Team India: కోహ్లీ, రోహిత్ కాదు.. ఈ ఏడాది ఎక్కువ డబ్బులు సంపాదించిన ప్లేయర్‌ ఇతనే!

టీ20ల పరంగా ఈ ఏడాది ఎక్కువగా డబ్బులు సంపాదించిన ప్లేయర్‌గా పేసర్ అర్ష్‌దీప్‌ నిలిచాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఒక్కొ మ్యాచ్‌కు బీసీసీఐ రూ.3లక్షల మ్యాచ్‌ ఫీజ్‌ చెల్లిస్తుంది. ఈ ఏడాది ఇప్పటివరకు 19 టీ20లు ఆడిన అర్ష్‌దీప్‌ రూ.57లక్షలు సంపాదించాడు.

New Update
Team India: కోహ్లీ, రోహిత్  కాదు.. ఈ ఏడాది ఎక్కువ డబ్బులు సంపాదించిన ప్లేయర్‌ ఇతనే!

క్రికెటర్ల సంపాదన కోట్లలో ఉంటుంది. అయితే వన్డే, టెస్టులతో పోల్చి చూస్తే టీ20 మ్యాచ్‌కు ఉండే ఫీచ్ కాస్త తక్కువ. ఎందుకంటే టీ20 అంటే హార్డ్‌లీ మూడున్నర నుంచి నాలుగు గంటల్లో ముగిసిపోతుంది. టెస్టులు ఐదు రోజులు జరుగుతాయని తెలిసిందే. ఇక ఏడాది కాలంగా.. చెప్పాలంటే 2022 టీ20 వరల్డ్‌కప్‌ తర్వాత రోహీత్‌(Rohit), కోహ్లీ(Kohli), రాహుల్‌ అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లకు దూరంగా ఉంటున్నారు. ఇక ఇదే సమయంలో హార్దిక్‌ కొన్నాళ్లు ఈ ఫార్మెట్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇక వరల్డ్‌కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌పై జరిగిన మ్యాచ్‌ హార్దిక్‌ పాండ్యా(Hardik Pandya) గాయపడ్డ విషయం తెలిసిందే. దీంతో ఇటీవలే జరిగిన ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు కెప్టెన్‌గా సూర్యకుమార్‌యాదవ్‌(SuryaKumar yadav) వ్యవహరించాడు. ఏడాదిన్నరకాలంగా సూర్యభాయ్‌ టీ20ల్లో కీలక ఆటగాడిగా ఉన్నాడు. వరుసపెట్టి అన్నీ మ్యాచ్‌లు ఆడుతుండడంతో ఈ ఏడాది సూర్యా ఎక్కువే సంపాదించాడు. కానీ లిస్ట్‌లో మాత్రం అతను ఫస్ట్ కాదు.

publive-image ఈ ఏడాది టీ20ల్లో ఎక్కువ డబ్బులు సంపాదించిన ప్లేయర్ల లిస్ట్

ఫస్ట్ ఎవరంటే?
ప్రతి టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌కి, బీసీసీఐ రూ.3 లక్షల మ్యాచ్ ఫీజు చెల్లిస్తుంది. 2023లో టీ20ల్లో పేసర్ అర్ష్‌దీప్‌ రూ.57 లక్షలు సంపాదించి టాప్‌ ప్లేస్‌లో నిలిచాడు. అర్ష్‌దీప్‌(Arshdeep Singh) ఈ ఏడాది 19 టీ20లు ఆడాడు. ప్రస్తుత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ రెండో స్థానంలో ఉన్నాడు. ఈ ఏడాది సూర్య టీమిండియాకు 16 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. దీంతో ఈ ఏడాది అతను సంపాదించిన మొత్తం మ్యాచ్ ఫీజు రూ.48 లక్షలు. యశస్వి జైస్వాల్, అక్షర్ పటేల్, తిలక్ వర్మలు ఒక్కొక్కరు 13 మ్యాచ్‌లు ఆడి 39 లక్షల రూపాయలు సంపాదించి మూడో స్థానంలో ఉన్నారు. 11 గేమ్‌లతో రూ.33 లక్షల సంపాదించిన ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవి బిష్ణోయ్, శుభ్‌మాన్ గిల్ నాల్గవ స్థానంలో నిలిచారు.

విమానం ఎక్కిన భారత్‌ జట్టు:
ఈ ఏడాది భారత్‌ ఇప్పటివరకు మొత్తం 21 టీ20 మ్యాచ్‌లు ఆడింది. అందులో 14 గెలిచింది. 6 ఓడింది. ఒక మ్యాచ్‌ రద్దైంది. రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలోని భారత్‌ గత అక్టోబర్‌లో జరిగిన ఆసియా క్రీడల నుంచి చారిత్రాత్మక బంగారు పతకాన్ని ఇంటికి తీసుకువచ్చింది. ఇక దక్షిణాఫ్రికాతో డిసెంబర్ 10న నుంచి సిరీస్‌ మొదలుకానుండగా.. మూడు టీ20లు ఆడనుంది. దక్షిణాఫ్రికా పర్యటనకు భారత టీ20, వన్డే, టెస్టు జట్లను ఒకేసారి ప్రకటించారు. ఈ పర్యటనలో జరిగే మూడు ఫార్మాట్ల సిరీస్‌లో భారత జట్టు కెప్టెన్లు కూడా వేరువేరుగా ఉన్నారు. టీ20 సిరీస్‌కు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. వన్డే సిరీస్‌కు కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా టెస్టు సిరీస్‌కు రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఉంటారు. ఈ మూడు జట్లు కలిసి ఒకేసారి దక్షిణాఫ్రికాకు విమానం ఎక్కాయి.

Also Read: టెస్టు క్రికెట్‌లో తొలి బంగ్లా బ్యాటర్‌.. విచిత్రంగా ఔటైన స్నేక్‌ డ్యాన్సర్‌..! వీడియో!

WATCH:

Advertisment
Advertisment
తాజా కథనాలు