Encounter: జమ్ముకశ్మీర్‌ లో ఉగ్రవాదుల కాల్పులు..నలుగురు సైనికులు మృతి!

జమ్ముకశ్మీర్‌ లోని దోడా ప్రాంతంలో సోమవారం అర్థరాత్రి దాటాక భద్రతా దళాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.ఈ కాల్పుల్లో నలుగురు జవాన్లు మరణించారు. అందులో ఓ ఆర్మీ అధికారి కూడా ఉన్నారని స్థానిక పోలీసులు తెలిపారు.

New Update
Encounter: జమ్ముకశ్మీర్‌ లో ఉగ్రవాదుల కాల్పులు..నలుగురు సైనికులు మృతి!

Jammu and Kashmir Encounter: దేశ సరిహద్దుల్లో టెర్రరిస్టుల చొరబాటు ఏ మాత్రం ఆగడం లేదు. దేశంలోకి వారు అక్రమంగా ప్రవేశించేందుకు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో భారత సైనికుల మీద ఉగ్ర మూకలు కాల్పులు తెగబడుతున్నాయి. తాజాగా జమ్ముకశ్మీర్‌ లోని దోడా (Doda) ప్రాంతంలో సోమవారం అర్థరాత్రి దాటాక భద్రతా దళాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.

టెర్రరిస్టులు సంచరిస్తున్నారనే ఇంటెలిజెన్స్‌ నుంచి వచ్చిన సమాచారం మేరకు దేసా అడవుల్లో భారత సైన్యం, జమ్ముకశ్మీర్‌ పోలీసులు జాయింట్‌ ఆపరేషన్‌ కొనసాగించారు. టెర్రరిస్టుల ఏరివేతకు అదనపు బలగాలు భారీగా మోహరించాయి.

అయితే ఈ క్రమంలోనే గాలింపు చర్యలను భారత సైనికులు, జమ్ముకశ్మీర్‌ పోలీసులు జాయింట్‌ ఆపరేషన్‌ ముమ్మరం చేయగా ఉగ్రవాదులు భద్రతా బలగాలపైకి ఒక్కసారిగా కాల్పులకు దిగారు.ఈ కాల్పుల్లో నలుగురు జవాన్లు మరణించారు. అందులో ఓ ఆర్మీ అధికారి కూడా ఉన్నారని స్థానిక పోలీసులు తెలిపారు.

టెర్రరిస్టులు, భారత సైనికులకు మధ్య కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. గత 35 రోజుల్లో ఇది నాలుగో ఎన్‌కౌంటర్‌ అని స్థానిక పోలీసులు ప్రకటించారు.

Also Read: వానలే.. వానలు.. మరికొన్నిరోజులు ఇలానే!

Advertisment
Advertisment
తాజా కథనాలు