Vijayawada:గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై అరెస్ట్ వారెంట్

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి విజయవాడ ప్రతినిధుల కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. కొన్ని రోజుల క్రితం ప్రసాదంపాడులో జరిగిన ఓ ఘటనపై వల్లభనేని వంశీ మీద కేసు నమోదైంది. ఈ కేసు విచారణకు కోర్టుకు హాజరుకాకపోవడంతో వంశీకి వారెంట్ జారీ చేసింది.

New Update
Vijayawada:గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై అరెస్ట్ వారెంట్

Vallabhaneni Vamsi Arrest:గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. విజయవాడ ప్రతినిధుల కోర్టు ఈ వారెంట్‌ను జారీ చేసింది. 2019 ఎన్నికల సమయంలో ‌పోలింగ్ బూత్ వద్ద జరిగిన ఓ వివాదంలో వంశీ మీద కేసు నమోదు అయింది. దాని విజయవాడ కోర్టు చాలాసార్లు విచారణ చేసింది. అయితే వీటికి వేటికీ వంశీ హాజరుకాలేదు. ఈ కారణంతో ఇప్పుడు విజయవాడ ప్రతినిధుల కోర్టు ఆయన మీ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.

Also read:Jharkhand:సుప్రీంకోర్టులో హేమంత్ సోరెన్‌కు ఎదురు దెబ్బ

2019 ఎన్నికల సమయంలో వివాదం..

2019 ఎన్నికల సమయంలో టీడీపీ నేత యార్లగడ్డ వెంకట్రావుకు , వల్లభనేని వంశీమోహన్ కు మధ్య వివాదం జరిగింది. ఎన్నికల సమయంలో తెల్లవారుజమామున నాలుగు గంటల వరకు ఇద్దరూ కొట్టుకున్నారు. ప్రసాదంపాడు లో ఎన్నికల పోలింగ్ బూత్ లో వల్లభనేని వంశీ దొంగ ఓట్లు వేయిస్తున్నారని అరోపణలతో రోడ్డు మీద బైఠాయించి మరీ నిరసన చేవారు యార్లగడ్డ. ఈ విషయంలోనే వల్లభనేని మీద కేసు నమోదు అయింది. వల్లభనేని వంశీ కూడా టీడీకి చెందిన నాయకుడే. ఇతను గన్నవరం నుంచి టీడీపీ రెబల్ ఎమ్మెల్యేగా గెలిచారు.

Also read:AP Police: గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ ఆంధ్రా పోలీసులు

Advertisment
Advertisment
తాజా కథనాలు