందే అంటూ ఆ యువతి చెప్పుకొచ్చింది. ముందుగానే తాను అందరికీ తెలిపాను. వారందరూ పెళ్లికి వస్తారని నేను పెద్ద కల్యాణ మండపాన్ని తీసుకున్నాను.

అతిథులందరికీ సరిపడా భోజనాలు కూడా సిద్దం చేశాను. ఇప్పుడు పిలిచిన అతిథులందరూ రాకపోవడం వల్ల ఆ కల్యాణ మండపానికి పెట్టిన డబ్బు వృథా అయ్యింది. అంతేకాకుండా..భోజనాలు కూడా చాలా మిగిలిపోయి వృథా అయినట్లు ఆ వధువు పేర్కొంది. వాటికి అన్నింటికి కారణం పిలిచిన అతిథులు రాకపోవడమే.

అందుకే నోషో పేరుతో అతిధులకు జరిమానా విధించింది. కొంతమంది బంధువులు, స్నేహితులు ఏవో పిచ్చి కారణాలు చెబుతూ పెళ్లికి రావడానికి నిరాకరించారు. దీంతో ఖర్చు అయిన డబ్బును వారి దగ్గరే వసూలు చేయాలనుకుంటున్నట్లు నిర్ణయించుకున్నానని వధువు తెలిపింది. ఈ విషయం తెలిసిన బంధువులు, స్నేహితులు ఏంట్రా ఇది అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.

Also read: కరోనా కొత్త వేరియెంట్ పై సీఎం జగన్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pakistan PM: యుద్ధానికి సిద్ధం సైన్యానికి సెలవులు రద్దు.. పాకిస్థాన్ కీలక ప్రకటన

భారత్ సిందూ ఒప్పందం రద్దు చేయడమంటే యుద్ధం ప్రకటించడమే అంటూ పాక్ పేర్కొంది. పాక్ ప్రధాన మంత్రి గురువారం అత్యవసర సమావేశం నిర్వహించారు. పాక్ సైన్యానికి సెలవులు రద్దు చేసింది. భారత్ దాడి చేస్తే.. తిప్పికొట్టాలని ఆర్మీని ఆదేశించింది.

New Update
pak meeting

పాక్, భారత్ మధ్య ఉత్రిక్తత పరిస్థితిను నెలకొన్నాయి. పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ పాక్‌తో దౌత్య సంబంధాలు తెచ్చుకుంది. పాకిస్థాన్ హై కమిషన్ ఆఫీస్ కూడా ఖాళీ చేయాలని 72 గంటల టైం ఇచ్చింది. అలాగే సిందూ నదీ జలాల ఒప్పందం కూడా రద్దు చేసింది. దీంతో గురువారం పాకిస్థాన్ ప్రధాన మంత్రి ముహమ్మద్ షెహబాజ్ షరీఫ్ అత్యవసర సమావేశం నిర్వహించారు. పాకిస్తాన్ ప్రభుత్వం కూడా భారత వైఖరిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. పాకిస్తాన్ సైన్యానికి సెలవులు రద్దు చేసింది.

భారత్ దాడి చేస్తే తిప్పికొట్టాలని పాక్ ఆర్మీకి ఆదేశాలు జారీ చేసింది. జాతీయ భద్రతా కమిటీ సమావేశంలో అనేక నిర్ణయాలు తీసుకున్నారు. పహల్గామ్ దాడిలో భారత్ అసత్యాలు ప్రచారం చేస్తోందని పాక్ ప్రధాని రిలీస్ చేసిన ప్రెస్ మీట్ లో అన్నాడు. భారత్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటుందని ఆయన అన్నారు. పాకిస్థాన్ భద్రతా అధికారులు, ఆర్మీ ఆఫీసర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సింధు జలాల ఒప్పందాన్ని నిలుపుదల చేయాలన్న భారత ప్రకటనను పాకిస్తాన్ తీవ్రంగా తిరస్కరించింది. ఈ ఒప్పందం ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వం వహించిన ఒక అంతర్జాతీయ ఒప్పందం. ఏకపక్షంగా నిలిపివేయడానికి ఇందులో ఎటువంటి నిబంధన లేదని పాక్ ప్రధాని చెప్పారు.

సిందూ నదీ జలాలు ఆపడం అంటే యుద్ధం ప్రకటించడమే అని పాక్ అభిప్రాయ పడుతుంది. భారత్ నుంచి పాకిస్థాన్‌కు విమానాలను కూడా పాకిస్తాన్ రద్దు చేసింది. పాకిస్తాన్, దాని సార్వభౌమాధికారానికి ఏదైనా భంగం వాటిల్లితే వెంటనే ప్రతిచర్యలు ఉంటాయని పాకిస్తాన్ ప్రధాన మంత్రి ముహమ్మద్ షెహబాజ్ షరీఫ్ అన్నాడు.

( attack in Pahalgam | india pakistan news | india-pakistan | war | terrorist | jammu-and-kashmir | pakistan | latest telugu news | today news in telugu)

 

Advertisment
Advertisment
Advertisment