Kejriwal Arrest: ఈడీ తన 68 ఏళ్ల చరిత్రలో తొలిసారి ఇలా! అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుతో 68 ఏళ్ల ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చరిత్రలో సిట్టింగ్ సీఎంను దర్యాప్తు సంస్థ అరెస్ట్ చేయడం ఇదే తొలిసారి. ఇప్పటి వరకు సిట్టింగ్ సీఎంను ఈడీ అరెస్ట్ చేయలేదు.ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఈడీ అరెస్టు చేయడం ఇది 16 వది. By Bhavana 22 Mar 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Kejriwal: ఢిల్లీ మద్యం కుంభకోణం(Delhi Liquor Scam) లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ (ED) అరెస్ట్ చేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఈడీ అరెస్టు చేయడం ఇది 16వది. అంతకుముందు, దర్యాప్తు సంస్థ బీఆర్‌ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కె. కవితను అరెస్టు చేశారు. దీంతో అరెస్టును తప్పించుకునేందుకు అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో గురువారం జరిగిన విచారణలో కేజ్రీవాల్‌కు ఉపశమనం కల్పించేందుకు హైకోర్టు నిరాకరించింది. అనంతరం ఈడీ బృందం గురువారం సాయంత్రం ఏడు గంటలకు సీఎం నివాసానికి చేరుకుంది. రెండు గంటల విచారణ అనంతరం కేజ్రీవాల్ ను ఇక్కడే అరెస్టు చేశారు. సిట్టింగ్ సీఎంను తొలిసారిగా ఈడీ అరెస్ట్ చేసింది అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుతో 68 ఏళ్ల ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చరిత్రలో సిట్టింగ్ సీఎంను దర్యాప్తు సంస్థ అరెస్ట్ చేయడం ఇదే తొలిసారి. ఇప్పటి వరకు సిట్టింగ్ సీఎంను ఈడీ అరెస్ట్ చేయలేదు.అంతకుముందు జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌ను కూడా ఈడీ అరెస్ట్ చేసింది.అయితే ఆయన అరెస్ట్ కాకముందే సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాతే ఈడీ అతడిని అరెస్ట్ చేసింది. సీఎం నివాసం నుంచి అరెస్ట్ అయిన తర్వాత ఈడీ నేరుగా కేజ్రీవాల్‌ను తన కార్యాలయానికి తీసుకెళ్లింది. శుక్రవారం రోస్ అవెన్యూ కోర్టులో కేజ్రీవాల్ కు వైద్య పరీక్షలు ఈడీ కార్యాలయంలోనే జరగనున్నట్లు సమాచారం. అనంతరం శుక్రవారం రోస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. అతని రిమాండ్ కోసం ED అడిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ వ్యవహారంపై తక్షణం విచారణ జరపాలని కూడా విజ్ఞప్తి చేశారు. అయితే గురువారం విచారణ జరగలేదని, ఆ తర్వాత శుక్రవారం విచారణ చేపట్టవచ్చని చెబుతున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ కూడా అరెస్టైన సంగతి తెలిసిందే. Also read: కేజ్రీవాల్ అరెస్ట్ రాజ్యాంగ విరుద్దం! #arrest #ed #liquor-scam #kejriwal మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి