Asaduddin Owaisi : 23.87కోట్ల ఆస్తితో పాటూ రెండు తుపాకులూ ఉన్నాయి..అసదుద్దీన్ ఓవైసీ తెలంగాణలో బలమైన ముస్లిమ్ నాయకుల్లో ఒకరైన అసదుద్దీన్ ఓవైసీ నిన్న ఎంఐఎం ఎంపీగా నామినేషన్ దాఖలు చేశారు. భారీ ర్యాలీగా వెళ్ళి హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తన నామినేషన్‌ను సమర్పించారు. దాంతో పాటూ తన ఆస్తులు, అప్పుల వివరాలను కూడా ప్రకటించారు. By Manogna alamuru 20 Apr 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి MIM Leader : హైదరాబాద్(Hyderabad) ఎంఐఎం ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ(Asaduddin Owaisi) నిన్న నామినేషన్ దాఖలు చేశారు. అసదుద్దీన్ ఓవైసీ చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీతో పాటు మజ్లిస్ ఎమ్మెల్యేలు అహ్మద్ బలాలా, మొహమ్మద్ ముబీన్, జుల్ఫీకర్ ఆలీ, జాఫర్ హుస్సేన్ మెరాజ్, మాజిద్ హుస్సేన్, కౌసర్ మొయినుద్దీన్, ఎమ్మెల్సీ మీర్జా రహమత్ బేగ్, మాజీ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్, యాసర్ అర్ఫాజ్లతో పాటు స్థానిక ఎంఐఎం(MIM) కార్పొరేటర్లతో కలిసి చార్మినార్ మక్కా మసీదులో ప్రార్ధనలు చేసిన అసదుద్దీన్...అక్కడ నుంచి మక్కామసీదు నుంచి చార్మినార్, గుల్జారాహౌజ్ల మీదుగా మదీనా నయాఫూల్ నుంచి హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి భారీ ర్యాలీగా వెళ్ళి మరీ నామినేషనల్ దాఖలు చేశారు. ఈ క్రమంలో నామినేషనల్‌ఓ తన ఆస్తులు అప్పుల వివరాలను వెల్లడించారు. ఎంఐఎం ముఖ్యనేత అసదుద్దీన్ హైదరాబాద్ ముస్లింలకు ప్రతినిధిగా చాలా ఏళ్ళ నుంచి వ్యవహరిస్తున్నారు. ఈయనకు చాలానే ఆస్తులున్నాయి. అసదుద్దీన్ మొత్ంత ఆస్తి విలు 23.87 కోట్లు. ఇందులో 20.91 కోట్లు స్థిరాస్తులు ఉంటే 2జ96 కోట్లు చరాస్తులను కలిగి ఉన్నారు. అంతకుముందు 2019లో అసదుద్దీన్ సమర్పించిన అఫిడవిట్‌లో ఆయన ఆస్తుల విలువ 12 కోట్లు, 1.67 కోట్లు ఉండగా ఐదేళ్ళల్లో అవి దాదాపుగా రెండు రెట్లు పెరిగాయి. అసదుద్దీన్ ప్రస్తుతం సమర్పించిన అఫిడవిట్‌లో లెక్కల ప్రకారం ఆయన ఆస్తులు 23 కోట్లు ఉండగా...ఆయన భార్యకు రూ.15.71 లక్షల విలువైన చరాస్తులు, రూ.4.90 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. ఇక అప్పుల విషయానికి వస్తే మాత్రం భార్యాభర్తలు ఇద్దరివీ కలిపి 7.05 కోట్లు ఉన్నాయని ప్రకటించారు. ఇది కాక అసదుద్దీన్ దగ్గర లక్ష రూపాయల విలువైన ఎన్‌పి బోర్ .22 పిస్టల్ మరియు ఎన్‌పి బోర్ 30-60 రైఫిల్ ఉన్నాయి. ఈయన మీద బోలెడు క్రిమెనల్ కేసులుకూడా ఫైల్ అయ్యాయి. మొత్తం ఐదు క్రిమినల్ కేసులో పెండింగ్‌లో ఉన్నాయి. అయితే అసదుద్దీన్ మాత్రం తాను ఏ నేరాలకు పాల్పడలేదని చెబుతున్నారు. అసదుద్దీన్ స్థిరాస్తుల్లో భూములు, వ్యవసాయ భూములు లాంటివి ఏమీ లేవు. అతనికి ఉన్నవల్లా రెండు ఇళ్ళు. ఇవి ఒక్కొక్కటే కోట్ల ఖరీదు చేస్తాయి. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం శాస్త్రిపురం మైలార్‌దేవ్‌పల్లిలోని అసదుద్దీన్‌కు 1,30,680 ఎస్‌ఎఫ్టీ స్థలంలో 36,250 ఎస్‌ఎఫ్టీ భవనం ఉంది. ఇందులో ఆయనకు 3/4, భార్యకు నాలుగోవంతు వాటా ఉందని తెలిపారు. ఈ భవన నిర్మాణ ఖర్చులో తన భార్య వాటా కింద తనకు రూ.1.20 కోట్లు బాకీ ఉందని తెలిపారు ఓవైసీ. ఇది కాక హైదరాబాద్‌లోని మిస్రీగంజ్‌లో 3843 ఎస్‌ఎఫ్టీ స్థలంలో మరో ఇల్లు ఉంది. ఈ భవనాన్ని రూ.2.04 కోట్లకు కొనుగోలు చేయగా ప్రస్తుతం దాని విలువ దాదాపు రూ.19.65 కోట్లకు పెరిగింది. అయితే ఇన్ని ఉన్నా కానీ తన పేరు మీద కానీ, తన కుటుంబ సభ్యల పేరు మీద ఎటువంటి సొంతకారు లేదని చెప్పారు ఓవైసీ. ప్రస్తుతం తాను ఎంపీగా తనకు వచ్చే జీతమే తన జీవనాధారమని తెలిపారు అసదుద్దీన్ ఓవైసీ. బ్యాంకుల్లో కూడా తన వద్ద 2 లక్షలు, తన భార్య దగ్గర 50 వేలు నగదు ఉన్నాయని అఫిడవిట్లో రాశారు. మూడు బ్యాంకుల్లో కలిపి రూ.1.56 కోట్లు, తన భార్య పేరున ఒక బ్యాంకులో రూ.1.30 లక్షలున్నాయని ప్రకటించారు. భార్య పేరిట రూ. 14.41 లక్షల విలువైన 20 తులాల బంగారం ఉందని ప్రకటించారు. 1994 నుంచి అసదుద్దీన్ తెలంగాణ రాజకీయాల్లో ఉన్నారు. Also Read:Amith Sha: కేంద్రమంత్రికి కారు లేదంట..ఎన్నికల అఫిడవిట్‌లో అమిత్ షా ఆస్తుల వివరాలు #telangana #hyderabad #mim #asaduddin-owaisi #nomination మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి