/rtv/media/media_files/2025/04/23/itjjcx0lhbhRceYiUNmm.jpg)
Indus River
కాశ్మీర్ లోని పహల్గామ్ లోని బైసరన్ వ్యాలీ ఉగ్రవాదుల సృష్టించిన మారణకాండ భారతదేశం మొత్తాన్ని కన్నీటి సంద్రంలో ముంచివేసింది. ఈ దాడిలో 28 మంది అమాయక టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. మరో 60 మంది గాయపడ్డారు. దీనికి తామే కారణం అని పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబా ప్రాక్సీ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ ఉగ్రసంస్థ ప్రకటించింది. ఈ దాడిలో పాకిస్తాన్ ప్రమేయం కూడా ఉన్నట్టు భారత ఇంటెలిజెన్స్ సంస్థలు కనుగొన్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వం తమకేమీ సంబంధం లేదని బుకాయిస్తున్నప్పటికీ...ఉగ్రవాదులకు ఊతమిచ్చింది ఆ దేశమేనని స్పష్టంగా తెలుస్తోంది.
పహల్గామ్ దాడులపై కేంద్ర ప్రభుత్వం వెంటనే అలెర్ట్ అయింది. ప్రధాని మోదీ తన సౌదీ పర్యటనను మధ్యలోనే ముగించుకుని వచ్చేశారు. ఈరోజు ఉదయం నుంచీ రక్షణశాఖ, క్యాబినెట్ తో చర్చలు జరుపుతూనే ఉన్నారు. వీటి తర్వాత పాకిస్తాన్ విషయంలో భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పాక్ పౌరులు, పర్యటకులు ఎవరైనా ఇండియాలో ఉంటే వారం రోజుల్లో వారి దేశానికి వెళ్లాలని అట్టారి ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్ట్ ను వెంటనే నిలిపివేస్తున్నట్లుగా కేంద్రం తెలిపింది. పాక్ పౌరులును ఇండియాలోకి అనుమతించేది లేదని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఇండస్ వాటర్ ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు తెలిపింది. SAARC వీసా మినహాయింపు పథకం (SVES) వీసాల కింద పాకిస్తానీ పౌరులు భారత్ లో ప్రయాణించడానికి అనుమతించబడరు. ప్రస్తుతం భారత్ లో ఉ్న వారు కూడా 48 గంటల్లో తమ దేశానికి వెళ్ళిపోవాలి .
సింధూ జలాల ఒప్పందం...
సీమాంతర ఉగ్రవాదాన్ని పోషిస్తున్న పాకిస్తాన్ కు భారత్ చాలా సార్లే అవకాశం ఇచ్చింది. అయినప్పటికీ ఆ దేశం మారలేదు. ఇప్పుడు తాజాగా జరిగిన ఉగ్రదాడితో కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ఇంక ఉపేక్షించేదే లేదంటూ సింధు జాలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. గతంలోనే ప్రధాని మోదీ రక్తం, నీరు కలిపి ఒకచోట ప్రవహించలేదు అని అన్నారు. కానీ ఇప్పటి వరకు పాక్ ను ఇబ్బంది పెట్టకూడదనే ఆలోచనతో సిధుజలాల జోలికి వెళ్ళలేదు. తాజాగా పాక్ తో దౌత్య సంబంధాలతో పాటూ 64 ఏళ్ళ సింధు జలాల ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకుంది భారత్.
ఎడారిగా మారనున్న పాక్..
ఇది పాక్ చాలా పెద్ద షాక్. ఇండస్ రివర్ వాటర్ ఆగిపోతే పాకిస్తాన్ ఎడారిగా మారుతుంది అనడంతో ఎటువంటి సందేహం లేదు. ప్రపంచంలో అతి తక్కువ నీటి వనరులు ఉన్న దేశాల్లో పాకిస్తాన్ ఒకటి. దీనికి ప్రధాన ఆయువు ఇండస్ రివర్ వాటర్ ఒక్కటే. మొత్తం దేశ వ్యవసాయం సింధూ జలాలపైనే ఆధారపడి ఉంటుంది. అక్కడి పంజాబ్, సింధ్ వంటి రాష్ట్రాలకు ఇదే ప్రధాన వనరు. బలూచిస్తాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా, సింధ్ ప్రాంతాలు అతి తక్కువ నీటి వనరులు కలిగిన ప్రాంతాలుగా ఉన్నాయి. ఇప్పుడు భారత్ ఈ నీటిని ఆపేస్తే ఈ ప్రాంతాలన్నీ ఎడారిగా మారతాయి. ఇప్పటికే విపరీతమైన ద్రవ్యోల్బణం, పేదరికాన్ని ఎదుర్కొంటున్న పాకిస్తాన్ ఈ దెబ్బకు మలమల మాడిపోవడం ఖాయం. దీంతో అక్కడ తాగు నీటికి కూడా కొరత ఏర్పడుతుంది.
ఏమిటీ ఒప్పందం..?
సింధూ నదీ జలాలపై 1960లో అప్పటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, పాక్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్‌లు వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంలో ఒప్పందం కుదుర్చుకున్నారు. దీని ప్రకారం భారత్‌కి తూర్పు నదులు బియాస్, రావి, సట్లేజ్‌లపై, పాకిస్తాన్‌కి పడమర నదులైన సింధు, చీనాబ్, జీలం నదులపై నియంత్రణ ఉంటుంది. సింధూ నది చైనాలో పుట్టి భారత్ మీదుగా పాకిస్తాన్ లోకి ప్రవహిస్తుంది. అందువల్లనే ఈ నదిపై రెండు దేశాల ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందం వల్ల సింధూ జలాల్లో 80 శాతం నీటిని పాక్ వినియోగించుకుంటోంది. ఇంతకు ముదు కడా చాలా సార్లు ఈ షింధూ జలాల ఒప్పందం వివాదాస్పదం అయింది. దీని వల్ల భారత్ కన్నా పాకిస్తాన్ ఎక్కువ లబ్ధి పొందిందనే వాదన కూడా ఉంది. 2016 ఉరీ ఉగ్రదాడి తర్వాత భారత ప్రధాని నరేంద్రమోడీ.. ‘‘రక్తం, నీరు కలిసి ప్రవహించలేవు’’ అని వ్యాఖ్యానించారు. 2023లో ఈ ఒడంబడికపై మళ్లీ చర్చించాల్సిందిగా భారత్ అధికారికంగా పాకిస్తాన్‌కి తెలియజేసింది. అయితే, పాక్ మాత్రం పాత ఇండస్ వాటర్ ట్రిటీ నిర్దేశించిన విధానాలకు కట్టుబడి ఉండాలనే కోరికను వ్యక్తం చేసింది. అయితే ఇప్పుడు మాత్రం పాక్ కు గట్టిగానే బుద్ధి చెప్పాలని భారత్ నిర్ణయించుకుంది. అందుకే ఆ దేశానికి జీవనాడి అయిన సింధూ జలాలను కట్ చేసి పారేసింది.
today-latest-news-in-telugu | pakistan | sindhu | river
Also Read: BIG BREAKING: మోడీ సంచలన నిర్ణయం.. పాకిస్థాన్తో సంబంధాలు క్లోజ్!
Hyderabad: నవనీత్‌కు కౌంటరిచ్చిన అసదుద్దీన్ ఓవైసీ
ఎన్నికల వేళ బీజేపీ, ఎంఐఎం మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. బీజేపీ ఎంపీ నవనీత్ కౌర్ వ్యాఖ్యలకు ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. గంట తీసుకోండి...ముస్లింలను ఏం చేస్తారో చేయండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Asaduddin Owaisi Counter To Navneet Kaur: 15 సెకన్లు ఎందుకు..గంట సమయం తీసుకోండి..ముస్లింలను ఏం చేస్తారో చేయండి అంటూ ఎంఐఎం నేత అసుద్దీన్ ఓవైసీ విరుచుపడ్డారు. మేం ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం అంటూ అసదుద్దీన్ బీజేపీ ఎంపీ నవనీత్ కౌర్ తమపై చేసిన సంచలన వ్యాఖ్యలకు కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. అధికారమంతా మీ దగ్గరే ఉంది...ఏమైనా చేయగలరు అంటూ మండిపడ్డారు.
దుమారం రేపిన నవనీత్ కౌర్ వ్యాఖ్యలు..
అంతకు ముందు మహారాష్ట్రలోని అమరావతికి చెందిన బీజేపీ ఎంపీ నవనీత్ కౌర్ రాణా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. హైదరాబాద్ లో బీజేపీ అభ్యర్ధి మాధవీలత ప్రచారానికి వచ్చిన ఆమె ఎంఐఎం సోదరులపై వ్యాఖ్యలు చేశారు. పోలీసులు 15 నిమిషాల పాటు వెనుదిరిగితే.. మేమేం చేయగలమో చూపిస్తామని అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు.. కానీ మాకు 15 సెకన్లు మాత్రమే చాలు. సోదరిద్దరూ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు అన్నది కూడా తెలియదు అంటూ నవనీత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు వీటి మీద ఎంఐఎం నేతలు విరుచుకుపడుతున్నారు.
Also Read:Hyderabad: తమ్ముడూ మాకు 15సెకన్లు చాలు..ఎంఐఎంపై బీజేపీ అభ్యర్ధి నవనీత్ కౌర్ సంచలన వ్యాఖ్యలు
Indus River Agreement: 64 ఏళ్ళ ఒప్పందానికి స్వస్తి..ఎడారిగా మారనున్న పాకిస్తాన్
64 ఏళ్ళ క్రితం మాజీ ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ, అప్పటి పాక్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ మధ్య జరిగి సింధూ జలాల ఒప్పందం రద్దు చేసుకోవాలని తాజాగా భారత ప్రభుత్వం నిర్ణయించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్ | నేషనల్
Chess: ఫిడే మహిళల గ్రాండ్‌ప్రి చెస్ టోర్నీ విజేతగా కోనేరు హంపి
ఫిడే వుమెన్ గ్రాండ్ ప్రి చెస్ టోర్నీలో తెలుగు అమ్మాయి కోనేరు హంపి విజేతగా నిలిచింది. పునేలో జరిగిన ఈ చెస్ టోర్నీలో చివరి ఆట సమయానికి జు జినర్ తో కలిసి ఆమె అగ్రస్థానంలో కొనసాగింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
Aghori: చంచల్‌గూడ జైలుకు అఘోరీ.. ప్రత్యేక బ్యారక్ ఏర్పాటు చేసి!
చీటింగ్ కేసులో అరెస్టైన లేడీ అఘోరిని ఎట్టకేలకు పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. క్రైం | Short News | Latest News In Telugu | హైదరాబాద్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
TG Crime: కోడలిపై మోజుతో కొడుకును లేపేసిన తండ్రి.. రోకలి బండతో కొట్టి చంపి!
వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. రేపాకపల్లికి చెందిన మొండయ్య కోడలిపై మోజుతో కొడుకు. పనిచేస్తున్నట్లు తెలిపారు. క్రైం | Short News | Latest News In Telugu | వరంగల్
🔴Pahalgam Terrorist Attack: మోడీ సంచలన నిర్ణయం.. పాకిస్థాన్ కు బిగ్ షాక్!
జమ్ము కశ్మీర్లో అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గాం ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఈ భీకర ఘటనలో 27 మంది ప్రాణాలు కోల్పోగా. Latest News In Telugu | నేషనల్
BIG BREAKING: మోడీ సంచలన నిర్ణయం.. పాకిస్థాన్తో సంబంధాలు క్లోజ్!
జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తరువాత కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ తో Short News | Latest News In Telugu | నేషనల్
SRH VS MI: మళ్ళీ హైదరాబాద్ ఓటమి..వరుసగా ముంబైకు నాలుగో విజయం
Indus River Agreement: 64 ఏళ్ళ ఒప్పందానికి స్వస్తి..ఎడారిగా మారనున్న పాకిస్తాన్
Chess: ఫిడే మహిళల గ్రాండ్‌ప్రి చెస్ టోర్నీ విజేతగా కోనేరు హంపి
Aghori: చంచల్‌గూడ జైలుకు అఘోరీ.. ప్రత్యేక బ్యారక్ ఏర్పాటు చేసి!
వర్షిణి ఏడవకు నేనున్నా నీ భర్తను బయటకు తెస్తా.. | Lawyer Comments On Aghori Arrest | RTV