దారుణం.. భార్యను కాల్చి ఆత్మహత్య చేసుకున్న పోలీస్ అధికారి

పని ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులతో పోలీస్‌ అధికారి తనువు చాలించిన ఘటన మహారాష్ట్రలోని పూణేలో చోటు చేసుకుంది. పోలీస్ అధికారి తాను ఆత్మహత్య చేసుకోవడమే కాక తనతోపాటు కుటుంబీకులను సైతం చంపేశాడు స్థానికంగా ఏసీపీగా పని చేస్తున్న 57 ఏళ్ల భరత్ గైక్వాడ్.. భార్య, మేనల్లుడిని కాల్చి చంపి అనంతరం తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. మృతులు భరత్ గైక్వాడ్‌ అతని భార్య మోని గైక్వాడ్, మేనల్లుడు దీపక్‌గా గుర్తించారు. సోమవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.

New Update
దారుణం.. భార్యను కాల్చి ఆత్మహత్య చేసుకున్న పోలీస్ అధికారి

Atrocious.. Police officer who shot his wife and committed suicide

పని ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులతో పోలీస్‌ అధికారి తనువు చాలించిన ఘటన మహారాష్ట్రలోని పూణేలో చోటు చేసుకుంది. పోలీస్ అధికారి తాను ఆత్మహత్య చేసుకోవడమే కాక తనతోపాటు కుటుంబీకులను సైతం చంపేశాడు స్థానికంగా ఏసీపీగా పని చేస్తున్న 57 ఏళ్ల భరత్ గైక్వాడ్.. భార్య, మేనల్లుడిని కాల్చి చంపి అనంతరం తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. మృతులు భరత్ గైక్వాడ్‌ అతని భార్య మోని గైక్వాడ్, మేనల్లుడు దీపక్‌గా గుర్తించారు. సోమవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.

తుపాకి శబ్ధం విన్న స్థానికులు ఘటనా స్థలికి వెళ్లి చూడటంతో ముగ్గురు అప్పటికే మృతి చెందారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమర్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఏసీపీ వాడిన తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. గైక్వాడ్ అమరావతిలో ఏసీపీగా పనిచేస్తున్నాడు. సెలవుపై ఇంటికి వచ్చిన వెంటనే గైక్వాడ్ కాల్పులు జరిపినట్లు గుర్తించారు. ముందుగా తన భార్య తలపై కాల్పులు జరిపినట్లు పోలీసుల విచారణలో తేలింది. కాల్పుల శబ్ధం వినడంతో కుమారుడు, మేనల్లుడు పరిగెత్తుకుంటూ వచ్చారని, తలుపు తెరవడంతోనే మేనల్లుడిపై కాల్పులు జరిపాడని పోలీసులు వెల్లడించారు. అతడి ఛాతీలోకి బులెట్లు దూసుకెళ్లాయన్నారు. అనంతరం గైక్వాడ్ సైతం తలపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని వెళ్లడించారు. ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారని పోలీసులు వివరించారు.

కాల్పులకు ఏసీపీ ప్రైవేట్ పిస్టల్ వాడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాల్పుల సమయంలో గైక్వాడ్ తల్లి, ఇద్దరు కుమారులు, ఇతర కుటుంబసభ్యులు కూడా ఉన్నారు. వారి ఎదురుగానే గైక్వాడ్ తన భార్యను, మేనల్లుడి కాల్చి అనంతరం తాను కాల్చుకున్నట్లు ప్రత్యేక్ష సాక్షులు వెల్లడించారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు  ఉన్నతాధికారి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఏసీపీ పని ఒత్తిడి వల్ల సూసైడ్‌ చేసుకుంటే.. అతనిపై ఎవరు ఒత్తిడి తీసుకువచ్చారనే కోణంలో సైతం విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

గతంలో తెలుగు రాష్ట్రాల్లో  సీఐ స్థాయి నుంచి కానిస్టేబుళ్ల వరకు పలువురు ఆత్మహత్య చేసుకున్నారు. కొందరు అధికారులు పోలీస్‌ స్టేషన్‌లోనే ఆత్మహత్య చేసుకోగా మరికొందరు ఇంట్లో కాల్చుకొని తనువు చాలించారు. పోలీస్ అధికారులు ఎందుకు సూసైడ్‌ చేసుకుంటున్నారనేది చర్చనీయంశంగా మారింది. ప్రజలను రక్షించాల్సిన పోలీస్ అధికారులు బలవన్మరణం చేసుకోవడంతో వారి క్రింది స్థాయి అధికారులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు